అలాంటి కామోన్మాదులు అంతటా ఉంటారు | Priyanka Chopra on Weinstein Scandal | Sakshi
Sakshi News home page

హర్వే ఉదంతంపై ప్రియాంక స్పందన

Published Thu, Oct 19 2017 1:49 PM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM

Priyanka Chopra on Weinstein Scandal - Sakshi

సాక్షి, సినిమా : హాలీవుడ్ ఇప్పుడు ఏ ఇద్దరు సెలబ్రిటీలు కలుసుకున్నా హర్వే వెయిన్‌స్టెన్‌ ఉదంతం గురించే చర్చించుకుంటున్నారు. మూవీ మొఘల్‌గా పేరుబడ్డ ఆ పెద్దాయన ఇలాంటి పాడు పనులు చేసుంటాడని ఊహించలేదని ఆయనతో పని చేసిన మేల్‌ ఆర్టిస్టులు చెబుతున్నారు. దీనికి తోడు ఆయనపై ఆరోపణలు చేసే నటీమణుల జాబితా నానాటికీ పెరిగిపోతుంది. 

ఇదిలా ఉంటే బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి ఎగిరిపోయి.. అక్కడ పాగా వేసిన బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ వ్యవహారంపై స్పందించింది. మెయిరే క్లెయిర్‌ పవర్‌ ట్రిప్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. హర్వే లాంటి కామాంధులు అంతటా ఉంటారని చెబుతోంది. అవకాశాల పేరిట ఎర వేసి శారీరకంగా వాడుకోవాలని చూడటం ఉన్మాద చర్యని పిగ్గీ చోప్స్ అంటోంది. అంతేకాదు తమ కలలను నిజం చేసుకోవాలని వచ్చే వారిని ఎలా వేధింపులకు గురిచేస్తారో వివరించింది. 

అలాంటి వాటికి లొంగాల్సిన పనిలేదు. అమ్మాయిలు చాలా ధైర్యంగా ఉండాలి. వస్త్రధారణ లాంటి చిన్న చిన్న నిర్ణయాలు కూడా స్వతంత్ర్యగా తీసుకోలేకపోతున్నారు. అది మారాలి. మీ విషయాల్లో ఇతరుల జోక్యాన్ని నిరోధించండి అంటూ మహిళలకు పిలుపునిచ్చింది. తాజాగా అనురాగ్ కశ్యప్ మాజీ భార్య, నటి కల్కి కోయిచ్‌లిన్ హర్వే లాంటి వాళ్లు బాలీవుడ్‌లోనూ ఉన్నారని.. సమయం వచ్చినప్పుడు వాళ్లు బయటపడతారని కామెంట్లు చేసి కలకలమే రేపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement