మార్వెల్ సినిమాల్లో ఇప్పటిదాకా ఏమూవీకి రానంత హైప్ ‘స్పైడర్ మ్యాన్ నో వే హోం’కి క్రియేట్ అయ్యింది. కథలో భాగంగా నలుగురు సూపర్ విలన్లతో.. ముగ్గురు స్పైడర్‌మ్యాన్‌లు పోరాడనున్నారనే ప్రచారంతో ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా కోసం ఎగ్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
డిసెంబర్ 17న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా.. ఆన్‌లైన్ బుకింగ్ హడావిడి ఇప్పటి నుంచే ప్రారంభమైంది. ఒకానొక దశలో బుకింగ్ ప్రభావంతో సర్వర్‌లు సైతం క్రాష్ అయినట్లు ప్రచారం వినిపించింది. తాజాగా టికెట్ బుకింగ్‌పై బంపరాఫర్ ప్రకటించింది ఏఎంసీ థియేటర్స్. ఉత్తర అమెరికాలో Spider-Man: No Way Home డిసెంబర్ 16నే రిలీజ్‌కాబోతోంది. ఈ సినిమాకు అడ్వాన్స్‌గా టికెట్లు బుక్ చేసుకుంటే ఎన్‌ఎఫ్‌టీలు ఇస్తామని ప్రకటించింది ఏఎంసీ థియేటర్స్. సోనీ-మార్వెల్ తరపున రాబోతున్న సందర్భంగా సుమారు 86 వేల ఎన్‌ఎఫ్‌టీలను పంచుతామని, అదీ ముందు టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లకేనని తెలిపింది.
క్లబ్ స్టూడియోస్ డిజైన్ చేసిన ఈ ఎన్‌ఎఫ్‌టీలు.. వేటికవే ప్రత్యేకమైన విలువను(భారీ) కలిగి ఉంటాయి. అయితే ఈ ఆఫర్ కేవలం అమెరికన్లకు మాత్రమే! అంతేకాదు బయటి దేశాలకు వాళ్లకు వీటిని ట్రాన్స్‌ఫర్ చేయడానికి వీల్లేదనే కండిషన్లు విధించారు. టామ్ హోలాండ్ స్పైడర్‌మ్యాన్‌గా లీడ్ రోల్‌లో కనిపించనున్న ఈ చిత్రంలో.. గతంలో స్పైడర్‌మ్యాన్‌లుగా అలరించిన టోబీ మాగుయిర్, ఆండ్రూ గార్‌ఫీల్డ్ సైతం కనిపించనున్నారనే ప్రచారంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన స్పైడర్ మ్యాన్ నో వే హోంకి జోన్ వాట్స్ డైరెక్టర్.
ఎన్‌ఎఫ్‌టీ అంటే.. సినిమాలు, సెలబ్రిటీలు, ఇ-సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్ ఫార్మాట్‌లోకి మార్చి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు. క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్ వర్క్ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్ ఎస్సెట్స్, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్ ఫంజిబుల్ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్ చైయిన్ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే యాప్‌లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలు చేయవచ్చు.
చదవండి: Spider-Man: No Way Home.. భారత్‌లో రిలీజ్ ఎప్పుడంటే..
Comments
Please login to add a commentAdd a comment