ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని బజూర్‌లో భారీ పేలుడు సంభవించింది. దాదాపు 40 మంది మృతి చెందారు. 150 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. జమియాత్ ఉలేమా-ఎ-ఇస్లాం-ఫజల్ (జేయూఐ-ఎఫ్) రాజకీయ పార్టీ ర్యాలీలో ఈ దుర్ఘటన జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Powerful explosion at a political rally left several people dead in Khyber Pakhtunkhwa #Pakistan #BREAKING #BreakingNews #Pakistanblast pic.twitter.com/A7nD8Vaym1
— Eliteworld (@eliteworldwaves) July 30, 2023
ఖైబర్ ఫక్తుంక్వా ప్రావిన్స్‌లోని బజూర్‌లో జేయూఐఎఫ్ రాజకీయ పార్టీ మీటింగ్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో జనం పాల్గొన్నారు. ఇందులో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. భారీగా ప్రాణ నష్టం జరిగిందని అధికారులు తెలిపారు.
పేలుడును జేయూఐఎఫ్ నాయకుడు హఫీజ్ హమ్దుల్లా ఖండించాడు. మానవత్వంపై దాడిగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నాడు. పేలుళ్లపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: రష్యాపై డ్రోన్ల దాడికి పాల్పడ్డ ఉక్రెయిన్.. మాస్కో విమానాశ్రయం మూసివేత
Comments
Please login to add a commentAdd a comment