
‘మీ టూ’ హాష్ ట్యాగ్ ఉద్యమం వృ«థా కాలేదు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవంలో ఫలితం కనిపించింది. రెడ్ కార్పెట్ ఆహ్వానాన్ని నలుపు దుస్తుల వస్త్రధారణ నిరసనగా మార్చింది. ప్రపంచాన్ని మొత్తం తనవైపు తిప్పుకునే íసినిమా అవార్డులు రెండే రెండు. ఒకటి ఆస్కార్, రెండు గోల్డెన్ గ్లోబ్! ప్రసిద్ధ హాలీవుడ్ నిర్మాత హార్వీ వైన్‌స్టీన్ లైంగిక వేధింపుల గురించి మొదట ఓ బాధితురాలు ‘మీ టూ’ ఆన్‌లైన్ ఉద్యమంలో వెళ్లబోసుకుంది. అప్పటి నుంచి అతని మీదా, హాలీవుడ్ పరిశ్రమలో ఉన్న ఇలాంటి వేధింపుల మీదా మాట్లాడే ధైర్యాన్ని తెచ్చుకున్నారు బాధితులు.
ఈ అరాచకాలను ఖండించడానికి, అణచివేయడానికి ఎలాంటి అవకాశం దొరికినా జారవిడుచుకోకూడదని ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమలోని మహిళలు ఒక ప్రమాణం చేసుకున్నట్టుంది! అందుకే హాలీవుడ్‌తో పాటు మొత్తం ఎంటర్‌టైన్‌మెంట్ మీడియాలో జరుగుతున్న ఈ అకృత్యాలకు.. హార్వీ వైన్‌స్టీన్, ఇంకా హాలీవుడ్‌లోని అలాంటి ప్రబుద్ధులకు వ్యతిరేకంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవానికి విచ్చేసిన ప్రముఖులంతా నల్ల దుస్తుల్లో దర్శనమిచ్చారు. ఇది మంచి పరిణామం! ‘మీ టూ’ ఉద్యమం బలహీనపడకుండా ఊపిరిపోసే శుభ సంకేతం.
Comments
Please login to add a commentAdd a comment