French woman
-
పని చెప్పకుండా జీతం ఇస్తోంది.. కంపెనీపై కేసు పెట్టిన మహిళ
ఆఫీసులో ఏదైనా పని చెబితే తప్పుంచుకోవాలని చూసే ఉద్యోగులు ప్రతి సంస్థలోనూ కొంత మంది ఉంటారు. పని చెప్పకుండా జీతం ఇస్తే చాలా బాగుంటుందని చాలామంది అనుకుంటారు. కానీ పని చేయకుండా 20 సంవత్సరాలుగా జీతం ఇస్తున్న కంపెనీ మీదే ఓ మహిళ కేసు వేసింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? వివరాలు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.ఫ్రాన్స్‌కు చెందిన లారెన్స్ వాన్ వాసెన్‌హోవ్ అనే మహిళకు తమ కంపెనీ ఎలాంటి పని చెప్పలేదని, అయితే ప్రతి నెలా జీతం మాత్రం ఇచ్చేస్తున్నారని.. సంస్థ మీద దావా వేసింది. 1993లో వాసెన్‌హోవ్‌ను ఫ్రాన్స్ టెలికాం నియమించుకుంది. ఆ తరువాత ఈ కంపెనీని ఆరెంజ్ సంస్థ టేకోవర్ చేసింది.ఆరెంజ్ కంపెనీ టేకోవర్ చేసిన తరువాత వాసెన్‌హోవ్‌కు ఒక వైపు పక్షవాతం, మూర్ఛతో బాధపడుతున్నట్లు తెలుసుకుంది. ఈ కారణంగానే ఆమెకు నచ్చిన ఆఫర్ ఎంచుకోమన్నారు. ఆ సమయంలో ఆమె ఫ్రాన్స్‌లోని మరొక ప్రాంతానికి బదిలీని అభ్యర్థించింది. కానీ తనకు తగిన వర్క్‌ప్లేస్‌ను కంపెనీ ఎంపిక చేయలేకపోయింది. దీంతో ఆమె కోరికను కంపెనీ తీర్చలేకపోయింది.ఫ్రాన్స్‌లోని మరొక ప్రాంతానికి బదిలీ చేయడానికి కంపెనీ సాహసం చేయలేదు, దీంతో ఆమెకు ఎలాంటి పని అప్పగించేలేదు. పని అప్పగించకపోయినా.. జీతం మాత్రం ప్రతి నెల అందించేవారు. ఇలా దాదాపు 20 ఏళ్లుగా తనకు కంపెనీ జీతం ఇస్తున్నట్లు వాసెన్‌హోవ్ పేర్కొన్నారు.ఏ పని చేయకుండా జీతం పొందడం అనేది చాలా మందికి కల కావొచ్చు. కానీ వాసెన్‌హోవ్‌కు ఇది నచ్చలేదు. దీంతో ఈమె 2015లో తనపై వివక్ష చూపుతున్నారని ప్రభుత్వానికి & అథారిటీకి ఫిర్యాదు చేసింది. పని చేయకపోవడం ఒక ప్రత్యేక హక్కు కాదు అని ఆమె వాదించింది.వాసెన్‌హోవ్ తరపున న్యాయవాది డేవిడ్ నాబెట్-మార్టిన్ కూడా ఒంటరిగా ఉండటం వల్ల ఆమె డిప్రెషన్‌కు లోనయ్యిందని పేర్కొన్నారు. అయితే కంపెనీ ఈమెకు అన్ని పరిస్థితుల్లోనూ అండగా ఉందని, ఆమెకు ఆరోగ్యం కుదుటపడితే అడాప్టెడ్ పొజిషన్లో మళ్ళీ విధులు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. -
ఒంటరి సమూహం
సుమారు ఆరు దశాబ్దాలుగా అలుపెరగకుండా రాస్తున్న ‘అత్యంత ప్రాధాన్యం గల స్త్రీవాద రచయిత్రి’ ఆనీ ఎర్నౌను 2022 నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది. ఈ గౌరవం దక్కిన తొలి ఫ్రెంచ్ మహిళ ఆమె. ప్రపంచవ్యాప్తంగా ఈ పురస్కారం పొందిన పదిహేడో మహిళ. సాహిత్యానికి తక్షణ ప్రయోజనం ఉండకపోవచ్చు; అయినా కూడా మహిళలు, అణిచివేతకు గురైనవారి పోరాట గాథలను సజీవంగా ఉంచుతున్నానంటారు 82 ఏళ్ల ఆనీ ఎర్నౌ. శరీరం, లైంగికత; సాన్నిహిత్య సంబంధాలు; సామాజిక అసమానతలు; చదువు ద్వారా వర్గాన్ని మార్చుకునే ప్రయత్నం ఆమె రచనల్లో కనబడతాయి. ఫ్రాన్స్‌లోని చిన్న పట్టణం నార్మండీలో వారి కుటుంబం నివసించింది. బతకడానికి నాకు పుస్తకాలు అక్కర్లేదని కరాఖండీగా చెప్పే తండ్రిని కలిగిన అతి సాధారణ నేపథ్యం. ఒక కెఫే యజమానిగా అలెగ్జాండర్ డ్యూమా, ఫ్లాబర్ట్, ఆల్బర్ట్ కామూ లాంటి రచయితలను చదవడం వల్ల తనకేం ఒరుగుతుందని ఆయన నిశ్చితాభిప్రాయం. కానీ ఆనీలో అది పూర్తి విరుద్ధంగా పనిచేసింది. పుస్తకాలు మాత్రమే తనకు అత్యంత ప్రీతికరమైనవనీ, ఎంత చెడ్డ జీవితంలోనూ తనను తాను ఒక ‘అ–పాఠకురాలిగా’ ఊహించలేననీ అంటారామె. ఆరేళ్ల వయసు నుంచే అక్షరంలోని గమ్మత్తుకు ఆకర్షితురాలయ్యారు. వందలాది పుస్తకాలను ఉచితంగా చదువుకోవడం కోసమే పుస్తకాల షాపులో పనిచేయాలని కలగన్నారు. ఒక శ్రామిక కుటుంబంలో పుట్టి, బుద్ధెరిగాక మధ్యతరగతి జీవితాలతో పోల్చుకున్నప్పుడు తమ పరిస్థితి పట్ల సిగ్గుపడిన ఆనీ ఎర్నౌ చదువుకోవడం ద్వారా జీవితాలను మార్చుకోగలమన్న అభిప్రాయానికి చాలా త్వరగా వచ్చారు. దానికి అనుగుణంగానే ముందు టీచర్‌గా, అనంతరం లిటరేచర్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. వర్జీనియా వూల్ఫ్ అంటే ఆనీకి పిచ్చి అభిమానం. సైమన్ ది బోవా ఆమె చైతన్యాన్ని విస్తృతపరిచారు. స్త్రీవాదం అనేది తప్పనిసరైనది అన్న అవగాహనతో ఇరవై ఏళ్ల వయసు నుంచే తన రచనా వ్యాసంగం మొదలుపెట్టారు. తన కుటుంబానికి తెలియకుండా చేయించుకున్న అవాంఛిత గర్భస్రావం గురించి ‘క్లీన్డ్ ఔట్’ రాశారు. ఆ అనుభవంలోని జుగుప్స, భయానకాలకు వెరవకుండా, దీన్నే పునర్దర్శనంలాగా ‘హ్యాపెనింగ్’ రాశారు. ఒక స్త్రీ తన శరీరం మీద తన నియంత్రణనూ, స్వాతంత్య్రాన్నీ స్థాపించుకోవడానికి సంబంధించిన అతిముఖ్యమైన నవలగా ఇది నిలిచిపోయింది. తను దాటివచ్చిన జీవిత దశలనే ఆనీ పుస్తకాలుగా మలిచారు. ఆమె కౌమార జీవితం ఒక పుస్తకం. వైవాహిక జీవితం ఒక పుస్తకం. తూర్పు యూరోపియన్ మనిషితో ప్రేమ వ్యవహారం(ప్యాషన్ సింపుల్) ఇంకో పుస్తకం. తల్లి మరణం ఒక పుస్తకం. బ్రెస్ట్ క్యాన్సర్ అనుభవాలు మరో పుస్తకం. ఫ్రాన్స్ చరిత్రతో ముడిపడిన ‘ది ఇయర్స్’ను ఆమె మ్యాగ్నమ్ ఓపస్‌గా పరిగణిస్తారు. ఉత్తమ పురుష(నేను) కథనాలకు భిన్నంగా దీన్ని థర్డ్ పెర్సన్లో రాశారు. ఏ వ్యక్తిగత అనుభవమో ‘పొరపాటున’ సాహిత్యంలోకి వస్తే– దానికీ, తనకూ ఏ సంబంధమూ లేదని ఒక డిస్‌క్లెయిమర్ లాంటిది ఆ రచయిత తగిలించడం కొత్త సంగతేం కాదు. మరీ ముఖ్యంగా సంక్లిష్ట కుటుంబ సంబంధాలు, సన్నిహిత మానవ సంబంధాలు వచ్చినప్పుడు ఈ జాగ్రత్తలు మరీ ఎక్కువ. ఇక వ్యక్తిగతం అన్నదే కొందరికి నిషిద్ధాక్షరి. వ్యక్తి నుంచి కూడా సమాజాన్ని దర్శించవచ్చునన్న అవగాహన ఉన్నవాళ్లు తక్కువ. కానీ ఆనీ ఎర్నౌ సాహిత్య సర్వస్వం ఆత్మకథాత్మకమే. ఇది కల్పన అని చెబితే రచయితకో రక్షణ కవచం ఉంటుందన్న ఆలోచన ఆమెకు లేక కాదు. కానీ అది మోసం చేయడంలా భావించారు. వ్యక్తిగత జీవితాన్ని ఒక ప్రయోగశాలలో పరీక్షించుకున్నంత కచ్చితత్వంతో తన అనుభవాలను నమోదు చేశారు. అందువల్లే ఆమె ‘గ్రేట్ ట్రూత్ టెల్లర్ ఆఫ్ ఫ్రాన్స్’గా నిలవగలిగారు. నార్మండీ లాంటి చిన్నపట్టణంలో తన జీవితాన్నీ, తండ్రితో తన సంబంధాన్నీ ‘ఎ మ్యాన్స్ ప్లేస్’గా రాస్తున్నప్పుడు తన రచనాపద్ధతిని గురించి ఆమె ఘర్షణపడ్డారు. తండ్రిని ఒక కాల్పనిక పాత్రగా మలవడంలో తన రచనా ఉద్దేశమే నెరవేరదని భావించారు. అందుకే ఉన్నది ఉన్నట్టే రాయడానికి సంకల్పించారు. అందుకే ఆమెను ఫిక్షన్ రచయిత అనాలా, నాన్–ఫిక్షన్ రచయిత అనాలా అన్న చర్చకూడా వచ్చింది. కొందరు ఆమెను ‘మెమొయిరిస్ట్’ (జ్ఞాపకాల రచయిత) అన్నారు. నవలగా, ఆత్మకథగా కాకుండా తన రచనలను ఆటోసోషియోబయోగ్రాఫికల్(సామాజిక ఆత్మకథ)గా మలవగలగడం ఆమె ప్రత్యేకత. చరిత్ర, ఆత్మకథల కలగలుపు ఆమె పద్ధతి. ఇంట్లో పుస్తకాలను చూసి, ఇవన్నీ చదువుతావా అని ఆశ్చర్యపోయిన తన కజిన్, పుస్తకాలతో మనుషులకేం పని అన్నట్టుగా బతికిన తన తండ్రిలాంటివాళ్లు నిజానికి తనకు ఎక్కువ స్ఫూర్తి కలిగించారని చెప్పే ఆనీ... మర్చిపోయి అంతర్ధానమయ్యే లోపల జ్ఞాపకాలను పదిలపరుస్తున్నానంటారు. ఫ్రాన్స్ ఉమ్మడి జ్ఞాపకాలను ఆమె తన ద్వారా వ్యక్తం చేస్తున్నారు. అనువాదాల ద్వారా అవి ప్రపంచ స్మృతులుగా కూడా మారాయి. తన ప్రపంచంగా అనిపించని పారిస్ విలాసాలకు దూరంగా ప్రకృతి, నిశ్శబ్దాల కోసం సబర్బన్ ప్రాంతంలో నివసించే ఆనీ ఎర్నౌ... ఒక దశలో ‘మహిళా విప్లవం’ చూడకుండానే చచ్చిపోతానేమో అని భయపడ్డానంటారు. కానీ అబార్షన్ హక్కులు రావడానికీ, స్త్రీ శరీరం మీద మారుతున్న పురుష ప్రపంచ ధోరణికీ ఆమె కూడా ఒక కారణం అయ్యారు. సాహిత్యానికి తక్షణ ప్రయోజనం ఉండకపోవచ్చు; కానీ ప్రయోజనం లేకుండా మాత్రం ఉండదు. -
ప్రెంచ్ రచయిత " అనీ ఎర్నాక్స్ " కు నోబెల్ ప్రైజ్
-
రాజస్తాన్‌లో తప్పిపోయిన ఫ్రెంచ్ యువతి
జైపూర్ : భారతదేశ పర్యటనకు వచ్చిన 20 ఏళ్ల ఫ్రాన్స్ యువతి రాజస్తాన్‌లో రెండు వారాల క్రితం కనిపించకుండా పోయింది. ఈ విషయాన్ని ప్రెంచ్ దౌత్యకార్యాలయం దృవీకరించింది. గల్లే ఛౌటీవ్ అనే 20 ఏళ్ల ఫ్రెంచ్ యువతి, జూన్ 1 నుంచి కనిపించడంలేదంటూ ఫ్రాన్స్ ఫ్రెంచ్ అంబాసిడర్ అలాగ్జాండర్ ట్వీటర్లో పోస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా రాజస్తాన్‌లో ఫ్రెంచ్ యువతి తప్పిపోయిన విషయాన్ని తెలుసుకున్న అజ్మీర్ పోలీసు వెంటనే ఈ సమచారాన్ని అన్ని జిల్లా హెడ్ క్వాటర్స్‌కు పంపారు. మిస్సింగ్ కేసును నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. యువతి ఫోన్, ఏటీఎం కార్డ్ లాంటి కీలక ఆధారాలను కూడా కనిపెట్టలేదు. మే 30న రాజస్తాన్‌లోని పుష్కర్‌కు చేరుకున్న యువతి స్థానిక హోలి కా చౌక్ అనే హోటల్లో దిగింది. జూన్ 1న హోటల్ ఖాళీ చేసి వెళ్లిన ఆమె అప్పటి నుంచి కన్పించకుండా పోయింది. అయితే హోటల్ నుంచి వెళ్లే ముందు తపుకర్ అనే ప్రాంతం కోసం వివరాలు అడిగినట్లు, మళ్లీ రెండు వారాల తర్వాత తిరిగి వస్తానని చెప్పి వెళ్లినట్టు హోటల్ సిబ్బంది తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా యువతి మిస్సింగ్ విషయాన్ని తెలుసుకున్న అజ్మీర్ పోలీసులు కేసు నమోదు చేసి, అందర్ని అలర్ట్ చేసినట్లు ఇండియాన్-ఫ్రెంచ్ దౌత్యకార్యాలయనికి తెలిసేలా అధికారిక ట్వీట్ చేశారు. Dear @FranceinIndia ~ we note this with concern. Please be informed that we've alerted district @AjmerPolice about the matter & it is making all efforts to locate Ms Gaelle Chouteau at the earliest. Investigations are on. We appreciate your patience. https://t.co/6qrBZbkLjU — Rajasthan Police (@PoliceRajasthan) June 14, 2018 -
ఇష్టం ఉన్నా.. లేకున్నా నిన్ను రేప్ చేస్తా!
'నీకు ఇష్టం ఉన్నా, లేకున్నా ఓ రోజు నీపై అత్యాచారం జరుపుతా'.. ఇది రేడియో జర్నలిస్టు గ్విలియా ఫోయిస్కు ఎదురైన బెదిరింపు. ఈ బెదిరింపు చేసింది ఎవరో అనామకుడు కాదు. సాక్షాత్తు ఎడిటర్ ఇన్ చీఫ్ హోదాలో ఉన్న కామాంధుడే తన మెడ పట్టుకొని ఈ వ్యాఖ్య చేశాడని ఫోయిస్ తాజాగా ట్విట్టర్లో వెల్లడించారు. హాలీవుడ్ నిర్మాత వెయిన్‌స్టీన్ లైంగిక ఆగడాల కుంభకోణం వెలుగుచూసిన నేపథ్యంలో ఫ్రాన్స్‌లో ఒక కొత్త ఉద్యమం మొదలైంది. బాలన్సెటన్పోర్క్ యాష్‌ట్యాగ్ (#balancetonporc)తో ట్విట్టర్ వేదికగా ఈ ఉద్యమం కొనసాగుతోంది. ఈ యాష్‌ట్యాగ్ అర్థం 'మీ పంది బండారం బయటపెట్టండి'. మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను వెలుగులోకి తీసుకురావాలని కోరుతూ ఫోయిస్లాగే జర్నలిస్టు అయిన సాండ్రా ముల్లర్ ఈ యాష్‌ట్యాగ్ క్రియేట్ చేశారు. అప్పటినుంచి వందలమంది మహిళలు తమకు ఎదురైన లైంగిక అకృత్యాలను వివరిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఎంతోమంది తమకు ఎదురైన లైంగిక అకృత్యాలను వెలుగులోకి తీసుకురాకపోవడంపై విచారం వ్యక్తం చేస్తూ పోస్టులు చేశారు. మరోవైపు మైహార్వే వెయిన్‌స్టీన్ హ్యాష్‌ట్యాగ్‌తో ఇంగ్లిష్ నెటిజన్లు కూడా లైంగిక దుర్మార్గాలను వెలుగులోకి తీసుకువస్తున్నారు. ఈ అంశంపై అవగాహన కల్పించేందుకు తమవంతుగా కృషి చేస్తున్నారు. -
రోబోతో ప్రేమ వివాహం!
రోబో సినిమాలో హీరోయిన్ను చూసి ‘చిట్టి’రోబో ప్రేమలో పడటం గుర్తుండే ఉంటుంది.. అంతేకాదు ఆమెను పెళ్లి చేసుకునేందుకు విఫల యత్నంకూడా చేస్తుంది. అచ్చు ఇలాగే ఓ రోబోకు, ఓ యువతికి మధ్య ప్రేమ చిగురించింది. లిల్లీ అనే ఫ్రెంచి యువతి తన సొంత త్రీడీ ప్రింటెడ్ రోబోతో ప్రేమలో పడింది. అంతేకాదు సమాజం ఏం అనుకున్నా ఆ రోబోనే పెళ్లి చేసుకుంటానని బల్లగుద్ది మరీ చెబుతోంది. రోబోలు తప్ప మనుషులను చూస్తే తనకు ఎలాంటి ఆకర్షణ కలగదని లిల్లీ చెబుతోంది. వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగిందని, త్వరలోనే ఇద్దరం ఒకటి కాబోతున్నామని స్పష్టం చేసింది. దీన్ని ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒప్పుకున్నారట కూడా. ఇంకొన్నేళ్లు పోతే రోబోలకు మనుషులకు మధ్య పెళ్లిళ్లు సర్వ సాధారణం అయ్యేట్టున్నాయి!