ఇప్పుడిక యాంట్ మేన్ | Six things to know about Marvel's new hero | Sakshi
Sakshi News home page

ఇప్పుడిక యాంట్ మేన్

Published Tue, Jan 6 2015 11:26 PM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM

ఇప్పుడిక యాంట్ మేన్

ఇప్పుడిక యాంట్ మేన్

 స్పైడర్ మేన్, బ్యాట్‌మేన్‌లు వెండితెరపై చేసిన వీర విహారం గురించి అందరికీ తెలుసు. కానీ, యాంట్ మేన్ గురించి ఎవరూ విని ఉండరు. మరో ఆరు నెలల్లో వెండితెరపై ఈ యాంట్ మేన్ పాకనున్నాడు. పేటన్ రీడ్ దర్శకత్వం వహిస్తున్న ‘యాంట్ మేన్’ చిత్రంలో కథానాయకునిగా పాల్ రడ్ చేస్తున్నారు. కథలో భాగంగా ఈ యాంట్ మేన్‌కి ఓ ప్రయోగం ద్వారా ఆకారం తగ్గిపోయినా బలం రెండింతలవుతుంది. ఆ తర్వాత అతను ఎలాంటి విన్యా సాలు చేశాడనే అంశాలతో ఈ చిత్రం సాగుతుంది. 2006లో యాంట్ మేన్ కథకు సన్నాహాలు మొదలుపెట్టారు. 2011కి మూడు స్క్రిప్ట్‌లు సిద్ధం చేసుకుని, ముఖ్య పాత్రకు సంబంధించి టెస్ట్ షూట్ చేశారు. గత ఏడాది చిత్రీకరణ మొదలుపెట్టారు. ఈ ఏడాది జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement