ప్రతీకాత్మక చిత్రం
'నీకు ఇష్టం ఉన్నా, లేకున్నా ఓ రోజు నీపై అత్యాచారం జరుపుతా'.. ఇది రేడియో జర్నలిస్టు గ్విలియా ఫోయిస్‌కు ఎదురైన బెదిరింపు. ఈ బెదిరింపు చేసింది ఎవరో అనామకుడు కాదు. సాక్షాత్తు ఎడిటర్ ఇన్ చీఫ్ హోదాలో ఉన్న కామాంధుడే తన మెడ పట్టుకొని ఈ వ్యాఖ్య చేశాడని ఫోయిస్ తాజాగా ట్విట్టర్‌లో వెల్లడించారు.
హాలీవుడ్ నిర్మాత వెయిన్‌స్టీన్ లైంగిక ఆగడాల కుంభకోణం వెలుగుచూసిన నేపథ్యంలో ఫ్రాన్స్‌లో ఒక కొత్త ఉద్యమం మొదలైంది. బాలన్సెటన్‌పోర్క్ యాష్‌ట్యాగ్ (#balancetonporc)తో ట్విట్టర్ వేదికగా ఈ ఉద్యమం కొనసాగుతోంది. ఈ యాష్‌ట్యాగ్ అర్థం 'మీ పంది బండారం బయటపెట్టండి'. మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను వెలుగులోకి తీసుకురావాలని కోరుతూ ఫోయిస్‌లాగే జర్నలిస్టు అయిన సాండ్రా ముల్లర్ ఈ యాష్‌ట్యాగ్ క్రియేట్ చేశారు. అప్పటినుంచి వందలమంది మహిళలు తమకు ఎదురైన లైంగిక అకృత్యాలను వివరిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఎంతోమంది తమకు ఎదురైన లైంగిక అకృత్యాలను వెలుగులోకి తీసుకురాకపోవడంపై విచారం వ్యక్తం చేస్తూ పోస్టులు చేశారు. మరోవైపు మైహార్వే వెయిన్‌స్టీన్ హ్యాష్‌ట్యాగ్‌తో ఇంగ్లిష్ నెటిజన్లు కూడా లైంగిక దుర్మార్గాలను వెలుగులోకి తీసుకువస్తున్నారు. ఈ అంశంపై అవగాహన కల్పించేందుకు తమవంతుగా కృషి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment