international stadium
-
క్రికెట్ గ్రౌండ్లో ఆత్మాహుతి దాడి.. మ్యాచ్ జరుగుతుండగానే..!
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నగరం బాంబు దాడితో మరోసారి ఉలిక్కి పడింది. అలోకోజాయ్ కాబూల్ అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతుండగా శుక్రవారం ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ష్పగీజా క్రికెట్ లీగ్‌లో భాగంగా పామిర్ జల్మీ, బ్యాండ్-ఎ-అమీర్ డ్రాగన్స్ మధ్య సందర్భంగా ఈ ఘటన జరిగింది. స్టాండ్స్‌లో కూర్చున్న అభిమానుల మధ్య ఈ పేలుడు సంభవించింది. కాగా ఊహించని పరిణామం చోటు చేసుకోవడంతో ప్రేక్షకులు భయాందోళనలతో పరిగెత్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ ఘటనలో చాలా మందికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. అదే విదంగా ఇరు జట్ల ఆటగాళ్లను బంకర్లోకి సురక్షితంగా అధికారులు తరలించారు. తాజా నివేదికల ప్రకారం.. ఈ ఘటన జరిగినప్పడు ఐక్యరాజ్యసమితి అధికారులు కూడా స్టేడియంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సంఘటనను కాబూల్ పోలీసు ప్రధాన కార్యాలయం అధికారికంగా ధృవీకరించింది. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించలేదు. కాగా గత కొద్దిరోజులుగా కాబూల్‌లో వరుసగా బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి. చదవండి: Ind W Vs Aus W: గార్డనర్ మెరుపు ఇన్నింగ్స్.. ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి #NEWS. A blast reported inside a cricket stadium among the audience. — Anees Ur Rehman (@JournalistAnees) July 29, 2022 -
లక్నో టీ20లో అపశ్రుతి..
లక్నో : భారత్, వెస్టిండీస్‌ల మధ్య లక్నోలో మంగళవారం జరిగిన రెండో టీ 20 మ్యాచ్ సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. నూతనంగా నిర్మించిన అటల్ బిహారి వాజ్‌పేయి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహణ లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. కామెంటరీ బాక్స్‌లోకి సునీల్ గావస్కర్, సంజయ్ మంజ్రేకర్‌లు చేరుకున్న కొద్దిసేపటికే గ్లాస్ డోర్స్ పగిలాయి. ఈ ఘటన నుంచి వారు త్రుటిలో తప్పించుకున్నారు. తాము లోపలికి ప్రవేశించగానే గ్లాస్ డోర్స్‌లో ఒకటి కుప్పకూలిందని అదృష్టవశాత్తూ తామంతా క్షేమంగా ఉన్నామని మంజ్రేకర్ చెప్పుకొచ్చారు. కాగా ఇకానా స్పోర్ట్స్ సిటీలోని ఈ స్టేడియం ప్రైవేట్ ఆస్ధి కావడంతో తామేమీ చేయలేమని యూపీ క్రికెట్ అసోనియేషన్ అధికారులు పేర్కొన్నారు. మ్యాచ్‌ను కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులు సైతం స్టేడియం నిర్వాహకుల వైఫల్యంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మీడియా బాక్స్‌లో ఏర్పాటు చేసిన ఇంటర్నెట్, వపర్ కనెక్షన్లు లోపభూయిష్టంగా ఉండటంతో పాటు పలుమార్లు విద్యుత్ సరఫరాలో అవాంతరాలు ఎదురవడంతో మీడియా ప్రతినిధులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. -
జోరుమీద యువ భారత్
-
జోరుమీద యువ భారత్
ఉ. గం. 11.00 నుంచి స్టార్‌స్పోర్ట్స్ -2లో ప్రత్యక్ష ప్రసారం దుబాయ్ : డిఫెండింగ్ చాంపియన్ యువ భారత్‌కు అండర్-19 ప్రపంచకప్‌లో అగ్నిపరీక్ష ఎదురుకానుంది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో శనివారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. అయితే లీగ్ దశలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఊపుమీదున్న భారత్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. విజయ్ జోల్ సారథ్యంలోని జట్టు ఇంగ్లండ్‌తో పోలిస్తే పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ కుర్రాళ్లు తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. బ్యాటింగ్‌లో ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సంజు శామ్సన్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రపంచకప్‌లో శామ్సన్ ఇప్పటికే రెండు అర్ధ సెంచరీలు చేశాడు. గినియాతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో అయితే అతడు చెలరేగిపోయాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లోనూ శామ్సన్ అదే జోరు కొనసాగిస్తాడని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఓపెనర్లు అంకుశ్ బైన్స్, అఖిల్ హర్వాద్కర్ గత మ్యాచ్‌లో రాణించారు. వీరికి తోడు కెప్టెన్ జోల్ కూడా సత్తా చాటితే ఇంగ్లండ్ బౌలర్లకు కష్టాలు తప్పవు. భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈటోర్నీలో తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లోనూ అతడు కీలక పాత్ర పోషిస్తాడని అంచనా వేస్తున్నారు. మిగిలిన వాళ్లు కూడా గాడిలో పడితే ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందులు తప్పవు. మరోవైపు ఇంగ్లండ్‌పై రికార్డులు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయి. భారత్ 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఇంగ్లండ్ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో నెగ్గింది. అలాగని ఇంగ్లండ్‌ను ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. లీగ్ దశలో ఆ జట్టు న్యూజిలాండ్, యూఏఈలపై భారీ తేడాతో విజయం సాధించింది. శ్రీలంకతో మ్యాచ్‌లో మాత్రం ఒక వికెట్ తేడాతో ఓడింది. శనివారం జరిగే మరో క్వార్టర్ ఫైనల్లో పాకిస్థాన్, శ్రీలంక తలపడతాయి.