
ఫైల్ ఫోటో
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ భయానకంగా మారుతోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు స్వీయ నిర్భందంలో భాగంగా ఇంటికే పరిమితమయ్యారు. మరికొంత మంది కోవిడ్ లక్షణాలతో క్వారంటైన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే కరోనా బారిన పడిన కొందరు సినీ ప్రముఖులు ప్రాణాలు కొల్పోగా మరికొంతమంది చికిత్స అనంతరం నెగటివ్ రావడంతో క్వారంటైన్ నుంచి ఇంటికి పయనమవుతున్నారు. (కరోనా: అగ్రరాజ్యంలో ఒక్కరోజే 2108 మంది మృతి)
తాజాగా హాలీవుడ్ మూవీ మొఘల్, నిర్మాణ దిగ్గజం హార్వీ వెయిన్‌స్టీన్ కూడా 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్నారు. న్యూయార్క్ జైల్లో ఉన్న హార్వే వెయిన్‌స్టీన్ కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ని జైలులోనే ప్రత్యేక నిర్భందంలో ఉంచారు. ‘మెడికల్ ఐసోలేషన్ (క్వారంటైన్) నుంచి హార్వీ విడుదలయ్యారు. ఇప్పడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది’ అని హార్వే అధికార ప్రతినిధి జుడా ఎంగెల్మేయర్ తెలిపారు. మీ టూ ఉద్యమంలో భాగంగా ఆయన లైంగిక వేధింపుల ఆరోపణలకు గురయ్యారు. అందులో భాగంగానే ఆయనకు మార్చి 11న అత్యాచారం, లైంగిక వేధింపులకుగాను 23 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది. రైకర్స్ ద్వీపంలోని జైలులో ఆయన వారం రోజలు తర్వాత వెండేలోని జైలుకు తరలించబడ్డారు. అనంతరం అతనికి కోవిడ్-19 పాజిటివ్ నిర్దారణ కావటంతో క్వారంటైన్‌కి తరలించారు.
వెయిన్‌స్టీన్ జైలు అధికారి క్రెయిగ్ రోత్‌ఫెల్డ్ మాట్లాడుతూ.. కొన్ని ప్రత్యేకమైన చట్టాల ప్రకారం వెయిన్‌స్టీన్ ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేము. అతని గోప్యతను భంగం కలిగించలేము. ఇప్పటికీ ఆయన వెండే సిఎఫ్ లోని రీజనల్ మెడికల్ యూనిట్‌లో వైద్య పర్యవేక్షణలో ఉన్నారు’ అని తెలిపారు. ఇక వెయిన్‌స్టీన్‌కి ప్రత్యేకమైన సౌకర్యాలను జైలు అధికారులు కల్పించటం లేదని పలు విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment