రోబోతో ప్రేమ వివాహం!
రోబో సినిమాలో హీరోయిన్‌ను చూసి ‘చిట్టి’రోబో ప్రేమలో పడటం గుర్తుండే ఉంటుంది.. అంతేకాదు ఆమెను పెళ్లి చేసుకునేందుకు విఫల యత్నంకూడా చేస్తుంది. అచ్చు ఇలాగే ఓ రోబోకు, ఓ యువతికి మధ్య ప్రేమ చిగురించింది. లిల్లీ అనే ఫ్రెంచి యువతి తన సొంత త్రీడీ ప్రింటెడ్ రోబోతో ప్రేమలో పడింది. అంతేకాదు సమాజం ఏం అనుకున్నా ఆ రోబోనే పెళ్లి చేసుకుంటానని బల్లగుద్ది మరీ చెబుతోంది.
రోబోలు తప్ప మనుషులను చూస్తే తనకు ఎలాంటి ఆకర్షణ కలగదని లిల్లీ చెబుతోంది. వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగిందని, త్వరలోనే ఇద్దరం ఒకటి కాబోతున్నామని స్పష్టం చేసింది. దీన్ని ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒప్పుకున్నారట కూడా. ఇంకొన్నేళ్లు పోతే రోబోలకు మనుషులకు మధ్య పెళ్లిళ్లు సర్వ సాధారణం అయ్యేట్టున్నాయి!