నాగ్‌, ధనుష్‌ మల్టీస్టారర్‌కు టైటిల్‌ ఫిక్స్‌ | Nagarajuna Tamil Multi Starrer Title Naan Rudran | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 20 2018 10:04 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Nagarajuna Tamil Multi Starrer Title Naan Rudran - Sakshi

నటుడు ధనుష్‌ జోడు గుర్రాల పయనాన్ని జోరుగా సాగిస్తున్నారు. నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత అంటూ పలు కోణాలు ఉన్నాయి. ధనుష్‌ ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా బిజీగా ఉన్నారు. అదే సమయంలో దర్శకుడిగానూ దూసుకుపోతున్నారు. ధనుష్‌ నటించిన తాజా చిత్రం వడచెనై ఇటీవల తెరపైకి వచ్చి కాసుల వర్షం కురిపిస్తోంది.

ప్రస్తుతం గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో నటిస్తున్న ఎన్నై నోక్కి పాయుమ్‌ తోట్టా, బాలాజిమోహన్‌ దర్శకత్వంలో నటించి నిర్మిస్తున్న మారి–2 చిత్రాలు వరుసగా విడుదలకు ముస్తాబవుతున్నాయి. వడచెన్నై చిత్ర దర్శకుడు వెట్రిమారన్‌ త్వరలో ధనుష్‌తో మరో చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఇది వెక్కై అనే నవల ఆధారంగా తెరకెక్కనున్నట్లు సమాచారం.

సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థలో ధనుష్‌ నటించనున్నారట. ఈ సంస్థ ప్రస్తుతం అజిత్‌ హీరోగా విశ్వాసం చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇది వచ్చే ఏడాది సంక్రాంతి సంబరాలకు సిద్ధం అవుతోంది. సత్యజ్యోతి ఫిలింస్‌ టీజే.త్యాగరాజన్‌ నటుడు ధనుష్‌ హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్‌ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇటీవల రాక్షసన్‌ చిత్రంతో విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు రామ్‌కుమార్‌ దర్శకత్వంలోనూ ధనుష్‌ ఒక చిత్రం చేయనున్నారు. ప్రస్తుతం ధనుష్‌ హీరోగా నటిస్తూనే ఒక మల్టీస్టారర్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

బహుభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో టాలివుడ్‌ స్టార్‌ నటుడు నాగార్జున మరో హీరోగా నటిస్తున్నారు. దర్శకుడు ఎస్‌జే.సూర్య, నటి అదితిరావు తదితర భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి నాన్‌ రుద్రన్‌ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్ర కథలో 15వ శతాబ్ధానికి సంబంధించిన సన్నివేశాలుంటాయని, ఆ ఎపిసోడ్‌లోనే నాగార్జున కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement