సాక్షి: హార్వే వీన్ స్టీన్.. ఇప్పుడు హాలీవుడ్‌లో చర్చనీయాంశమవుతున్న పేరు. ఈయనగారి రాసలీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈఘనుడు ఏకంగా 34 మంది హీరోయిన్లను ఇతను బెదిరించి.. భయపెట్టి.. బలవంతంగా అనుభవించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా తన సంస్థలో పని చేయడానికి వచ్చిన అమ్మాయిలను సైతం లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. హీరోయిన్ సోఫీ దీక్ష్‌తో హర్వే అకృత్యాలను వెలుగులోకి తీసుకురాగా.. హార్వే రాసలీలలకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.
తాజాగా ఒక మోడల్‌తో వీన్ స్టీన్ దారుణంగా మాట్లాడిన ఆడియో టేపు ఒకదాన్ని అంతర్జాతీయ వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్ బయట పెట్టింది. ఆ ఆడియో టేపులో వీన్ స్టీన్ ఓ అమ్మాయిని తన గదికి రమ్మని బలవంత పెడుతున్నాడు. తన గదికి వస్తే నీ కెరీర్ దిశా దశా మారిపోతుందని వీన్ స్టీన్ అంటుంటే.. తాను అలాంటిదాన్ని కాదని తనను వదిలేయాలని ఆమోడల్ వీన్‌స్టీన్‌ను వేడుకొంటోంది. అయితే హార్వే మాత్రం ఇదంతా తనుకు చాలా అలవాటైన విషయం అని బదులిచ్చాడు. అత్యంత అసభ్యకరంగా ఆమోడల్‌తో ప్రవర్తించినట్లు ఆడియో టేపులో స్పష్టం అయ్యింది. ఈ టేపులో వినిపించే వాయిస్ ఆంబ్రా బటిలానా అనే ఇటాలియన్ మోడల్‌కు చెందినదిగా న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఈ ఆడియోతో జనాలకు మాత్రం హర్వీ వీన్ స్టీన్ విషయంలో ఒక అంచనాకు వస్తున్నారు.
కాగా, హర్వే యవ్వారాలు వెలుగులోకి వస్తుండటంతో అతన్ని వెయిన్‌స్టెన్ కంపెనీ నుంచి వెలివేస్తున్నట్లు సోదరుడు బాబ్ వెయిస్టెన్ ప్రకటించాడు. తన సోదరుడు ఓ మృగమంటూ బాబ్ ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశాడు. అదే సమయంలో హర్వే ఆరోపణల నేపథ్యంలో వెయిన్‌స్టెన్ కంపెనీని అమ్మబోతున్నట్లు వస్తున్న వార్తలను బాబ్ కొట్టి పడేశారు. హీరోయిన్ సోఫీ దీక్ష్‌తో హర్వే అకృత్యాలను వెలుగులోకి తీసుకురాగా.. అప్పటి నుంచి ఒక్కో హీరోయిన్ తమకు ఎదురైన అనుభవాల గురించి వివరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment