Hollywood producer
-
ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ అవార్డు ఖాయం, రాసిపెట్టుకొండి: హాలీవుడ్ నిర్మాత
ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్‌ను గెలుచుకోవడం ఖాయమని హాలీవుడ్ ప్రముఖ నిర్మాత జాసన్ బ్లక్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు 301 చిత్రాలతో ప్రకటించిన ఆస్కార్ రిమైండర్ లిస్టులో భారత్‌కు చెందిన 10 సినిమాలు ఉండడం విశేషం. అందులో, టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో, హాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ జాసన్ బ్లమ్ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయన తన ట్వీట్లో ఇలా రాసుకొచ్చారు. చదవండి: ఆస్కార్ అవార్డుకు క్వాలిఫై అయిన 'కాంతార'.. ఆర్ఆర్ఆర్కు పోటీగా ‘ఉత్తమ చిత్రంగా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు అందుకోవడం ఖాయం. మీరు ఫస్ట్ వినేది కూడా ఇదే. రాసిపెట్టుకొండి. నేను చెప్పిందే జరుగుతుంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం నాకు నేనే సొంతగా అస్కార్ అవార్డును ప్రకటించుకుంటాను’ అని తన ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఆయన ట్వీట్‌కు పలువురు హాలీవుడ్ పెద్దలు సైతం ఏకిభవిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఆర్ఆర్ఆర్ టీం కూడా స్పందించింది. చదవండి: హైవోల్టేజ్ యాక్షన్స్‌తో‘ పఠాన్’.. ట్రైలర్ అదిరిపోయింది! ‘మేము మిమ్మల్ని గెలుచుకున్నాం సార్. అది మాకు చాలు. ధన్యవాదాలు’ ఆయన ట్వీట్‌కు రీట్వీట్ చేసింది. కాగా ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటూ నాటూ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్ నామినేషన్‌కు ఎన్నికైన సంగతి తెలిసిందే. అదే విధంగా లాస్ ఏంజెల్స్‌లో జరుగుతున్న స్క్రీనింగ్‌కి కూడా భారీగా రెస్పాన్స్ వస్తుండడంతో బెస్ట్ పిక్చర్ నామినేషన్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ ఎంట్రీ ఇవ్వచ్చు అని హాలీవుడ్ మీడియాలు తమ కథనాల్లో పేర్కొంటున్నాయి. I’m going with RRR winning best pic. You heard it here first. Mark it down, please. If I’m right, I am awarding myself my own Oscar. — Jason Blum (@jason_blum) January 8, 2023 We won you, Blum!! ❤️ Thank you so much for your kind words. #RRR https://t.co/qWd07VUrq3 — RRR Movie (@RRRMovie) January 9, 2023 -
80 మందిని వేధించాడు.. జైలుకు వెళ్లాల్సిందే
న్యూయార్క్ : ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వెయిన్‌స్టీన్ (67) లైంగిక వేధింపులకి పాల్పడినట్లు ఇటీవల పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.2006లో మీమీ హలేయిని, 2013లో జెస్సికా మన్ని లైంగికంగా వేధించాడనే పలు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏడుగురు పురుషులు, ఐదుగురు మహిళలు సభ్యులుగా ఉన్న న్యూయార్క్ జ్యూరీ తీర్పునిచ్చింది. వెయిన్‌స్టీన్ లైంగిక వేధింపులకి పాల్పడ్డాడని, వెంటనే జైలుకు తరలించాలని జడ్జి ఆదేశించారు. మరో రెండు కేసుల్లో మాత్రం ఆయనను నిర్దోషిగా తేల్చారు. ఈ నేరాలు కూడా నిరూపణ జరిగి ఉంటే జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. 80 మందికి పైగా ప్రముఖ నటీమణులని ఈ హాలీవుడ్ నిర్మాత వేధించాడని ప్రధాన ఆరోపణగా తెలుస్తుంది. ది ఇంగ్లీష్ పేషెంట్, షేక్స్పియర్ ఇన్ లవ్ చిత్రాల ద్వారా వెయిన్‌స్టీన్ చాలా పాపులర్ అయ్యాడు. కాగా జ్యూరీ తీర్పు అనంతరం వెయిన్‌స్టీన్ ఎలాంటి ఉద్వేగానికి లోనుకాలేదు. తన లాయర్ డోనా రోటునోతో మాట్లాడుతూ కనిపించారు. వెయిన్‌స్టీన్‌కు విధించే శిక్షను మార్చి 11న నిర్థరిస్తారు.17 ఏళ్ల లోపు బాలికలపై జరిగే అత్యాచారాన్ని న్యూయార్క్‌లో మొదటి డిగ్రీ రేప్ అంటారు. తన పలుకుబడిని ఉపయోగించుకుని వెయిన్‌స్టీన్ ఎంతోమంది మహిళలను లోబర్చుకున్నారని ప్రాసిక్యూషన్ వాదించింది. అయితే, ఆరోపణలు చేసినవారితో జరిగిన సెక్స్ వారి అంగీకారంతోనే జరిగిందని డిఫెన్స్ లాయర్ వాదించారు. ఈ సంబంధాన్ని వారు తమ కెరీర్లో ఎదగడానికి వాడుకున్నారని తెలిపారు. వారు ఇప్పుడు పశ్చాత్తాప పడుతూ దాన్ని రేప్ అని చిత్రీకరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. (అతను నన్ను దారుణంగా రేప్ చేశాడు : హాలీవుడ్ నటి) -
టాలీవుడ్ టు హాలీవుడ్
భారతీయ సినిమా నుంచి హాలీవుడ్ వరకూ వెళ్లాలనే కల చాలామందికి ఉంటుంది. అయితే కొందరికి అది కలగా మిగిలిపోతుంది. కానీ తన ప్రతిభతో భారతీయ సినీ దర్శక, రచయిత జగదీష్ దానేటి హాలీవుడ్ వరకూ వెళ్లారు. హాలీవుడ్లో ‘జె.డి.’ పేరుతో ఎంట్రీ ఇచ్చిన జగదీష్ పలు అంతర్జాతీయ చిత్రాలకు ‘క్రియేటివ్ కన్సల్టింగ్’ చేయటంలో విశేష నైపుణ్యం సాధించారు. హాలీవుడ్ ప్రఖ్యాత ప్రొడక్షన్ కంపెనీ మార్టిన్ ఫిలిమ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు జగదీష్. లాస్ ఏంజిల్స్‌లో ఇటీవల జరిగిన ఒక వేడుకలో ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు–నిర్మాత జాని మార్టిన్.. జేడీతో ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల తన ఆనందం వ్యక్తం చేశారు. ‘‘జె.డి. రాసిన కథలు, స్క్రీన్‌ప్లే అద్భుతం. అందుకే ఆయన దర్శకత్వం వహించబోతున్న హాలీవుడ్ చిత్రాలకు నేను నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించబోతున్నా’’ అన్నారు జాని మార్టిన్. ఈ ఇండో–అమెరికన్ చిత్రాల్లో హాలీవుడ్ నటులతో పాటు భారతీయ సినిమాకి సంబంధించిన నటీనటులను కూడా నటింపజేయనున్నారు. -
వీన్స్టన్కు 25 ఏళ్ల శిక్ష..!
న్యూయార్క్ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్‌స్టీన్ అరెస్టైన విషయం తెలిసిందే. ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు, మరో మహిళపై లైంగిక దాడికి యత్నించినట్లు కేసులు నమోదైన నేపథ్యంలో.. బుధవారం మన్హటన్ క్రిమినల్ కోర్టుకు వీన్‌స్టీన్ హాజరయ్యారు. ఆయన తరపు న్యాయవాది బ్రెఫ్మాన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం తన క్లైంట్ వద్ద లేదని.. తమకు సాక్ష్యాధారాలు సేకరించుకునేందుకు సమయం సరిపోనందున తమకు గడువు ఇవ్వాలని కోరామన్నారు. తన క్లైంట్‌పై నిరాధార ఆరోపణలు చేశారని, అందుకు తగిన ఆధారాలు కోర్టుకు సమర్పిస్తామని బ్రెఫ్మాన్ తెలిపారు. త్వరలోనే వీన్‌స్టీన్ ఈ నేరారోపణల నుంచి బయటికి వస్తారని.. నిరాధారమైన ఇటువంటి కేసులు ఎక్కువ కాలం నిలవవని ఆయన వ్యాఖ్యానించారు. వీన్‌స్టీన్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆరోపించిన తర్వాత కూడా ఆ మహిళ ఆయనతో 10 ఏళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నారని, ఇప్పుడు కూడా ఆ బంధం కొనసాగుతోందంటూ అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. అయితే ‘తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న ముద్దాయి.. తనపై మోపబడిన అభియోగాలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందని’ మన్హటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ సైరస్ వాన్స్ వ్యాఖ్యానించారు. కాగా, వీన్‌స్టీన్ దోషిగా తేలితే 25 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
హాలీవుడ్ నిర్మాత వీన్‌స్టీన్ అరెస్ట్
న్యూయార్క్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్‌స్టీన్‌ను న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళను రేప్ చేయడంతో పాటు మరో మహిళపై లైంగికదాడికి యత్నించినట్లు కేసులు నమోదయ్యాయి. వీన్‌స్టీన్ తమను రేప్ చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఏంజెలినా జోలీ, సల్మా హయక్సహా 80 మందికిపైగా హాలీవుడ్ నటీమణులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం లోయర్ మాన్‌హట్టన్‌లోని పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న వీన్‌స్టీన్.. అధికారులకు సరెండర్ అయ్యాడు. తర్వాత ఆయన్ను కోర్టులో హాజరుపరచగా రూ.6.7కోట్ల పూచీకత్తుతో కోర్టు ఆయనకు బెయిలు ఇచ్చింది. -
ఉలగ నాయగన్ పేరుతో ‘యూ ట్యూబ్ చానల్’
నటుడు కమల్ హాసన్‌ను ఉలగ నాయగన్ (విశ్వ నాయకుడు) అని ఆయన అభిమానులు పిలుచుకుంటారు. అదే పేరుతో ఆయనిప్పుడు యు ట్యూబ్ చానల్ ప్రారంభించారు. ప్రముఖ హాలీవుడ్ నిర్మాత పెరి ఓస్పోన్ కోరిక మేరకు కమల్ యు ట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించడం విశేషం. దిలాడ్స్ ఆఫ్ ది రింగ్స్ చిత్ర నిర్మాత పెరి ఓస్పోన్ కమల్‌హాసన్ గురించి మాట్లాడుతూ సినిమా, సాహిత్యం చిత్ర నిర్మాణం, దర్శకత్వం అంటూ పలు విభాగాల్లో నిష్ణాతుడైన కమల్ హాసన్ ఆయన ప్రతిభాపాటవాలను, అనుభవాలను ఇతరులు తెలుసుకునే విధంగా ఒక చానల్‌ను ప్రారంభిస్తే బాగుంటుందనే కోరికను వెలిబుచ్చారట. ఆయన ఆకాంక్ష మేరకు కమల్ ఉలగనాయకన్ యు ట్యూబ్ పేరుతో ఇంటర్నెట్లో ఒక యు ట్యూబ్ చానల్‌ను ప్రారంభించారు. యూట్యూబ్‌లో 2500 మంది చందాదారులుగాను, 75వేల మంది వీక్షకులుగాను చేరడం విశేషం. ది విలాక్ (విడియోలాక్) కెవాయ్ మొళి అనే బ్లాక్‌లో కమల్ హాసన్ తన అభిప్రాయాలను, అనుభవాలకు పొందుపరుస్తుంటారు. తన కవితలను, సాహిత్యానికి చెందిన విశేషాలను పొందుపరుస్తున్నారు. అభిమానుల ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇస్తుంటారు.