తమన్నా వల్లే ఆగిపోయింది..! | Thiagarajan reveals why queen remake was shelved | Sakshi
Sakshi News home page

తమన్నా వల్లే ఆగిపోయింది..!

Published Thu, Apr 13 2017 2:34 PM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

తమన్నా వల్లే ఆగిపోయింది..!

తమన్నా వల్లే ఆగిపోయింది..!

బాలీవుడ్లో ఘనవిజయం సాధించిన క్వీన్ సినిమాను సౌత్లో రీమేక్ చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోలీవుడ్ నటుడు నిర్మాత త్యాగరాజన్, క్వీన్ రీమేక్ హక్కులు సొంతం చేసుకోగా.. ప్రధాన పాత్రల్లో కనిపించబోయే నటీనటుల కోసం చాలా కాలం కసరత్తులు చేశాడు. ఫైనల్గా తమన్నా హీరోయిన్గా సీనియర్ నటి రేవతి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే సడన్గా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందన్న ప్రకటన వచ్చింది.

క్వీన్ రీమేక్ ఆగిపోవడానికి కారణాలు ఇవే అంటూ రకరకాల వార్తలు వినిపించాయి. ఈ రూమర్స్ అన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ నిర్మాత త్యాగరాజన్ అసలు కారణాన్ని బయటపెట్టాడు. తమన్నా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం కారణంగానే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలిపాడు. ప్రస్తుతానికి క్వీన్ రీమేక్ను పక్కకు పెట్టినా.. సరైన నటి దొరికితే తిరిగి ప్రారంభిస్తానని తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement