
కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రుతీహాసన్(Shruti Haasan )..తనదైన నటనతో తక్కువ సమయంలోని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ కలిసి సినిమాలు చేసింది. చివరిగా సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. కోలీవుడ్ టు బాలీవుడ్.. అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తున్నప్పటికీ శ్రుతీ హాసన్‌పై పెద్దగా పుకార్లేవి రాలేదు. ఏ విషయంలో అయినా ఆమె నిక్కచ్చిగా ఉండమే దానికి కారణం.
ఏ అంశంపై అయినా తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తుంటారు. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై కూడా శ్రుతీ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ..అసలు ఉమెన్స్ డేని జరుపుకోవడం దేనికని ప్రశ్నించింది.
మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రుతీ మాట్లాడుతూ.. ‘మేల్ డే అనేది లేనప్పడు ప్రత్యేకంగా ‘ఉమెన్స్ డే’ ఎందుకు ? అంటే ఇంకా స్త్రీ వెనకబడి ఉందని చెప్పడానికే ఈ స్పెషల్ డేస్ జరుపుకుంటున్నారా? అలాగే ఉమెన్ ఓరియెంటెడ్’ సినిమా అంటారు. ‘మేల్ ఓరియెంటెడ్’ మూవీ అనరు. ముందు ఈ తేడా పోవాలి. మహిళా దినోత్సవం అనేది ప్రత్యేకంగా లేని రోజు ఉమెన్ ఎదిగినట్లు లెక్క’అని తనదైన శైలీలో చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment