Spider Man: No Way Home Trailer Out: స్పైడర్ మ్యాన్ మూవీ సిరీస్‌లకు వరల్డ్‌వైడ్‌గా ఎంతో ఆదరణ ఉంది. ప్రపంచాన్ని రక్షించడం కోసం దుష్టశక్తులతో స్పైడీ చేసే పోరాట విన్యాసాలు ఎప్పుడూ ఆకట్టుకుంటునే ఉంటాయి. ఇప్పుడు అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్'. జాన్ వాట్స్ దర‍్శకత్వం వహించిన ఈ చిత్రంలో టామ్ హోలాండ్, జెండీయా, బెనెడిక్ట్ కంబర్‌బ‍్యాచ్, విలియమ్ డాఫే, జేమీ ఫాక్స్, ఆల్ఫ్రెడ్ మొలీనా కీలక పాత్రలు పోషించారు.
డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ఒక విజువల్ వండర్‌గా సాగింది. యాక్షన్ సన్నివేశాలు సూపర్‌గా ఉన్నాయి. ఈ సినిమాలో ఇంతకు ముందు స్పైడర్ మ్యాన్, అమేజింగ్ స్పైడర్ మ్యాన్ చిత్రాల్లో లీడ్ రోల్ చేసిన టూబే మాగ్యూర్, ఆండ‍్య్రూ గారీఫీల్డ్ నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌లో మాత్రం వారెవరూ కనిపించలేదు. కానీ హీరో స్పైడీ నలుగురు విలన‍్లతో పోరాడనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: స్పైడర్ మ్యాన్-నో వే హోమ్ పోస్టర్ విడుదల.. ఇవి గమనించారా..!
Comments
Please login to add a commentAdd a comment