Suicide Blast Rocks Kabul International Cricket Stadium During a T20 Match - Sakshi
Sakshi News home page

క్రికెట్ గ్రౌండ్‌లో ఆత్మాహుతి దాడి.. మ్యాచ్‌ జరుగుతుండగానే..!

Published Fri, Jul 29 2022 9:08 PM | Last Updated on Fri, Jul 29 2022 9:43 PM

Suicide blast rocks Kabul International cricket stadium during a T20 match - Sakshi

ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ నగరం బాంబు దాడితో మరోసారి ఉలిక్కి పడింది. అలోకోజాయ్ కాబూల్ అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్‌లో మ్యాచ్‌ జరుగుతుండగా శుక్రవారం ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ష్పగీజా క్రికెట్ లీగ్‌లో భాగంగా  పామిర్ జల్మీ, బ్యాండ్-ఎ-అమీర్ డ్రాగన్స్ మధ్య సందర్భంగా ఈ ఘటన జరిగింది.  స్టాండ్స్‌లో కూర్చున్న అభిమానుల మధ్య ఈ పేలుడు సంభవించింది. 

కాగా ఊహించని పరిణామం చోటు చేసుకోవడంతో ప్రేక్షకులు భయాందోళనలతో పరిగెత్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక  ఈ ఘటనలో చాలా మందికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. అదే విదంగా ఇరు జట్ల ఆటగాళ్లను బంకర్‌లోకి సురక్షితంగా అధికారులు తరలించారు. తాజా నివేదికల ప్రకారం.. ఈ ఘటన జరిగినప్పడు ఐక్యరాజ్యసమితి అధికారులు కూడా స్టేడియంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సంఘటనను కాబూల్ పోలీసు ప్రధాన కార్యాలయం అధికారికంగా ధృవీకరించింది. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించలేదు. కాగా గత కొద్దిరోజులుగా కాబూల్‌లో వరుసగా బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి.
చదవండి: Ind W Vs Aus W: గార్డనర్ మెరుపు ఇన్నింగ్స్‌.. ఆస్ట్రేలియా చేతిలో భారత్‌ ఓటమి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement