
జమ్ము: ఉదమ్‌పూర్ నగర కోర్టు కాంప్లెక్సుకు దగ్గరోని స్లాథియా చౌక్ వద్ద బుధవారం జరిగిన పేలుడులో ఒక వ్యక్తి మరణించగా, 14మంది గాయపడ్డారు. పేలుడులో ఐఈడీ ఉపయోగించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసు ఏడీజీపీ ముకేశ్ సింగ్ చెప్పారు. పేలుడు చాలా శక్తివంతమైనదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారని, వారు క్షేమంగానే ఉన్నారని పోలీసులు తెలిపారు. పేలుడుపై విచారణ జరుపుతున్నామన్నారు.
(చదవండి: రాజీవ్ హత్య కేసు దోషికి బెయిల్)