ఇంఫాల్: మణిపూర్ రాజధాని ఇంఫాల్లో శుక్రవారం శక్తిమంతమైన బాంబు పేలిన ఘటనలో రెండేళ్ల పాప, ఓ సీఆర్పీఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. రాజ్భవన్కు సమీపంలో స్టేట్ మ్యూజియం వద్ద ఈ బాంబుపేలుడు సంభవించినట్టు అధికారులు చెప్పారు. అక్కడ పార్క్ చేసిన కార్లు దెబ్బతిన్నాయి.
క్షతగాత్రులను చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు బాధ్యులు ఎవరన్నది ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురష్కరించుకుని మణిపూర్ వ్యాప్తంగా పోలీసులు, పారామిలటరీ బలగాలతో భద్రతను పటిష్టంచేశారు.
ఇంఫాల్లో బాంబుపేలుడు, ఇద్దరికి గాయాలు
Published Fri, Aug 5 2016 8:19 PM | Last Updated on Sat, Aug 25 2018 5:39 PM
Advertisement
Advertisement