
కే హుయ్ క్వాన్
ఐదు పదుల వయసు దాటిన తర్వాత హీరో అవుతున్నారు ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ యాక్టర్ కే హుయ్ క్వాన్. ‘ది అవెంజర్స్’, ‘జాన్ విక్’, ‘డెడ్‌పూల్ 2’ వంటి సినిమాల్లోని యాక్షన్ సీక్వెన్స్‌లకు స్టంట్ కో ఆర్డినేటర్‌గా చేసిన జోనాథన్ యుసేబియా ‘విత్ లవ్’ అనే ఓ యాక్షన్ ఫిల్మ్‌తో దర్శకునిగా తొలిసారి మెగాఫోన్ పట్టారు. ఈ చిత్రంలోనే కే హుయ్ క్వాన్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు. నటుడిగా దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్ ఉన్న కే హుయ్ క్వాన్‌కు హీరోగా ఇదే తొలి చిత్రమని హాలీవుడ్ సమాచారం.
అలాగే ఫిఫ్టీ ప్లస్ ఏజ్‌లో ఉన్న జోనాథన్ యుసేబియా దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఇక ప్రస్తుతం ‘విత్ లవ్’ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాను 2025 ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు క్వాన్. ఈ సినిమాకు గాను ఆయన ఉత్తమ సహాయ నటుడు విభాగంలో 2023లో జరిగిన 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో అవార్డు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment