Spider-Man
-
హిట్ జోడీ రిపీట్
టామ్ హాలండ్, జెండయా హిట్ జోడీ. ‘స్పైడర్ మేన్’ సిరీస్‌లో వెండితెరపై ప్రేమికులుగా కనిపించిన ఈ ఇద్దరూ నిజంగానే ప్రేమికులు కూడా. అయితే బ్రేకప్ చెప్పుకున్నారనే వార్తలు ఈ మధ్య వస్తే... ‘అలాంటిదేం లేదు’ అంటూ ఈ జంటను ఇష్టపడేవారిని ఖుషీ చేశారు టామ్. ఇప్పుడు హాలీవుడ్ నుంచి మరో ఖుషీ కబురు అందింది. ‘స్పైడర్‌మేన్’ సిరీస్‌లోని నాలుగో భాగంలోనూ ఈ ఇద్దరూ జంటగా నటించనున్నారన్నది ఆ కబురు. నిజానికి ‘యుఫోరియా’ సిరీస్‌లోని మూడో సీజన్లో నటిస్తున్నందున జెండయా ‘స్పైడర్‌మేన్ 4’లో నటించడానికి వీలుపడని పరిస్థితి. అయితే ‘యుఫోరియా’ కథ ఇంకా పూర్తి కాకపోవడంతో ఆ సిరీస్ కమిట్ అయిన నటీనటులకు వేరే ప్రాజెక్ట్ ఒప్పుకునే వెసులుబాటుని ఇచ్చిందట యూనిట్. దాంతో తాను ఎంతగానో ఇష్టపడే ‘స్పైడర్‌మేన్’ చిత్రానికి డేట్స్ కేటాయించే పని మీద ఉన్నారట జెండయా. ఇక టామ్ హాలండ్ తాను ఇష్టపడే చిత్రాల్లో ‘స్పైడర్‌మేన్’కి ప్రముఖ స్థానం ఉందని అంటుంటారు. సో.... పీటర్ పార్కర్ (టామ్ చేసే స్పైడర్‌మేన్ పాత్ర పేరు), ఎమ్జె (పీటర్ గాళ్ ఫ్రెండ్‌గా జెండయా చేసే పాత్ర పేరు)ల ప్రేమను మరోసారి ‘స్పైడర్‌మేన్ 4’లో చూడొచ్చన్న మాట. ఈ హిట్ జోడీ రిపీట్ అయ్యే విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జస్టిన్ లిన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్ లేదా అక్టోబరులో ఆరంభం కానుంది. -
సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనున్న శుబ్‌మన్ గిల్.. స్పైడర్ మ్యాన్‌తో!
ఐపీఎల్-2023లో అదరగొడుతున్న టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సరికొత్త అవతరమెత్తనున్నాడు. హాలీవుడ్ మూవీ "స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్"కు శుబ్‌మన్ గిల్ డబ్బింగ్ చెప్పబోతున్నాడు. గిల్ హిందీతో పాటు పంజాబీ వెర్షన్లకు తన వాయిస్‌ను అందించనున్నాడు. ఇక ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా మూవీ మేకర్స్ సోమవారం రివీల్ చేశారు. ఈ యానిమేషన్ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా దేశవ్యాప్తంగా జూన్ 2న విడుదల చేయనుంది. ఈ మూవీ 10 భాషల్లో రిలీజ్ కానుంది. కాగా పవిత్ర్ ప్రభాకర్ అలియాస్ ఇండియన్ స్పైడర్ మ్యాన్ అనే క్యారెక్టర్ నేపథ్యంలో ఇండియన్ వెర్షన్ మూవీ సాగనుంది. ఇండియన్ వెర్షన్లో స్పైడర్ మ్యాన్ చిత్రం తొలిసారి తెరక్కించారు. హిందీ, పంజాబీ భాషల్లో ఇండియన్ స్పైడర్ మ్యాన్ చిత్రానికి వాయిస్ అందించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను'' అని ఓ ప్రకటనలో గిల్ పేర్కొన్నాడు. గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన గిల్.. నాలుగు హాఫ్ సెంచరీలతో 469 పరుగులు చేశాడు. చదవండి: #WTC Final: రాహుల్ స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్.. బీసీసీఐ ప్రకటన View this post on Instagram A post shared by Taran Adarsh (@taranadarsh) -
సూపర్... సూపర్... సూపర్... హీరో
ప్రపంచాన్ని అంతం చేయడానికి ఎన్ని శక్తులు పుట్టుకొచ్చినా వాటిని అంతమొందించేందుకు ఒక హీరో పుట్టుకొస్తాడు. విలన్‌కే అంత పవర్ ఉంటే హీరోకు ఇంకెంత పవర్ ఉండాలి? సూపర్ పవర్ ఉండాలి కదూ? అలాంటి సూపర్ పవర్స్‌తో మనల్ని సంవత్సరాలుగా కట్టిపడేస్తోన్న సూపర్ హీరోలందరూ ఒకేసారి తెరపై కనిపిస్తే? ఆ సంబరం ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తోంది. ‘ఐరన్‌మేన్’, ‘స్పైడర్‌మేన్’, ‘కెప్టెన్ అమెరికా’, ‘బ్లాక్‌పాంథర్’.. ఇలా సూపర్ హీరోలుగా ఎన్నో అడ్వెంచర్స్ చేసి మనల్ని మెప్పించిన సూపర్ హీరో క్యారెక్టర్స్ అందరూ ఏకమై ఒక పెద్ద శక్తిపై పోరాడేందుకు చేసే యుద్ధమే ‘అవెంజర్స్’. ఈ సిరీస్‌లో మూడో సినిమా ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ ఏప్రిల్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై ఇప్పటికీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ ఒక్క సినిమా కోసమే సూపర్ హీరో సినిమా ఫ్యాన్స్ అంతా సంవత్సర కాలంగా ఎదురుచూస్తూ వచ్చారు. మన ఇండియన్ సినిమాకు ‘బాహుబలి’ లాంటిది హాలీవుడ్‌కు ఈ సినిమా. అవెంజర్స్ ప్రత్యేకతలేంటీ? హాలీవుడ్ టాప్ ఫోర్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్కి కారణం ఏంటీ? తెలుసుకోవాలంటే అసలు కథలోకి వెళ్లాల్సిందే! మార్వెల్స్ మ్యాజిక్.... మార్వెల్ కామిక్స్ది ఒక చరిత్ర. కామిక్ పుస్తకాలతో దశాబ్దాలుగా ఎందరో సూపర్ హీరోలను సృష్టించిన మార్వెల్, ఆ సూపర్ హీరోలనే సినిమాలుగానూ తీసుకొచ్చి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ సూపర్ హీరోలు ఇండియన్ సినిమా ఫ్యాన్స్‌కూ తెగ కిక్ ఇచ్చేస్తుంటారు. అవెంజర్స్.. ఈ సూపర్ హీరోలందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి చేయించే యుద్ధం. 2012లో ‘అవెంజర్స్’ సిరీస్‌లో మొదటి సినిమా వచ్చింది. ఇది అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. ఆ తర్వాత 2015లో ‘అవెంజర్స్ : ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’ వచ్చింది. అదీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. ఇక ఇప్పుడు 2018లో తాజాగా ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ వచ్చేసింది. ఇదీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అనిపించుకుంటూ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతోంది. 2019లో ఈ కొత్త సినిమాకు సీక్వెల్ రానుంది. అవెంజర్స్‌లో సూపర్ హీరోలంతా ఈ ప్రపంచాన్ని కాపాడ్డానికే కష్టపడుతుంటారు. ఒక్కో సినిమాలో ఒక్కో విలన్. ఇన్ఫినిటీ వార్ కథేంటీ? ఇన్ఫినిటీ వార్‌లో థానోస్‌పై యుద్ధం చేస్తున్నారు మన సూపర్ హీరోలంతా. ప్రపంచాన్ని జయించే శక్తిని సంపాదించి, ఈ ప్రపంచాన్నంతా తన చేతుల్లోకి తెచ్చుకోవాలని చూస్తుంటాడు థానోస్. అందుకు ఎంతటి విధ్వంసానికైనా వెనుకాడడు. ఆ థానోస్‌ను ఎదుర్కొని, ప్రపంచాన్ని కాపాడ్డానికి సూపర్ హీరోలంతా ఏకమై ఒక యుద్ధం చేయాలి. అలాంటి ఇలాంటి యుద్ధం కాదది. థానోస్‌ను ఎదుర్కోవాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఐరన్‌మేన్, హల్క్, స్పైడర్‌మేన్ తదితర మార్వెల్ సృష్టించిన సూపర్ హీరోలంతా తమకు మాత్రమే సాధ్యమయ్యే విన్యాసాలు, అడ్వెంచర్స్ చేస్తూ థానోస్ పనిపడతారు. ఆద్యంతం కట్టిపడేసే యాక్షన్ ఎపిసోడ్స్‌తో, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్‌తో ఇన్ఫినిటీ వార్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అవెంజర్స్ టీమ్...మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో పందొమ్మిదో సినిమాగా ఇన్ఫినిటీ వార్‌ను తీసుకొచ్చింది. ఆంథోని రుస్సో, జాయ్ రుస్సో ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రాబర్ట్ డోనీ జూనియర్ ఐరన్‌మేన్‌గా, క్రిస్ హెమ్స్‌వర్త్ హల్క్‌గా, క్రిస్ ఈవన్స్ కెప్టెన్ అమెరికాగా, ఛద్విక్ బోస్మన్ బ్లాక్పాంథర్గా, స్కార్లెట్ జోహన్సన్ బ్లాక్ విడోగా నటించిన ఈ సినిమాలో ఎక్కడ చూసినా, ఏ సమయంలో చూసినా, స్క్రీన్ నిండా స్టార్సే కనిపిస్తారు. ఆ స్టార్స్ చేసే సందడి థియేటర్లలో అభిమానులకు పండగ వాతావరణాన్ని తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఒక్కో క్యారెక్టర్‌కూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం కూడా ఇన్ఫినిటీ వార్‌కు ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి. బడ్జెట్ ‘హీరో’... ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ను ఒక సినిమాటిక్ అద్భుతంలా తెరకెక్కించాలన్నది మార్వెల్ స్టూడియోస్ కల. ఆ కలకు తగ్గట్టే బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ, విజువల్ వండర్‌గా ఇన్ఫినిటీ వార్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇందుకు అయిన బడ్జెట్ కూడా అంతా ఇంతా కాదు. దాదాపు రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఇన్ఫినిటీ వార్ తెరకెక్కింది. ఇది హాలీవుడ్ చరిత్రలో టాప్ 4 బడ్జెట్ సినిమాల్లో ఒకటి. అంత బడ్జెట్ పెట్టారు కాబట్టే, ఇంత మంది స్టార్స్ ఒక దగ్గరికి రావడం, ఇంత బెస్ట్ ఔట్పుట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించడం జరుగుతోందని అంటారు ఫ్యాన్స్. బాక్సాఫీస్ ‘సూపర్ హీరో’... టాప్ 4లో చోటు... ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ బడ్జెట్లో దాదాపు 300 మిలియన్ డాలర్లతో హీరో అయితే, బాక్సాఫీస్ వద్ద సూపర్ హీరో రేంజ్లో నాలుగో వారంలోకి అడుగు పెట్టేసరికి 1.7 బిలియన్ డాలర్లు (సుమారు 11 వేల కోట్ల రూపాయలు) వసూలు చేసి 2 బిలియన్ మార్క్ వైపు దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఒక ప్రభంజనమే సృష్టిస్తూ వచ్చిందీ సినిమా. ఇండియన్ బాక్సాఫీస్‌పై ఇన్ఫినిటీ ‘వార్’! ఇండియన్ సినిమా అభిమానులకు సూపర్ హీరో సినిమాలంటే పిచ్చి అభిమానమని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక్కడ సూపర్‌హీరోలకు చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు అన్ని వర్గాల వాళ్లూ ఫ్యాన్స్ ఉన్నారు. ఇన్ఫినిటీ వార్ కోసం వీళ్లంతా ఏడాది ప్రారంభం నుంచే ఎదురుచూస్తూ వచ్చారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు రెండు వేల థియేటర్లలో సినిమాను విడుదల చేశారు. కేవలం మొదటిరోజే 30 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టి, ఈ ఏడాది బాలీవుడ్లో అన్ని సినిమాల ఓపెనింగ్ డే రికార్డులను బద్దలు కొట్టింది ఇన్ఫినిటీ వార్. ఇదే జోరు ఈరోజుకీ కొనసాగుతూండడం విశేషంగా చెప్పుకోవాలి. ఇప్పటికే 200కోట్ల మార్క్‌ను కూడా దాటేసి (మూడోవారం ముగిసేసరికి 215 కోట్ల రూపాయలు), ‘ది జంగిల్ బుక్’ రికార్డును కూడా బ్రేక్ చేసి ఇండియాలో ఇప్పటికే పెద్ద బ్లాక్‌బస్టర్‌గా ఇన్ఫినిటీ వార్ నిలిచింది. 200 కోట్ల మార్క్‌ను చేరుకున్న మొదటి హాలీవుడ్ సినిమా ఇదే! మే నెలంతా పిల్లలకు సెలవులే కావడంతో ఇన్ఫినిటీ వార్ ఇండియాలో ఇంకొన్ని రోజులు ఇలాగే కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. విచిత్రంగా ఇప్పటివరకూ మార్వెల్ సినిమాలు పరిచయం లేని వాళ్లు కూడా అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్ గురించి ఆసక్తిగా తెలుసుకుంటూ ఉండటం విశేషంగా చెప్పుకోవాలి! ప్రపంచాన్ని అంతం చేయడానికి ఎన్ని శక్తులు పుట్టుకొచ్చినా వాటిని అంతమొందించేందుకు ఒక హీరో పుట్టుకొస్తాడు. విలన్‌కే అంత పవర్ ఉంటే హీరోకు ఇంకెంత పవర్ ఉండాలి? సూపర్ పవర్ ఉండాలి కదూ? అలాంటి సూపర్ పవర్స్‌తో మనల్ని సంవత్సరాలుగా కట్టిపడేస్తోన్న సూపర్ హీరోలందరూ ఒకేసారి తెరపై కనిపిస్తే? ఆ సంబరం ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తోంది. ‘ఐరన్‌మేన్’, ‘స్పైడర్‌మేన్’, ‘కెప్టెన్ అమెరికా’, ‘బ్లాక్‌పాంథర్’.. ఇలా సూపర్ హీరోలుగా ఎన్నో అడ్వెంచర్స్ చేసి మనల్ని మెప్పించిన సూపర్ హీరో క్యారెక్టర్స్ అందరూ ఏకమై ఒక పెద్ద శక్తిపై పోరాడేందుకు చేసే యుద్ధమే ‘అవెంజర్స్’. ఈ సిరీస్‌లో మూడో సినిమా ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ ఏప్రిల్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై ఇప్పటికీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ ఒక్క సినిమా కోసమే సూపర్ హీరో సినిమా ఫ్యాన్స్ అంతా సంవత్సర కాలంగా ఎదురుచూస్తూ వచ్చారు. మన ఇండియన్ సినిమాకు ‘బాహుబలి’ లాంటిది హాలీవుడ్‌కు ఈ సినిమా. అవెంజర్స్ ప్రత్యేకతలేంటీ? హాలీవుడ్ టాప్ ఫోర్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్కి కారణం ఏంటీ? తెలుసుకోవాలంటే అసలు కథలోకి వెళ్లాల్సిందే! మార్వెల్స్ మ్యాజిక్.... మార్వెల్ కామిక్స్ది ఒక చరిత్ర. కామిక్ పుస్తకాలతో దశాబ్దాలుగా ఎందరో సూపర్ హీరోలను సృష్టించిన మార్వెల్, ఆ సూపర్ హీరోలనే సినిమాలుగానూ తీసుకొచ్చి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ సూపర్ హీరోలు ఇండియన్ సినిమా ఫ్యాన్స్‌కూ తెగ కిక్ ఇచ్చేస్తుంటారు. అవెంజర్స్.. ఈ సూపర్ హీరోలందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి చేయించే యుద్ధం. 2012లో ‘అవెంజర్స్’ సిరీస్‌లో మొదటి సినిమా వచ్చింది. ఇది అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. ఆ తర్వాత 2015లో ‘అవెంజర్స్ : ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’ వచ్చింది. అదీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. ఇక ఇప్పుడు 2018లో తాజాగా ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ వచ్చేసింది. ఇదీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అనిపించుకుంటూ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతోంది. 2019లో ఈ కొత్త సినిమాకు సీక్వెల్ రానుంది. అవెంజర్స్‌లో సూపర్ హీరోలంతా ఈ ప్రపంచాన్ని కాపాడ్డానికే కష్టపడుతుంటారు. ఒక్కో సినిమాలో ఒక్కో విలన్. ఇన్ఫినిటీ వార్ కథేంటీ? ఇన్ఫినిటీ వార్‌లో థానోస్‌పై యుద్ధం చేస్తున్నారు మన సూపర్ హీరోలంతా. ప్రపంచాన్ని జయించే శక్తిని సంపాదించి, ఈ ప్రపంచాన్నంతా తన చేతుల్లోకి తెచ్చుకోవాలని చూస్తుంటాడు థానోస్. అందుకు ఎంతటి విధ్వంసానికైనా వెనుకాడడు. ఆ థానోస్‌ను ఎదుర్కొని, ప్రపంచాన్ని కాపాడ్డానికి సూపర్ హీరోలంతా ఏకమై ఒక యుద్ధం చేయాలి. అలాంటి ఇలాంటి యుద్ధం కాదది. థానోస్‌ను ఎదుర్కోవాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఐరన్‌మేన్, హల్క్, స్పైడర్‌మేన్ తదితర మార్వెల్ సృష్టించిన సూపర్ హీరోలంతా తమకు మాత్రమే సాధ్యమయ్యే విన్యాసాలు, అడ్వెంచర్స్ చేస్తూ థానోస్ పనిపడతారు. ఆద్యంతం కట్టిపడేసే యాక్షన్ ఎపిసోడ్స్‌తో, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్‌తో ఇన్ఫినిటీ వార్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అవెంజర్స్ టీమ్...మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో పందొమ్మిదో సినిమాగా ఇన్ఫినిటీ వార్‌ను తీసుకొచ్చింది. ఆంథోని రుస్సో, జాయ్ రుస్సో ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రాబర్ట్ డోనీ జూనియర్ ఐరన్‌మేన్‌గా, క్రిస్ హెమ్స్‌వర్త్ హల్క్‌గా, క్రిస్ ఈవన్స్ కెప్టెన్ అమెరికాగా, ఛద్విక్ బోస్మన్ బ్లాక్పాంథర్గా, స్కార్లెట్ జోహన్సన్ బ్లాక్ విడోగా నటించిన ఈ సినిమాలో ఎక్కడ చూసినా, ఏ సమయంలో చూసినా, స్క్రీన్ నిండా స్టార్సే కనిపిస్తారు. ఆ స్టార్స్ చేసే సందడి థియేటర్లలో అభిమానులకు పండగ వాతావరణాన్ని తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఒక్కో క్యారెక్టర్‌కూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం కూడా ఇన్ఫినిటీ వార్‌కు ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి. బడ్జెట్ ‘హీరో’... ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ను ఒక సినిమాటిక్ అద్భుతంలా తెరకెక్కించాలన్నది మార్వెల్ స్టూడియోస్ కల. ఆ కలకు తగ్గట్టే బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ, విజువల్ వండర్‌గా ఇన్ఫినిటీ వార్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇందుకు అయిన బడ్జెట్ కూడా అంతా ఇంతా కాదు. దాదాపు రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఇన్ఫినిటీ వార్ తెరకెక్కింది. ఇది హాలీవుడ్ చరిత్రలో టాప్ 4 బడ్జెట్ సినిమాల్లో ఒకటి. అంత బడ్జెట్ పెట్టారు కాబట్టే, ఇంత మంది స్టార్స్ ఒక దగ్గరికి రావడం, ఇంత బెస్ట్ ఔట్పుట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించడం జరుగుతోందని అంటారు ఫ్యాన్స్. బాక్సాఫీస్ ‘సూపర్ హీరో’... టాప్ 4లో చోటు... ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ బడ్జెట్లో దాదాపు 300 మిలియన్ డాలర్లతో హీరో అయితే, బాక్సాఫీస్ వద్ద సూపర్ హీరో రేంజ్లో నాలుగో వారంలోకి అడుగు పెట్టేసరికి 1.7 బిలియన్ డాలర్లు (సుమారు 11 వేల కోట్ల రూపాయలు) వసూలు చేసి 2 బిలియన్ మార్క్ వైపు దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఒక ప్రభంజనమే సృష్టిస్తూ వచ్చిందీ సినిమా. -
హాలీవుడ్ మాస్ బొమ్మ@2018
ఎక్కణ్నుంచో ఏదో వెంట పడుతున్నట్లు ఉంటుంది. అందరూ పరిగెడుతూ ఉంటారు. అడవి. ఎటుపోవాలో తెలీదు. తప్పించుకోవాలి. పోరాటాలు చేస్తూనే ఉంటారు. హీరోలు వాళ్లు. భయపెట్టే జంతువులు అవి. ఎన్నేళ్లుగా చూస్తున్నాం ఈ కథలు, ఆ జంతువులకు డైనోసర్ అన్న పేరు పెట్టుకొని. సగటు ఇండియన్ సినిమా అభిమానికి హాలీవుడ్ అంటే ఇదీ! విజిల్స్ వేయించే మాస్ బొమ్మ. అలాంటి ‘జురాసిక్ పార్క్’ వింతలు కావాలి మనకు. ‘స్పైడర్‌మేన్’ సాహసాలు కావాలి. ఎప్పుడు ఏ కారు గాల్లోకి ఎగురుతుందో తెలియని యాక్షన్ కావాలి. నోరెళ్లబెట్టి కూర్చునేలా చేసే బొమ్మ కావాలి. హాలీవుడ్లో ఎన్నెన్ని సినిమాలు వచ్చినా, ఇలాంటి పక్కా బాక్సాఫీస్‌నే టార్గెట్ చేసుకొని వచ్చే మాస్ బొమ్మలకు ఉండే క్రేజ్ వేరు. ఈ ఏడాది కూడా బాక్సాఫీస్ దగ్గర సందడి చేసేందుకు అన్ని హంగులతో కొన్ని మాస్ సినిమాలు వస్తున్నాయి. ఈ వారం ఆ సినిమాలేంటో చూసొద్దాం.. జురాసిక్ వరల్డ్ ఫాలెన్ కింగ్డమ్ ‘జురాసిక్ పార్క్’ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో చెప్పక్కర్లేదు. డైనోసర్లు ఈసారి మరింత విజృంభించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమైపోతోంది. 2015లో వచ్చిన ‘జురాసిక్ వరల్డ్’.. అభిమానుల్లో ఈ సిరీస్‌కు ఉన్న క్రేజ్ ఏంటో తెలియజేసింది. ఇక ఇప్పుడొస్తున్న కొత్త సినిమా బాక్సాఫీస్ వద్ద డైనోసర్ మోత మోగిస్తుందన్న టాక్ అప్పుడే వినిపిస్తోంది. నిజంగా మాస్ ఆడియన్స్‌కు పండగ అంటే ఈ సినిమా అనే చెప్పుకోవాలి. జూన్ 22న జురాసిక్ వరల్డ్ విడుదల కానుంది. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఈ ఏడాది అన్నింటికంటే ఎక్కువ హైప్ ఈ సినిమాకే ఉందని చెప్పాలి. అవెంజర్స్‌కి ఉన్న క్రేజ్ అనుకోవచ్చు, ట్రైలర్‌తో అదరగొట్టడం కావొచ్చు.. అవెంజర్స్ కోసం అభిమానులంతా పిచ్చి పిచ్చిగా ఎదురుచూస్తున్నారు. యాక్షన్ సినిమా అభిమానులకు ట్రీట్‌లా ఉంటుందట ఈ సినిమా. కమర్షియల్ సినిమా అభిమానులూ.. సమ్మర్లో.. ఏప్రిల్ 27న వస్తోందీ సినిమా!! మిషన్ ఇంపాజిబుల్ 6 యాక్షన్ సినిమా అభిమానుల ఫేవరెట్స్‌లో ‘మిషన్ ఇంపాజిబుల్’ తప్పక ఉంటుంది. ఈసారి ఆ యాక్షన్ ఇంకెక్కువే ఉంటుందట. ఒక్కో సీక్వెల్‌కు స్టైల్‌ను, యాక్షన్‌ను పెంచుతూ పోతోన్న ఈ సిరీస్, ఈసారి కమర్షియల్ సినిమా అభిమానిని అలా కూర్చొబెట్టి కట్టిపడేస్తుందట. జూలై 27కు విడుదలవుతుంది ఈ సినిమా. స్పైడర్‌మేన్ ఇన్టు ది స్పైడర్ వర్స్ చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ కట్టిపడేసే సూపర్‌హీరో స్పైడర్‌మేన్ కూడా ఈ ఏడాది చివర్లో సందడి చేయడానికి వస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 14న విడుదల కానుందీ సినిమా. విడుదలకు ఇంకా చాలా టైమ్ ఉండడంతో పక్కా కమర్షియల్, సూపర్‌హిట్ అవుట్‌పుట్‌నే బయటకు తీసుకొస్తున్నారట. బ్లాక్ప్యాంథర్ మార్వెల్ స్టూడియోస్ సృష్టించిన బ్లాక్ప్యాంథర్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సూపర్‌హీరో క్యారెక్టర్లో ఇదొక డిఫరెంట్ స్టైల్. 2016లో వచ్చిన ‘కెప్టెన్ అమెరికా : సివిల్ వార్’ (2016)లో బ్లాక్‌పాంథర్ క్యారెక్టర్‌కు రెట్టింపు ఎనర్జీతో ఇప్పుడు కొత్తగా వస్తోన్న క్యారెక్టర్ ఉంటుందట. ఫిబ్రవరి 16న వస్తోన్న ఈ సినిమా విజువల్ ట్రీట్‌తో అద్భుతమైన సినిమాటిక్ ఫీల్ ఇస్తుందని హాలీవుడ్ టాక్. ఇవే కాకుండా ‘ఎక్స్–మెన్ డార్క్ ఫియొనిక్స్’, ‘అక్వామేన్’, ‘ఫెంటాస్టిక్ బీస్ట్స్’, ‘ది ప్రిడేటర్’, ‘యాంట్‌మేన్’ లాంటి సూపర్ డూపర్ కమర్షియల్ సినిమాలు కూడా ఈ ఏడాదే సందడి చేయనున్నాయి. హాలీవుడ్ మాస్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ ఏడాది కావాల్సినన్ని సినిమాలున్నాయి మరి, చూడడానికి!! -
ఆకట్టుకుంటున్న స్పైడర్ మ్యాన్ టీచర్!
మెక్సికోః విద్యార్థులకు అర్థమయ్యేట్టు పాఠాలు బోధించడం అంటే అంత సులభం కాదు. అందులోనూ సైన్స్ పాఠాలు బోధించడం ఉపాధ్యాయులకు కత్తిమీద సామే. అందుకే ఓ టీచర్ పాఠాలు చెప్పేందుకు సింపుల్ సొల్యూషన్ కనిపెట్టాడు. విద్యార్థులు పాఠాలు శ్రద్ధగా వినేందుకు, వారిలో అవగాహన పెంచడంతోపాటు పాఠం వినడంలో పిల్లలు నిమగ్నమయ్యేందుకు సైన్స్ ను చక్కగా వివరించేందుకు కొత్త మార్గాన్ని అవలంబించాడు. పాఠం చెప్పేందుకు క్లాస్ రూం కు స్పైడర్ మ్యాన్ డ్రెస్ ధరించి వెళ్ళాడు. క్లాసులో పిల్లలు పాఠాలు శ్రద్ధగా, ఇష్టంగా వినాలంటే టీచర్ చెప్పే విధానం బాగుండాలి. అయితే ఎంతో అనుభవం ఉన్న టీచర్లు కూడ ఒక్కోసారి విద్యార్థులను ఆకట్టుకోవడంలో విఫలమౌతుంటారు. అయితే పిల్లలకు పుస్తకాలంటే బోర్ కొట్టకుండా, పాఠం శ్రద్ధగా వినేందుకు మెక్సికోకు చెందిన 26 ఏళ్ళ సైన్స్ టీచర్.. మోజెస్ వాజ్ క్వెజ్ వినూత్న పద్ధతిలో ప్రయత్నించాడు. వాస్తవ జీవితంలో సూపర్ హీరోలా విద్యార్థులముందు స్పైడర్ మ్యాన్ దుస్తులు ధరించి ప్రత్యక్షమయ్యాడు. కంప్యూటర్ సైన్స్ పట్ల వారిలో ఆసక్తిని రేకెత్తించాడు. మోజెస్ మెక్సికో నేషనల్ అటానమస్ విశ్వవిద్యాలయం (యుఎన్ ఏఎమ్) లో సైన్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ పాఠాలపట్ల విసుగు చెందకుండా ఉండేందుకు మోజెస్ పలు స్పైడర్ మ్యాన్ కామిక్స్ ను ప్రయోగించి పాఠాలు బోధిస్తున్నాడు. పార్ట్ టైం సైన్స్ టీచర్, ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ పీటర్ పార్కర్ స్ఫూర్తితో విద్యార్థులు సూపర్ హీరోగా భావించే స్పైడర్ మ్యాన్ సూట్ ధరించి పాఠాలు చెప్పేందుకు నిర్ణయించుకున్నాడు. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనో, ఉత్తమ శ్రేణి ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకోవాలనో తాను ప్రయత్నించడం లేదని, నిజాయితీగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించి, క్లాస్ రూం అంటే బెటర్ ప్లేస్ అన్న ఫీలింగ్ విద్యార్థుల్లో కలిగేట్లు ప్రయత్నిస్తున్నానని మోజెస్ చెప్తున్నాడు. తూర్పు మెక్సికోలో తన తల్లితోపాటు నివసిస్తున్న మోజెస్... స్పైడర్ మ్యాన్ డ్రెస్ ధరించి ప్రజారవాణా వాహనాల్లోనే యూనివర్శిటీకి వెడుతుంటాడు. తోటి ప్రయాణీకులు అతన్ని సూపర్ హీరోగా భావించినప్పటికీ తాను విశ్వవిద్యాలయంలో సైన్స్ టీచర్ ను మాత్రమే అని వివరిస్తుంటాడు. స్పైడర్ మ్యాన్ ఆలోచనపై మోజెస్ కుటుబం మొదట్లో అతడి కెరీర్ కు హాని కలిగిస్తుందేమోనని భయపడింది. కానీ మోజెస్ తనదైన రీతిలో స్పైడర్ మ్యాన్ డ్రెస్ ధరించి తరగతులకు వెళ్ళి విద్యార్థుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించాడు. తన ఆలోచనతో ఒక్క విద్యార్థులనే కాక వర్శిటీలోని ఇతర ఉపాధ్యాయులనూ ఆకట్టుకున్నాడు. మొదటి రోజు వారంతా స్పైడర్ మ్యాన్ డ్రెస్ లో చూసి ఆశ్చర్యపోయినా... తర్వాత సంతోషంగా నవ్వుతూ ఆహ్వానించారని, చేసే పనిపట్ల బాధ్యత కలిగి ఉంటే, శక్తి అదే వస్తుందని మోజెస్ చెప్తున్నాడు. -
స్పైడర్‌గా కొత్త మ్యాన్
అతను హైస్కూల్ కుర్రాడు... తెలివైనవాడు కానీ అమాయకుడు. అందరి చేతిలోనూ దెబ్బలు తింటూ ఉంటాడు. హఠాత్తుగా ఓ సాలీడు కుట్టడం వల్ల ఎగురుతాడు, గోడ మీద పాకుతాడు... ఎంత ఎత్తు మీద నుంచైనా దూకుతాడు. ప్రపంచాన్నే కాపాడే స్థాయికి ఎదుగుతాడు. ఈ కథ విన్న వాళ్లెవరికైనా గుర్తొచ్చే సూపర్‌హీరో ‘స్పైడర్‌మ్యాన్’. చెప్పాలంటే పిల్లల్నీ, పెద్దలందరినీ ఆకట్టుకుంటాడీ స్పైడర్ హీరో. ప్రేక్షకుల మనసుల్లో ఈ సాలీడు వీరుడు గూడు అల్లేసుకున్నాడు. ఇప్పటివరకూ ఈ హీరో వెండితెరపై చాలాసార్లు కనిపించాడు. గడచిన పదమూడేళ్లల్లో వచ్చిన స్పైడర్‌మ్యాన్ సిరీస్ చిత్రాల్లో ఇద్దరు నటులు ఈ హీరో పాత్ర చేశారు. ఒకరు - టొబే మాగ్వైర్, మరొకరు - ఆండ్రూ గ్యార్‌ఫీల్డ్. హైస్కూల్ విద్యార్థులుగా ఈ ఇద్దరు నటులు మంచి అభినయం కనబరిచారు. ఈ సినిమాలో నటించే సమయానికి వారికి 26, 27 ఏళ్లున్నాయి. ఇప్పుడు మళ్లీ ‘స్పైడర్‌మ్యాన్’ సిరీస్‌ను మొద లుపెట్టడానికి సోనీ, మార్వెల్ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే, ఈ పాత్రకు కొత్త కుర్రాణ్ణి ఎంపిక చేశాయి. అలా ఈ తాజా స్పైడర్‌మ్యాన్ పాత్ర కు బ్రిటన్‌కు చెందిన 19 ఏళ్ల టామ్ హాలాండ్‌ను ఎంపిక చేశారు. సో... ఇప్పుడీ కుర్రాడు ఈ మధ్యకాలంలో ముచ్చటగా మూడో స్పైడర్ మ్యాన్ అన్నమాట. -
యానిమేషన్లో స్పైడర్‌మ్యాన్!
స్పైడర్‌మ్యాన్ అంటే పిల్లలకు ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. తెరపై ఇతగాడు చేసే సాహసాలు చూసి, తమని తాము ఓ స్పైడర్‌మ్యాన్‌లా ఊహించేసుకుంటారు. ఇప్పటివరకు ఎన్నో స్పైడర్‌మ్యాన్ చిత్రాలు చూశాం. కానీ, మరో మూడేళ్లల్లో యానిమేటెడ్ స్పైడర్‌మ్యాన్‌ని చూడనున్నాం. సోనీ పిక్చర్స్ అధినేత టామ్ రాథ్మ్యాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2018లో యానిమేటెడ్ స్పైడర్‌మ్యాన్ చిత్రాన్ని విడుదల చేస్తామనీ, ఇప్పటివరకూ వచ్చిన స్పైడర్‌మ్యాన్ కథలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
ఇప్పుడిక యాంట్ మేన్
స్పైడర్ మేన్, బ్యాట్మేన్లు వెండితెరపై చేసిన వీర విహారం గురించి అందరికీ తెలుసు. కానీ, యాంట్ మేన్ గురించి ఎవరూ విని ఉండరు. మరో ఆరు నెలల్లో వెండితెరపై ఈ యాంట్ మేన్ పాకనున్నాడు. పేటన్ రీడ్ దర్శకత్వం వహిస్తున్న ‘యాంట్ మేన్’ చిత్రంలో కథానాయకునిగా పాల్ రడ్ చేస్తున్నారు. కథలో భాగంగా ఈ యాంట్ మేన్‌కి ఓ ప్రయోగం ద్వారా ఆకారం తగ్గిపోయినా బలం రెండింతలవుతుంది. ఆ తర్వాత అతను ఎలాంటి విన్యా సాలు చేశాడనే అంశాలతో ఈ చిత్రం సాగుతుంది. 2006లో యాంట్ మేన్ కథకు సన్నాహాలు మొదలుపెట్టారు. 2011కి మూడు స్క్రిప్ట్‌లు సిద్ధం చేసుకుని, ముఖ్య పాత్రకు సంబంధించి టెస్ట్ షూట్ చేశారు. గత ఏడాది చిత్రీకరణ మొదలుపెట్టారు. ఈ ఏడాది జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
సరికొత్త సూపర్ ఉమన్!
స్పైడర్మాన్, సూపర్మాన్, హీమ్యాన్, శక్తిమాన్, ఆర్యమాన్... ఇలా అద్వితీయ శక్తులన్నీ టోకుగా పురుషులకు మాత్రమే పరిమితమా? మహిళలు కేవలం రక్షించబడడానికి మాత్రమే పరిమితమా? మహిళల్లో సూపర్ ఉమన్లు లేరా? బహుశా ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా కావచ్చు... ‘ప్రియ’ అనే సరికొత్త (కామిక్ బుక్) సూపర్ ఉమన్ రంగం మీదికి వచ్చింది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను దృష్టిలో పెట్టుకొని చిత్ర నిర్మాత రామ్ దేవ్నేని ధీరోదత్తమైన ఈ ‘ప్రియ’ పాత్రకు రూపకల్పన చేశారు. సాధారణంగా కామిక్ పుస్తకాల్లో వినోదం అధిక ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ‘ప్రియ’ మాత్రం సామాజిక స్పృహను దృష్టిలో పెట్టుకొని, మహిళల్లో ఆత్మస్థైర్యం నింపడానికి రూపొందిన కామిక్ పుస్తకం. ఈ పుస్తకానికి డాన్ గోల్డ్‌మాన్ వేసిన ఇలస్ట్రేషన్లు అత్యద్భుతం అని చెప్పుకోవాలి. ఇక కథ విషయానికి వస్తే... ప్రియ అనే అందమైన యువతి పార్వతీదేవి భక్తురాలు. ఉపాధ్యాయురాలు కావాలనేది ప్రియ లక్ష్యం. పరిస్థితులు బాగో లేక చిన్నతనంలోనే చదువుకు స్వప్తి చెప్పి ఇంటి పనికే పరిమితమవుతుంది. ఒకానొక దురదృష్టకరమైన రోజు కొందరు దుర్మార్గుల చేతిలో ప్రియ అత్యాచారానికి గురవుతుంది. ఇంటికి దూరమవుతుంది. కొన్ని రోజుల తరువాత ఆమె పులిపై సవారీ చేస్తూ ఊరికి తిరిగి వస్తుంది. తనపై అత్యాచారానికి ఒడిగట్టిన దుర్మార్గులను శిక్షిస్తుంది. అంతేకాదు... స్త్రీలపై జరిగే అఘాయిత్యాలు, అత్యాచారాలు, భౌతిక, మానసిక హింసలను నిరోధించడానికి కంకణం కట్టుకుంటుంది. ప్రపంచానికి సరికొత్త సందేశం ఇవ్వడానికి పూనుకుంటుంది. పార్వతిదేవి ప్రియకు అండగా ఉంటుంది. ప్రియ పాత్రకు విస్తృత ప్రాచుర్యం కల్పించడానికి ముంబాయి వీధుల్లోని గోడలపై చేయితిరిగిన సినీ చిత్రకారులతో ఆకర్షణీయంగా బొమ్మలు గీయిస్తున్నారు రామ్ దేవ్నేని. తెల్లటి గోడలపై గంభీరంగా, ధైర్యసాహసాలు ఉట్టిపడేట్లు కనిపించే ప్రియ చిత్రాలు... కేవలం వర్ణచిత్రాలుగా మాత్రమే కనిపించవు... మహిళల్లో ఆత్మవిశ్వాసం, సాహసం నింపడానికి ఉద్దేశించిన సరికొత్త ఆయుధాలుగా కనిపిస్తాయి. సామాజికస్పృహను దృష్టిలో పెట్టుకొని, మహిళల్లో ఆత్మస్టైర్యం నింపడానికి రూపొందిన కామిక్ పుస్తకం ‘ప్రియాశక్తి’ స్త్రీలపై జరిగే అఘాయిత్యాలు, అత్యాచారాలు, భౌతిక, మానసిక హింసలు నిరోధించడానికి కంకణం కట్టుకుంటుంది ఈ పుస్తకంలోని ప్రియ పాత్ర. -
రిస్క్ చేస్తానంటున్న హృతిక్
వెండితెరపై విలన్లను హీరోలు ఇరగదీస్తుంటే, ప్రేక్షకులు థ్రిల్ అయిపోతుంటారు. వీరాధి వీరుడు... శూరాధి శూరుడు అని మెచ్చేసుకుంటుంటారు. కానీ, అన్ని ఫైట్లూ హీరో చెయ్యడు. బాగా రిస్క్ అనిపించినవాటిని డూప్‌తో చేయిస్తారు. కొంతమంది హీరోలు మాత్రం రిస్క్ తీసుకుంటారు. అలాంటివారిలో హృతిక్‌రోషన్ ముందు వరుసలో నిలుస్తారు. రిస్కులే నా నేస్తాలు అన్నట్లుగా ఉంటుంది ఆయన వ్యవహారం. ఇటీవల హృతిక్‌కి బ్రెయిన్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల పాటు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచించారట. కానీ, హృతిక్ మాత్రం రిస్కులకు రెడీ అయిపోయారు. ప్రస్తుతం ఆయన ‘బ్యాంగ్ బ్యాంగ్’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. వినూత్నంగా ఉండటంతో పాటు కాస్తంత ప్రమాదకరమైన పోరాటాలు కావడంతో డూప్‌తో చేయిద్దామని యూనిట్ సభ్యులు అన్నారట. కానీ, నకిలీకి నో చెప్పేశారట హృతిక్. ‘స్పైడర్‌మేన్ 2’కి పోరాటాలు సమకూర్చిన ఆండీ ఆర్మ్‌స్ట్రాంగ్ ఆధ్వర్యంలో ఈ ఫైట్స్ చిత్రీకరిస్తున్నారు. హృతిక్ తీసుకుంటున్న రిస్క్ చూసి, యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోతున్నారట. -
‘సూపర్ హీరో’లకు గౌరవం!
అదో వింత ఆకారం. దూరం నుంచి చూస్తేనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అదే ఏ స్పైడర్మేనో, సూపర్మేనో, బాట్మేనో, ఐరన్మేనో అయితే గాల్లో ఎగిరెగిరి ఆ ఆకారం షేపులు మార్చేస్తారు. ఈ సూపర్ హీరోలు చేసే విన్యాసాలను చూసి, పిల్లలు థ్రిల్ అయిపోతారు. పెద్దల పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంటుంది. ‘మనం కూడా ఓసారి అలా మారిపోతే ఎంత బాగుండు’ అనుకుంటాం. వాస్తవానికి స్పైడర్‌మేన్, సూపర్‌మేన్, బాట్మేన్, ఐరన్‌మేన్ కాల్పనిక పాత్రలని తెలిసినా, నిజం అన్నట్లుగా నమ్మేస్తాం. అంతగా ప్రేక్షకుల హృదయాలను ఈ పాత్రలు టచ్ చేశాయి. అందుకే, ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్ కమిటీ ఓ నిర్ణయం తీసుకుంది. వీక్షకులను ఎంతగానో ప్రభావితం చేస్తున్న ఈ ‘సూపర్ హీరో’ యానిమేషన్ కేరక్టర్స్‌ను, ఎంతో రిస్క్‌తో కూడుకున్న ఆ పాత్రలను పోషించే నటులను, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ తరహా చిత్రాలను నిర్మిస్తున్న నిర్మాతలను గౌరవించాలనుకుంది. మార్చి 2న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఆస్కార్ అవార్డ్స్ వేడుక జరగనుంది. ఈ లోపు ఆ ప్రాంగణంలో ఓ భారీ ఎగ్జిబిషన్‌ని ఏర్పాటు చేశారు. గత తొమ్మిది దశాబ్దాల్లో కాల్పనిక పాత్రలతో రూపొందిన చిత్రాలకు సంబంధించిన ఫొటోలు, పోస్టర్లను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. అలాగే, వెండితెరపై ఈ సూపర్ హీరోలు చేసిన విన్యాసాల తాలూకు వీడియో క్లిప్పింగ్స్‌ని కూడా ప్రదర్శిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్‌కి భారీ ఎత్తున స్పందన లభిస్తోందట. సుమారు 80 చిత్రాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, ప్టోసర్లను పొందుపరచడంతో చూడ్డానికి రెండు కళ్లూ చాలడంలేదని హాలీవుడ్వారు అంటున్నారు. ఆస్కార్ అవార్డ్ కమిటీ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ పద్ధతిని మెచ్చుకుంటున్నారు కూడా.