న్యూయార్క్ : ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వెయిన్‌స్టీన్ (67) లైంగిక వేధింపులకి పాల్పడినట్లు ఇటీవల పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.2006లో మీమీ హలేయిని, 2013లో జెస్సికా మన్‌ని లైంగికంగా వేధించాడనే పలు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏడుగురు పురుషులు, ఐదుగురు మహిళలు సభ్యులుగా ఉన్న న్యూయార్క్ జ్యూరీ తీర్పునిచ్చింది. వెయిన్‌స్టీన్ లైంగిక వేధింపులకి పాల్పడ్డాడని, వెంటనే జైలుకు తరలించాలని జడ్జి ఆదేశించారు. మరో రెండు కేసుల్లో మాత్రం ఆయనను నిర్దోషిగా తేల్చారు. ఈ నేరాలు కూడా నిరూపణ జరిగి ఉంటే జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. 80 మందికి పైగా ప్రముఖ నటీమణులని ఈ హాలీవుడ్ నిర్మాత వేధించాడని ప్రధాన ఆరోపణగా తెలుస్తుంది. ది ఇంగ్లీష్ పేషెంట్, షేక్స్‌పియర్ ఇన్ లవ్ చిత్రాల ద్వారా వెయిన్‌స్టీన్ చాలా పాపులర్ అయ్యాడు.
కాగా జ్యూరీ తీర్పు అనంతరం వెయిన్‌స్టీన్ ఎలాంటి ఉద్వేగానికి లోనుకాలేదు. తన లాయర్ డోనా రోటునోతో మాట్లాడుతూ కనిపించారు. వెయిన్‌స్టీన్‌కు విధించే శిక్షను మార్చి 11న నిర్థరిస్తారు.17 ఏళ్ల లోపు బాలికలపై జరిగే అత్యాచారాన్ని న్యూయార్క్‌లో మొదటి డిగ్రీ రేప్ అంటారు. తన పలుకుబడిని ఉపయోగించుకుని వెయిన్‌స్టీన్ ఎంతోమంది మహిళలను లోబర్చుకున్నారని ప్రాసిక్యూషన్ వాదించింది. అయితే, ఆరోపణలు చేసినవారితో జరిగిన సెక్స్ వారి అంగీకారంతోనే జరిగిందని డిఫెన్స్ లాయర్ వాదించారు. ఈ సంబంధాన్ని వారు తమ కెరీర్లో ఎదగడానికి వాడుకున్నారని తెలిపారు. వారు ఇప్పుడు పశ్చాత్తాప పడుతూ దాన్ని రేప్ అని చిత్రీకరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. (అతను నన్ను దారుణంగా రేప్ చేశాడు : హాలీవుడ్ నటి)
Comments
Please login to add a commentAdd a comment