
‘దేవి–2’ సెట్స్‌లో తమన్నా..
రెండేళ్ల క్రితం తమిళంలో రిలీజైన ‘దేవి’ చిత్రానికి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. ఇందులో ప్రభుదేవా, సోనూ సూద్, తమన్నా కీలక పాత్రలు చేశారు. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వం వహించారు. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా ‘దేవి 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలోనే తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభుదేవా లీడ్ రోల్ చేస్తున్నారు.
ఓ లీడ్ రోల్‌ను తమన్నా చేస్తున్నారు. ముగ్గురు హీరోయిన్స్‌కు స్కోప్ ఉన్న ఈ సినిమాలో మరో ఇద్దరు నాయికలుగా నిత్యా మీనన్, నందితా శ్వేతా పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో అమీ జాక్సన్ ఓ గెస్ట్ రోల్ చేస్తారట. ప్రస్తుతం ప్రభుదేవా, తమన్నా, కోవై సరళ పాల్గొనగా సీన్స్ తీస్తున్నారు. మరో బెస్ట్ టీమ్‌తో వర్క్ చేస్తున్నానని అంటున్నారు తమన్నా.
Comments
Please login to add a commentAdd a comment