
ఐపీఎల్-2023లో అదరగొడుతున్న టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సరికొత్త అవతరమెత్తనున్నాడు. హాలీవుడ్ మూవీ "స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్"కు శుబ్‌మన్ గిల్ డబ్బింగ్ చెప్పబోతున్నాడు. గిల్ హిందీతో పాటు పంజాబీ వెర్షన్‌లకు తన వాయిస్‌ను అందించనున్నాడు.
ఇక ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా మూవీ మేకర్స్ సోమవారం రివీల్ చేశారు. ఈ యానిమేషన్ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా దేశవ్యాప్తంగా జూన్ 2న విడుదల చేయనుంది. ఈ మూవీ 10 భాషల్లో రిలీజ్ కానుంది. కాగా పవిత్ర్ ప్రభాకర్ అలియాస్ ఇండియన్ స్పైడర్ మ్యాన్ అనే క్యారెక్టర్ నేపథ్యంలో ఇండియన్ వెర్షన్ మూవీ సాగనుంది.
ఇండియన్ వెర్షన్‌లో స్పైడర్ మ్యాన్ చిత్రం తొలిసారి తెరక్కించారు. హిందీ, పంజాబీ భాషల్లో ఇండియన్ స్పైడర్ మ్యాన్ చిత్రానికి వాయిస్ అందించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను'' అని ఓ ప్రకటనలో గిల్ పేర్కొన్నాడు.
గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన గిల్.. నాలుగు హాఫ్ సెంచరీలతో 469 పరుగులు చేశాడు.
చదవండి: #WTC Final: రాహుల్ స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్.. బీసీసీఐ ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment