Hollywood Producer Jason Blum Tweet RRR Will Win Oscar for Best Picture - Sakshi
Sakshi News home page

Oscar Award-RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్‌ అవార్డు ఖాయం, రాసిపెట్టుకొండి: హాలీవుడ్‌ నిర్మాత

Published Tue, Jan 10 2023 4:05 PM | Last Updated on Tue, Jan 10 2023 5:56 PM

Hollywood Producer Jason Blum Tweet RRR Will Win Oscar for Best Picture - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ఆస్కార్‌ను గెలుచుకోవడం ఖాయమని హాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత జాసన్‌ బ్లక్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు 301 చిత్రాలతో ప్రకటించిన ఆస్కార్ రిమైండర్ లిస్టులో భారత్‌కు చెందిన 10 సినిమాలు ఉండడం విశేషం. అందులో, టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో, హాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ జాసన్ బ్లమ్ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయన తన ట్వీట్‌లో ఇలా రాసుకొచ్చారు.

చదవండి: ఆస్కార్‌ అవార్డుకు క్వాలిఫై అయిన 'కాంతార'.. ఆర్‌ఆర్‌ఆర్‌కు పోటీగా

‘ఉత్తమ చిత్రంగా ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్‌ అవార్డు అందుకోవడం ఖాయం. మీరు ఫస్ట్‌ వినేది కూడా ఇదే. రాసిపెట్టుకొండి. నేను చెప్పిందే జరుగుతుంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం నాకు నేనే సొంతగా అస్కార్‌​ అవార్డును ప్రకటించుకుంటాను’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. ఇక ఆయన ట్వీట్‌కు పలువురు హాలీవుడ్‌ పెద్దలు సైతం ఏకిభవిస్తూ  కామెంట్స్‌ చేస్తున్నారు. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌ టీం ​కూడా స్పందించింది.

చదవండి: హైవోల్టేజ్‌ యాక్షన్స్‌తో‘ పఠాన్‌’.. ట్రైలర్‌ అదిరిపోయింది!

‘మేము మిమ్మల్ని గెలుచుకున్నాం సార్‌. అది మాకు చాలు. ధన్యవాదాలు’ ఆయన ట్వీట్‌కు రీట్వీట్‌ చేసింది. కాగా ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని నాటూ నాటూ సాంగ్‌ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌గా ఆస్కార్‌ నామినేషన్‌కు ఎన్నికైన సంగతి తెలిసిందే. అదే విధంగా లాస్ ఏంజెల్స్‌లో జరుగుతున్న స్క్రీనింగ్‌కి కూడా భారీగా రెస్పాన్స్ వస్తుండడంతో బెస్ట్ పిక్చర్ నామినేషన్ కేటగిరీలో ఆర్‌ఆర్‌ఆర్‌ ఎంట్రీ ఇవ్వచ్చు అని హాలీవుడ్ మీడియాలు తమ కథనాల్లో పేర్కొంటున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement