
బాలీవుడ్‌లో ఐటం సాంగ్స్‌తో పేరు సంపాదించుకున్న అందాల భామ రాఖీ సావంత్. బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్ అయిన రాఖీ బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చాక తరుచూ వార్తల్లో నిలుస్తోంది. భర్త రితేశ్ సింగ్‌తో బ్రేకప్, అంతలోనే బిజినెస్‌మెన్‌తో లవ్, ఎంగేజ్‌మెంట్.. ఇలా నిత్యం సెన్సేషన్ అవుతోందీ నటి. తనకంటే ఆరేళ్లు చిన్నవాడైన అదిల్ దురానీతో ప్రేమాయణం సాగిస్తూ ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకొని తిరుగుగుంది ఈ బ్యూటీ.
అయితే తాజాగా రాఖీ సావంత్‌కు సంబంధించిన ఓ వార్త ఆమె ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తుంది. ఇటీవలె మేజర్ సర్జరీ చేయించుకున్న రాఖీ తన పరిస్థితిని అభిమానులతో షేర్ చేసుకుంది. గర్భాశయంలో కణతి వల్ల తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది. దీంతో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ముంబైలోని క్రిటికేర్ హాస్పిటల్ జుహులో సుమారు 4గంటలపాటు శస్త్రచికిత్స జరిగింది.
సర్జరీ తర్వాత చాలా బలహీనంగా అనిపించింది అంటూ రాఖీ తెలిపింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ ఆమె ఫ్యాన్స్ సహా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment