ఆ నిర్మాత రాత్రిళ్లు మృగాడిగా మారేవాడు! | Actress Rose McGowan Slams Producer Harvey Weinstein | Sakshi
Sakshi News home page

ఆ నిర్మాత రాత్రిళ్లు మృగాడిగా మారేవాడు!

Published Sun, May 27 2018 11:20 AM | Last Updated on Mon, Jul 23 2018 8:51 PM

Actress Rose McGowan Slams Producer Harvey Weinstein - Sakshi

హార్వీ వీన్‌స్టీన్‌తో నటి రోస్‌ మెక్‌గోవాన్‌ (ఫైల్‌ ఫొటో)

న్యూయార్క్‌ : లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన హాలీవుడ్‌ మూవీ మొఘల్‌, నిర్మాత హార్వీ వీన్‌స్టీన్‌ను కఠినంగా శిక్షించాలన్నారు నటి రోస్‌ మెక్‌గోవాన్‌. తాను ఇచ్చిన ఫిర్యాదుతో నిర్మాతపై పోలీసులు స్పందించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. వీన్‌స్టీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో నటి రోస్‌ టీవీ కార్యక్రమంలో స్పందించారు. అతడు మహిళలపై అత్యాచారాలకు పాల్పడేందుకు పగటి సమయాన్ని ఎంచుకునేవాడు కాదని, రాత్రిళ్లు అందుకు తగినదిగా వీన్‌స్టీన్‌ భావించేవాడని ఆరోపించారు.

‘చేతులకు బేడీలు, ఓ మహిళా డిటెక్టీవ్‌ను చూశాక హర్వీ వీన్‌స్టీన్‌ అరెస్ట్‌ అయ్యాడని నిర్దారించుకున్నాను. అరెస్ట్‌ ఒక్కటే నిందితుడికి తగిన శిక్షగా భావిస్తున్నారా అన్న ప్రశ్నకు.. ఇప్పుడే అతడి పతనం ఆరంభమైంది. ఇది శుభసూచకంగా భావిస్తున్నాను. అతడి నుంచి వేధింపులు ఎదుర్కొన్న మహిళా ఆర్టిస్టులకు ఇది సంతోషదాయకం. బెయిల్‌పై అప్పుడే బయటకు వచ్చేసిన వీన్‌స్టీన్‌కు త్వరలోనే కఠినశిక్ష పడాలని తాను కోరుకుంటున్నట్లు’ నటి రోస్‌ మెక్‌గోవాన్‌ తెలిపారు.

పలు లైంగిక వేధింపుల కేసుల్లో నిందితుడుగా ఉన్న నిర్మాణ హార్వీ వీన్‌స్టీన్‌ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీన్‌స్టీన్‌ తమను రేప్‌ చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఏంజెలినా జోలీ, సల్మా హయక్‌ సహా 80 మందికిపైగా హాలీవుడ్‌ నటీమణులు ఆరోపించిన విషయం తెలిసిందే. ‘సరిగ్గా 21 ఏళ్ల క్రితం. అప్పుడు నా వయసు 21 ఏళ్లు. ఇదే కేన్స్‌ వేడుకల్లో పాల్గొన్న నాపై వెయిన్‌స్టీన్‌ అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ’  వీన్‌స్టీన్‌పై ఇటలీ నటి ఏసియా అర్గెంటో ఇటీవల ఆరోపణలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement