రెచ్చిపోయిన ఉగ్రవాదులు: పోలీస్‌ శిబిరంపై బాంబు దాడి | Bomb Attack On Police Check Post In Iraq: Suspected IS | Sakshi
Sakshi News home page

పోలీస్‌ శిబిరంపై బాంబు దాడి: 13 మంది పోలీసులు దుర్మరణం

Published Sun, Sep 5 2021 5:59 PM | Last Updated on Sun, Sep 5 2021 6:03 PM

Bomb Attack On Police Check Post In Iraq: Suspected IS - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బాగ్దాద్‌: ఐసిస్‌ ఉగ్రదాడులు రెచ్చిపోయారు. తమ ఆట కట్టించేందుకు పని చేస్తున్న పోలీసులను మట్టుబెట్టారు. పోలీసులే లక్ష్యంగా బాంబు దాడి జరిపారు. ఈ ఘటనలో ఏకంగా 13 మంది పోలీసులు కన్నుమూశారు. దీంతో ఇరాక్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఆ దేశంలోని కిర్కుక్‌ పట్టణానికి 65 కిలోమీటర్ల దూరంలోని అల్‌ రషద్‌ ప్రాంతంలో అర్ధరాత్రి ఈ దారుణ సంఘటన జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న ఫెడరల్‌ పోలీస్‌ చెక్‌పోస్టుపై ఇస్లామిక్‌ స్టేట్‌ ఆర్గనైజేషన్‌ ఉగ్రవాదులు బాంబు దాడి జరిపారు. ఈ ఘటనలో భద్రతా దళాలకు చెందిన 13 మంది మృతి చెందారు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారని ఆ దేశ భద్రత అధికారి వెల్లడించారు. వారి దాడుల నేపథ్యంలో ఆ దేశంలో హై అలర్ట్‌ ప్రకటించారు.

చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్‌ అక్తర్‌కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక
చదవండి: తండ్రిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు.. సమర్ధించిన ముఖ్యమంత్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement