Punjab court
-
మల్లికార్జున ఖర్గేకు షాక్.. పంజాబ్ కోర్టు సమన్లు
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. రూ.100 కోట్ల పరువు నష్టం కేసులో జులై 10 న న్యాయస్థానం ముందు హాజరు కావాలని సంగ్రూర్ కోర్టు ఖర్గేకు సమన్లు పంపింది. కాగా ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ విశ్వహిందూ పరిషత్ యువజన విభాగమైన బజరంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బజరంగ్ దళ్ సంస్థను నిషేధిత ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)తో పోలుస్తూ వ్యాఖ్యలు చేయడంతో వివాదానికి దారితీసింది. దీనిపై బజరంగ్ దళ్ కోర్టును ఆశ్రయించింది. విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దల్ ఫౌండర్ హితేష్ భరద్వాజ్ సంగ్రూర్ కోర్టులో పిటిషన్ కేసు దాఖలు చేశారు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా భజరంగ్‌దళ్‌ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఖర్గేపై రూ.100 కోట్ల పరువు నష్టం కేసు వేశారు. దీనిపై సినీయర్ డివిజన్ బెంజ్ విచారణ చేపట్టింది. మల్లికార్జున ఖర్గేను జులై 10 న కోర్టుకు హాజరు కావాలని సివిల్ జడ్జి రమణదీప్ కౌర్ ఏఐసీసీ అధ్యక్షుడికి సమన్లు జారీ చేసింది. కాగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో భజరంగ్ దళ్‌ను దేశ వ్యతిరేక సంస్థలతో పోల్చిందని భరద్వాజ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కర్ణాటకలో తాము అధికారంలోకి వస్తే ఆ సంస్థను నిషేధిస్తామని కూడా హామీ ఇచ్చిందని తెలిపారు. చదవండి: కర్ణాటక సీఎం ఎవరు?.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు -
పంజాబ్ కోర్టు కాంప్లెక్స్‌లో పేలుడు: ఇద్దరు మృతి
Punjab Ludhiana Court Blast: పంజాబ్‌లో లూథియానాలోని కోర్టు కాంప్లెక్స్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. భవనంలో రెండో అంతస్తులోని బాత్రూమ్లో పేలుడు సంభవించిందని అధికారులు అన్నారు. పైగా పేలుడు తీవ్రతకు బాత్రూమ్ గోడలు దెబ్బతిన్నడమే కాక సమీపంలోని అద్దాలు కూడా పగిలిపోయాయి అని చెప్పారు. అయితే పేలుడు సంభవించిన సమయంలో జిల్లా కోర్టు పనిచేస్తోందని చెప్పారు. పోలీసు యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టింది. (చదవండి: హ్యాట్సాఫ్!..కుక్కని భలే రక్షించాడు) అయితే అగ్నిమాపక సిబ్బంది కూడా సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. పైగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌కు చెందిన బాంబు డేటా సెంటర్‌కు చెందిన బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. ఈ మేరకు పేలుడు ఎలా సంభవించిందో విచారించడానికి చండీగఢ్ నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) బృందం లూథియానా జిల్లా కోర్టుకు రానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పంజాబ్ పోలీసులను ఈ ఘటన గురించి సత్వరమే విచారణ చేపట్టాలని ట్విట్టర్లో కోరారు. అంతేకాదు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నారు. ఈ మేరకు చన్నీ మాట్లాడుతూ..."ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొన్ని పంజాబ్ వ్యతిరేక శక్తులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. (చదవండి: ఆరేళ్ల చిన్నారి.. రూ.3.6 కోట్ల విలువైన ఇల్లు.. ఎలా కొనుగోలు చేసిందో తెలుసా?) -
రైతుకు నష్టపరిహారంగా రైలు!
కోర్టు తీర్పు ఇరవై బోగీల ఎక్స్‌ప్రెస్ రైలు.. ‘స్వర్ణ శతాబ్ది’! రోజూ ఢిల్లీ–అమృత్‌సర్‌ల మధ్య నడుస్తుంది. రెండు రోజుల క్రితం వరకు ఈ రైలు భారతీయ రైల్వేలది. ఇప్పుడు సంపూరణ్ సింగ్ అనే రైతుది! రైలే కాదు, లూథియానాలోని ఒక రైల్వే స్టేషన్ కూడా ఇప్పుడు ఈయన ఆధీనంలోకి వచ్చింది. రైల్వేశాఖ సంపూరణ్ సింగ్‌కి చెల్లించవలసిన కోటి రూపాయల బకాయీలను ఎంతకూ తీర్చకపోవడంతో స్వర్ణ శతాబ్ది రైలును, లూథియానా స్టేషన్‌ను అతడికి బదలాయిస్తూ పంజాబ్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయనిప్పుడు తనకు దక్కిన స్టేషన్‌ని అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. మరి రైలును ఎలా అమ్మడం? ఎవరికి అమ్మడం? సంపూరణ్ సింగ్ వచ్చిన కొత్త సమస్య ఇది. పాత సమస్య ఏంటంటే... సంపూరణ్ సింగ్‌ది లూథియానాలోని కటాన గ్రామం. ఆయనొక రైతు. కొద్దిగా పొలం ఉంది. అందులో గోధుమలు పండించేవాడు. 2007లో లూథియానా చండీఘర్ల మధ్య కొత్త రైల్వే లైను వెయ్యడానికి ఉత్తర రైల్వే శాఖ ఆయన పొలంలోని 5.5 బిగాల భూమిని సేకరించింది. పరిహారంగా ఆయనకు 45 లక్షల రూపాయలను చెల్లించింది. అప్పటికైతే సంపూరణ్ సంతోషించాడు కానీ, పక్కనే బర్వాలాలో సేకరించిన భూమికి తనకు ఇచ్చినదాని కన్నా ఎక్కువ పరిహారం ఇవ్వడం ఆయనకు కోపం తెప్పించింది. అదే విషయాన్ని రైల్వే అధికారులను అడిగితే వారు నోరు మెదపలేదు. దాంతో కోర్టుకు వెళ్లాడు. కోర్టు ఆ వాదనా ఈ వాదనా విని, ఆ లెక్కా, ఈ లెక్కా వేయించి రైల్వేశాఖ సంపూరణ్‌కి వెంటనే ఒక కోటీ 47 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది. కేసు అక్కడితో ఆగలేదు. ముందు చెల్లించిన మొత్తాన్ని మినహాయించగా రైల్వే శాఖ తను ఇవ్వాల్సిన కోటి రూపాయలను సంపూరణ్‌కి ఇవ్వకుండా తనూ వాయిదాలకు వెళ్లివస్తూ కాలక్షేపం చేసింది. సంపూరణ్ 2012లో మరో కేసు వేశాడు. దానిపై వాదోపవాదాలు అయ్యాక రైల్వే శాఖ ఈ రైతుకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇవ్వాల్సిందేనని 2015 జనవరిలో తీర్పు చెప్పింది. దానికీ బదులు లేదు. దాదాపు పదేళ్ల పాటు సాగిన ఈ కేసులో చివరికి మొన్న శుక్రవారం అంతిమ తీర్పు వెలువడింది. రైల్వే శాఖ కోర్టు ఆదేశాలను అనుసరించి కోటి రూపాయల పరిహారాన్ని చెల్లించకపోవడంతో అంతే విలువైన ఒక రైలును, ఒక రైల్వేస్టేషన్‌ను సంపూరణ్‌కు కోర్టు స్వాధీనం చేసింది. అదే రోజున స్వాధీన పత్రాలు పట్టుకుని సంపూరణ్ లూథియానా రైల్వేస్టేషన్లో వేచి ఉన్నప్పుడు స్వర్ణ శతాబ్ది ‘కూ ఛుక్‌చుక్’ మంటూ వచ్చింది ఆగింది కానీ, ‘ఈ రైలు నాది’ అని ఆయన ఆ రైలును అక్కడే నిలిపేయలేకపోయారు. ‘‘గమ్యాలకు చేరుకునేందుకు అలసిసొలసి ఉన్న అంత మంది ప్రయాణీకులను చూశాక దానిని స్వాధీనం చేసుకోడానికి మనసొప్పలేదు’’ అని సంపూరణ్ అన్నారు. పెద్ద సమస్యే. స్టేషన్లో ఆగిన స్వర్ణశతాబ్ది రైలింజన్లోకి ఎక్కి, రైలు స్వాధీన పత్రాలు చూపిస్తున్న రైతు సంపూరణ్ సింగ్