నాగ్‌ మల్టీస్టారర్‌ ఆగిపోయిందా..? | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 29 2018 10:25 AM

Nagarjuna And Dhanush Multi Starrer Shelved - Sakshi

ఈ ఏడాది దేవదాసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కింగ్ నాగార్జున తరువాత ఒక్క తెలుగు సినిమా కూడా అంగీకరించలేదు. బాలీవుడ్‌లో అతిథి పాత్రలో నటిస్తున్న బ్రహ్మాస్త్ర షూటింగ్‌ పూర్తి చేసిన నాగ్‌, కోలీవుడ్‌లో మరో మల్టీస్టారర్‌కు ఓకె చెప్పాడు. పవర్‌ పాండి సినిమాతో దర్శకుడిగా మారిన తమిళ స్టార్‌ హీరోగా ధనుష్‌ ఓ భారీ మల్టీస్టారర్‌ను డెరెక్ట్‌ చేసేందుకు రెడీ అయ్యాడు.

ముందుగా ఈ మల్టీస్టారర్‌లో రజనీకాంత్‌ను నటింప చేసేందుకు ప్రయత్నాలు జరిగినా.. తరువాత ఆ స్థానంలో నాగార్జునను తీసుకున్నారు. పూజ కార్యక్రమాలు కూడా జరుపుకున్న ఈ సినిమా ఇంత వరకు పట్టాలెక్కలేదు. అయితే ఇటీవల ధనుష్‌ మారి 2 రిలీజ్‌ తరువాత మల్టీస్టారర్‌ పనులు ప్రారంభిస్తారని అంతా భావించారు. అయితే మారి 2 రిలీజ్‌ అయిన వెంటనే ధనుష్‌ , అసురన్‌ అనే మరో సినిమాను ఎనౌన్స్‌ చేశాడు.

అసురన్‌ షూటింగ్ జనవరిలోనే ప్రారంభమవుతుందన్న టాక్‌ వినిపిస్తోంది. దీంతో ధనుష్‌ డైరెక్ట్ చేయబోయే మల్టీస్టారర్‌ ఆగిపోయిందన్న ప్రచారం మొదలైంది. తేనాండల్‌ మూవీస్‌ ఆర్థిక సమస్యలు కూడా ఈ ప్రాజెక్ట్‌ ను పక్కకు పెట్టడానికి ఓ కారణం అని తెలుస్తోంది. ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే చిత్రయూనిట్ నుంది అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement