రెడ్ కార్పెట్
కాన్స్ ఫెస్టివల్‌లో సినిమాలకు ఎంట్రీ దొరికినా సెలబ్రిటీలకు ఆహ్వానం దొరికినా చాలా ఘనత. ఈసారి కాన్స్‌లో చాలా ఏళ్ల తర్వాత ఒక భారతీయ సినిమా
ప్రదర్శితం కానుంది. అదలా ఉంటే మన దేశానికి చెందిన ముగ్గురు యువ ఇన్‌ఫ్లుయెన్సర్లను కాన్స్ ఆహ్వానించింది. మే 14–25 మధ్య జరగనున్న ఈ ఫెస్టివల్‌లో ఆర్‌జె కరిష్మా, ఆస్థా షా,నిహారికా ఎన్.ఎమ్ రెడ్ కార్పెట్ మీద దర్జాగా నడవనున్నారు.
వారి పరిచయాలు.
ప్రపంచ సినిమా ప్రతిష్ఠాత్మకంగా భావించే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నేటి నుంచి (మే 14) నుంచి ఫ్రాన్స్‌లోని కాన్స్ నగరంలో ్ర΄ారంభం కానుంది. ఆస్కార్ అవార్డ్స్‌తో సమానంగా కాన్స్ అవార్డులను భావిస్తారు. ఈసారి భారతదేశం నుంచి ΄ాయల్ క΄ాడియా దర్శకత్వం వహించిన ‘ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్’ సినిమా మెయిన్ కాంపిటీషన్‌లో ఎంట్రీ సాధించింది. సినిమాకు, సంస్కృతికి ్ర΄ాధాన్యం ఇచ్చే ఈ ఫెస్టివల్‌లో భారతదేశం నుంచి కొంతమంది యువ ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఆహ్వానం అందింది. అతిరథ మహారథులతో కలిసి రెడ్ కార్పెట్ మీద నడిచే అవకాశం వీరు ΄÷ందారు. స్ఫూర్తినిచ్చే తమ
జీవితాల ద్వారా, ప్రతిభ, విజయం ద్వారా వీరు అవకాశం ΄÷ందారు. అలాంటి ముగ్గురి
పరిచయం.
ఆస్థా షా
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా తన జీవిత ΄ోరాటంతో ప్రభావం చూపుతున్న ఆస్థా షాది ఢిల్లీ. 24 ఏళ్ల ఆస్థా 8 ఏళ్ల వయసు నుంచి విటిలిగో (తెల్లమచ్చలు) బారిన పడింది. పూర్తిగా నివారణ లేని ఈ చర్మవ్యాధి ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ప్రతి ఒక్కరూ ‘ఈ అమ్మాయికి పెళ్లవుతుందా’ అని తల్లిదండ్రులను వేధించేవారు. అన్ని రకాల వైద్య విధానాలతో విసిగి΄ోయిన ఆస్థా నేను ఎలా ఉన్నా నా జీవితం ముఖ్యం అనుకుని చదువు మీద దృష్టి పెట్టింది.
మంచి ప్రతిభ చూపి ఇప్పుడు హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్‌లో ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా పని చేస్తోంది. ఇన్‌స్టా, ట్విటర్ ద్వారా ΄ాపులర్ అయ్యి డబ్బు సం΄ాదిస్తోంది. ‘ఆడపిల్లలకు విటిలిగో ఉంటే ఆ అమ్మాయిలను తల్లిదండ్రులే ఇంటి నుంచి బయటకు రానీకుండా చూస్తారు. ఆమెను న్యూనతకు గురి చేస్తారు. విటిలిగో కేవలం ఒక చర్మస్థితి. ఇప్పుడు నేను పూర్తి విటిలిగోతో తెల్లగా అయి΄ోయాను. కాని నా జీవితాన్ని సమర్థంగా జీవిస్తున్నాను. మీరు ఎలా ఉన్నారో అలా కనపడుతూ ముందుకు సాగి΄ోండి’ అని చెప్పి లక్షలాది మంది అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పెంచుతోంది ఆస్థా. అందుకే ఆమెకు ఆహ్వానం.
ఆర్‌జె కరిష్మా
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నెలకు 30 లక్షలు సం΄ాదిస్తున్న కరిష్మా బహురూ΄ాలు వేసి కామెడీ చేయడంలో నేర్పరి. చిన్నప్పుడు ఒకరోజు కరిష్మా గదిలో నుంచి రకరకాల గొంతులు వినిపిస్తుంటే తల్లి కంగారు పడి తలుపు తట్టి ‘కరిష్మా నీతో ఎవరున్నారు’ అని అడిగితే తలుపు తెరిచిన కరిష్మా అవన్నీ తాను మిమిక్రీ చేస్తున్న గొంతులని చెప్పింది. జమ్ము కశ్మీర్‌కు చెందిన కరిష్మా నటి కావాలనుకుని ఆర్.జె. అయ్యి ఆ తర్వాత కామెడీ బిట్స్ చేసే యూట్యూబర్‌గా ఖ్యాతి ΄÷ందింది. ఇండోర్‌లో రెడ్ ఎఫ్.ఎం. లో పని చేసేటప్పుడు ఆమె షో సూపర్‌హిట్ అయ్యింది. మానవ ప్రవర్తనల్లోని భిన్నత్వాన్ని ఆమె చూపే విధానం వల్ల చాలా సీరియస్ విషయాలను కూడా తేలిగ్గా తీసుకుని ముందుకు సాగవచ్చనే ధిలాసా ఇస్తుంది. అందుకే ఆమెకు ఈ ఆహ్వానం.
నిహారికా ఎన్.ఎమ్.
బెంగళూరులో పుట్టి పెరిగి ఇప్పుడు లాస్ ఏంజెలిస్‌లో ఉంటున్న నిహారికకు తెలుగు బాగా వచ్చు. బహుశా తెలుగు మూలాలు ఉండొచ్చు. యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో నిహారిక చేసే వీడియోలకి లక్షల మంది ఫాలోయెర్స్ ఉన్నారు. నిహారికతో షో చేస్తే ప్రచారం లభిస్తుందని భావించే పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారు. 27 ఏళ్ల ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ లోపలొకటి బయటొకటిగా ఉండే మనుషులను గేలి చేస్తూ బోలెడన్ని వీడియోలు చేసి నవ్విస్తుంటుంది.
‘మార్కులు వస్తేనే జీవితం. గొప్ప మార్కులు వచ్చినవారే గొప్ప జీవితాన్ని గడపగలరు అనే భావన నుంచి తల్లిదండ్రులు బయటపడాలి. పిల్లల తెలివితేటలు, ఆసక్తిని బట్టి వారిని ్ర΄ోత్సహిస్తే వారు సక్సెస్ అవుతారు. నేను డాక్టరో ఇంజనీరో కావాలని మా అమ్మా నాన్నలు అనుకున్నారు. కాని లక్షలాది మంది అభిమానించే యూ ట్యూబర్‌ని అయ్యాను. కలలు కని ముందుకు సాగండి’ అనే సందేశం ఇస్తుంటుంది నిహారిక. ఆమె ఇప్పుడు రెడ్ కార్పెట్ మీద హంగామా చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment