సనా: యెమెన్‌లోని హౌతీ మిలిటెంట్ల స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. అల్‌హొదైదా పోర్టుతో పాటు పలు చోట్ల బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ముగ్గురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి.
పోర్టులోని చమురు నిల్వలకు మంటలంటుకున్నాయి. ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి. శుక్రవారం తమ రాజధాని టెల్ అవీవ్‌పై హౌతీల డ్రోన్ దాడికి ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఇజ్రాయెల్,హమాస్ యుద్ధం మొదలయ్యాక హౌతీలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయడం ఇదే తొలిసారి. యెమెన్‌లో హౌతీలకు చాలా పట్టున్న నగరం అల్‌హొదైదా. ఇక్కడి ప్రజలకు పోర్టు జీవనాడి లాంటిది. ఇంత కీలకమైన పోర్టు, పవర్ ప్లాంట్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment