
ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో మరోసారి బాంబు పేలుడు అలజడి రేపింది. శనివారం జరిగిన పెట్రోల్ బాంబు పేలుడులో ఐదుగురు రక్షణ సిబ్బందితో పాటు ఓ ఆర్మీ మేజర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు పాక్ ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. ఇరాన్‌కు 14 కిలో మీటర్ల దూరంలో గల సరిహద్దులో రోడ్డు పక్కకు ఆగి ఉన్న కారు ద్వారా పెట్రోల్ బాంబు దాడికి పాల్పడినట్లు వెల్లడించింది. ఇది బలుచిస్తాన్ మిలిటెంట్ల దాడిగా పాక్ ఆర్మీ అనుమానం వ్యక్తం చేస్తోంది. బాంబు పేలుడు జరిగిన ప్రాంతంలో సిబ్బంది వివరాలను సేకరిస్తోంది. రక్షణ సిబ్బంది దుర్మరణం పట్ల ఆ దేశ ఆర్మీ విచారం వ్యక్తం చేసింది. (భారత్‌పై పాక్ తీవ్ర వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment