అతనికి అంత సీన్‌ లేదు! | Weinstein was horrible to deal with, says Kate Winslet | Sakshi
Sakshi News home page

అతనికి అంత సీన్‌ లేదు!

Jan 1 2018 12:40 AM | Updated on Jan 1 2018 12:40 AM

Weinstein was horrible to deal with, says Kate Winslet - Sakshi

2009... ‘ది రీడర్‌’ సినిమాకు హాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కేట్‌ విన్‌స్లెట్‌ ఉత్తమ నటిగా ఆస్కార్‌కు ఎంపికయింది. ఆస్కార్‌ అందుకునే రోజు స్పీచ్‌లో హార్వీ వెయిన్‌స్టీన్‌ గురించి మాట్లాడమని ఆమెపై అందరూ ఒత్తిడి తెచ్చారు. హార్వీ ఆ సినిమాకు ఫైనాన్స్‌ అందించడంతో పాటు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరించాడు. అయితే, కేట్‌ మాత్రం అతని గురించి మాట్లాడనంటే మాట్లాడను అని చెప్పింది. నిజంగానే స్పీచ్‌లో హార్వీకి కేట్‌ కనీసం థ్యాంక్స్‌ కూడా చెప్పలేదు.

ఎనిమిదేళ్లు గడిచాయి. ఇప్పుడు హార్వీ వెయిన్‌స్టీన్‌ గురించిన వార్తలే వినిపిస్తున్నాయి.. ఎక్కడ చూసినా! కారణం, అవకాశాల కోసం తన వద్దకు వచ్చిన అమ్మాయిలపై హార్వీ లైంగిక దాడికి పాల్పడడమే! 2009లో ఆస్కార్‌ అవార్డు అందుకుంటూ తాను హార్వీ పేరు ఎందుకు ఎత్తలేదన్న విషయాన్ని కేట్‌ విన్‌స్లెట్‌ ఇప్పుడు బయటపెట్టింది. అందరూ కంప్లైంట్‌ చేస్తున్నట్లే హార్వీ లాంటి వాడిని భరించడం కష్టం అంది కేట్‌.

కేట్‌ మొదటి సినిమా ‘హెవెన్లీ క్రియేచర్స్‌’కు హార్వీ ఓ నిర్మాత. ‘‘ఆ సినిమా అప్పట్నుంచి ఎప్పుడు నన్ను కలిసినా ‘నీకు మొదటి అవకాశం నేనే ఇచ్చా!’ అంటూండేవాడు. వాడు నాకు ఆఫర్‌ ఇవ్వడమేంటి? నేను ఆడిషన్‌లో సెలెక్ట్‌ అయ్యా. అదే సినిమాకు మూడు సార్లు ఆడిషన్‌ ఇచ్చా. ఎప్పుడు కలిసినా రూడ్‌గా మాట్లాడేవాడు. అయితే నాతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే సీన్‌ లేదతనికి. కావాలనే పట్టుబట్టి ఆస్కార్‌ వేడుకలో హార్వీ గురించి మాట్లాడలేదు..’’ అని చెప్పుకొచ్చింది కేట్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement