న్యూయార్క్:ఇటీవలే రెండోసారి అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు తనపై ఉన్న క్రిమినల్ కేసుల్లో వరుసగా ఊరట లభిస్తోంది.ఇప్పటికే ట్రంప్‌పై ఉన్న 2020 ఎన్నికల ఫలితం తారుమారు కేసు విచారణను పక్కనపెడుతున్నట్లు కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే శృంగార తార స్టార్మీ డేనియల్స్ తనపై వేసిన హష్‌మనీ కేసుపై ట్రంప్ తాజాగా దృష్టి సారించారు. తనను ఇప్పటికే దోషిగా ప్రకటించిన ఈ కేసును కొట్టివేయాలని ట్రంప్ తాజాగా న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు అధ్యక్ష పదవి నిర్వహించేందుకు తనకు అడ్డంకిగా మారుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
నిజానికి ఈ కేసులో ట్రంప్‌కు నవంబర్ 26నే శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. శిక్ష ఖరారు అంశాన్ని జడ్జి ఇప్పటికే నిరవధికంగా వాయిదా వేశారు. అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికైన వారికి క్రిమినల్ కేసుల నుంచి రక్షణ ఉంటుంది. ఇది ట్రంప్‌కు ప్రస్తుతం అనుకూలంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment