Sonu soodh
-
నటుడి కుమారుడికి స్టార్ క్రికెటర్ పాఠాలు.. వీడియో వైరల్!
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ హంగామా నడుస్తోంది. ప్రతిష్ఠాత్మక వన్టే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి క్రికెట్‌పైనే ఉంది. బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు రాజకీయ నాయకులు సైతం మ్యాచ్ చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు సోనూ సూద్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. తన చిన్న కుమారుడు అయాన్ బ్యాటింగ్ మెలకువలు నేర్చుకుంటున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వరల్డ్ కప్‌లో వికెట్లతో అదరగొడుతున్న షమీ నుంచి సలహాలు తీసుకుంటున్న వీడియో తెగ వైరవులవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ భవిష్యత్ టీమిండియా క్రికెటర్‌కు చిట్కాలు నేర్పిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో గతంలో షమీ.. అయాన్‌కు మూడేళ్ల క్రితం ఇలా ట్రైనింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో షమీ తన బౌలింగ్‌తో అదరగొడుతున్నారు. అందుకే అత్యుత్తమైన క్రికెటర్‌తో నా కుమారుడు అయాన్‌కి శిక్షణ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ అతని కోచ్‌ను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం జరిగే భారత్-ఆస్ట్రేలియా ప్రపంచకప్ ఫైనల్ కోసం సోనూసూద్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. కాగా..సోనూ కన్నడ చిత్రం 'శ్రీమంత'లో చివరిసారిగా కనిపించారు. ప్రస్తుతం బాలీవుడ్లో 'ఫతే' షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ శక్తి సాగర్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించారు. జీ స్టూడియోస్‌తో కలిసి రూపొందించిన 'ఫతే' మూవీ 2024లో విడుదల కానుంది. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా నటిస్తోంది. View this post on Instagram A post shared by Sonu Sood (@sonu_sood) -
హెచ్ఐసీసీలో కొవిడ్ వారియర్స్‌కు సన్మానం ఫొటోలు
-
సోనూసూద్.. నిజమైన హీరో
సాక్షి, హైదరాబాద్, మాదాపూర్: ఎన్ని అటంకాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా సమాజ సేవలు చేసే వారికే గుర్తింపు లభిస్తుందని మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. కోవిడ్ కష్టకాలంలో సోనూసూద్ సేవాభావాన్ని చాటుకుని.. నిజజీవిత హీరోగా నిలిచారన్నారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో సోమవారం టీఎస్ఐజీ (తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్) ఆధ్వర్యంలో కరోనా సమయంలో ఉత్తమ సేవలందించిన ఐటీ, స్వచ్ఛంద సంస్థలతో పాటు కన్స్ట్రక్షన్ కంపెనీలకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, నటుడు, ప్రముఖ సామాజిక కార్యకర్త సోనూసూద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంచి పనులు చేసే వారిపై నిందలు సహజమేనన్నారు. కరోనా సమయంలో సమాజ సేవ చేయడంలో సోనూసూద్ తమవంతు బాధ్యతగా ఎన్నో గొప్ప పనులు చేశారని ప్రశంసించారు. సామాజిక మాధ్యమాల్లో విమర్శ చేయడం సులభమని, కానీ బాధ్యతగా సేవ చేసేవారికి తెలుసు దాని విలువేమిటో అని పేర్కొన్నారు. విమర్శలు వచ్చినా సోనూసూద్ వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలన్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తాడనే భయంతోనే దుష్ప్రచారం చేశారని చెప్పారు. స్వచ్ఛంద సేవా సంస్థలే స్ఫూర్తి...: సామాజిక బాధ్యతలను విధిగా నిర్వర్తించే కేటీఆర్‌లాంటి నాయకుడు ఉంటే తనలాంటి సేవకుల అవసరం ఎక్కువగా ఉండదని సోనూసూద్ అన్నారు. జమ్మూ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టామని, కానీ తెలంగాణ నుంచి మాత్రం మంచి స్పందన లభించిందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం కేటీఆర్‌కు సోషల్ మీడియాలో ట్యాగ్ చేయగానే వెంటనే స్పందించారని అన్నారు. ఇంకా తన బాధ్యత పూర్తవ్వలేదని, సేవలు కొనసాగుతాయని చెప్పారు. స్వచ్ఛంద సేవా సంస్థలు తనకు ఆదర్శమని, వారి నుంచి ఎల్లప్పుడూ స్ఫూర్తి పొందుతానని సోనూ వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ రాష్ట్ర కార్యదర్శి జయేశ్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఉత్తమ సేవలను అందించిన 12 కార్పొరేట్ సంస్థలు, 26 ఎన్జీవోలు, 6 సమన్వయ సంస్థలు, 22 మంది అసాధారణ వ్యక్తులకు ఈ–సర్టిఫికెట్ ద్వారా సత్కరించారు. -
ఈ నాలుగు రోజులు అతిథులతో బిజీగా ఉన్నా.. ఇప్పుడు ఓకే
ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ కార్యాలయాలు, ఇతర స్థల్లాల్లో ఐటీ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. నటుడికి సంబంధించిన అన్నిచోట్లా ఒకేసారి సోదాలు నిర్వహించారు. ఆయనకు చెందిన సోనూ సూద్ ఛారిటీ ఫౌండేషన్ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేశారు. దాడుల అనంతరం సోనూ.. రూ.20 కోట్లకు పైగా ట్యాక్స్ కట్టలేదని తేల్చినట్లు అధికారులు చెప్పారు. ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్ 20న) సోషల్ మీడియాలో సోనూసూద్ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేషన్‌లో ప్రతి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్ చేశాను. ఈ నాలుగు రోజులు అతిథులతో (ఐటీ అధికారులు) బిజీగా ఉండడం వల్ల మీ సేవకు దూరమయ్యా. ఇప్పుడు నేను తిరిగి వచ్చా. మీ సేవకై నా ప్రయాణం కొనసాగుతుంది’ అని ఆయన ట్విటర్లో పేర్కొన్నాడు. చదవండి: రూ. 20 కోట్ల పన్ను ఎగవేశారు “सख्त राहों में भी आसान सफर लगता है, हर हिंदुस्तानी की दुआओं का असर लगता है” 💕 pic.twitter.com/0HRhnpf0sY — sonu sood (@SonuSood) September 20, 2021 -
రూ. 20 కోట్ల పన్ను ఎగవేశారు
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సోనూసూద్, ఆయన భాగస్వాములు కలిపి 20 కోట్ల రూపాయలకు పైగా పన్నుని ఎగవేసినట్టు ఆదాయ పన్ను శాఖ తెలిపింది. గత మూడు రోజులుగా ముంబైలోని సోనూసూద్ నివాసం, కార్యాలయాలు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆయన భాగస్వాముల కార్యాలయాల్లో సోదాలు జరిపిన ఐటీ శాఖ ఆయన ఆర్థిక లావాదేవీలన్నీ పరిశీలించింది. 20 కోట్లకు పైగా ఆదాయ పన్ను ఎగ్గొట్టినట్టు గుర్తించామని శనివారం ఐటీ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఐటీ శాఖ వివరాల ప్రకారం... సోనూసూద్ లెక్కల్లో చూపించని ఆదాయాన్ని ఎన్నో బోగస్ సంస్థల నుంచి తనఖాలేని రుణాల రూపంలో తీసుకున్నారు. ఈ నిధులతో పెట్టుబడులు పెట్టడం, ఆస్తులు సమకూర్చుకోవడం వంటివి చేశారు. అంతేకాదు సోనూసూద్ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సిఆర్ఏ) కింద నిబంధనలకు వ్యతిరేకంగా విదేశీ దాతల నుంచి క్రౌడ్ ఫండింగ్ ద్వారా 2.1 కోట్లు సేకరించారు. కరోనా ఫస్ట్ వేవ్‌లో ఏర్పాటు చేసిన సూద్ ఛారిటీ ఫౌండేషన్‌కి ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ఇప్పటివరకు రూ.18.94 కోట్ల విరాళాలు అందగా.. సోనూసూద్ వాటిలో 1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాలకు వెచి్చంచారు. మిగిలిన డబ్బంతా ఆ ఖాతాలోనే ఉంది. మరోవైపు సోనూసూద్‌కు చెందిన కంపెనీ ఇటీవల లక్నోకి చెందిన ఒక రియల్ ఎస్టేట్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకుని సంయుక్తంగా ప్రాజెక్టులు మొదలు పెట్టింది. ఇప్పుడు ఐటీ శాఖ ఆ ఒప్పందాలు, ప్రాజెక్టులపై దృష్టి సారించింది. లక్నో సంస్థ బోగస్ బిల్లులు, సంస్థల ద్వారా నిధులు మళ్లించినట్టుగా ఐటీ వర్గాలు ఆరోపించాయి. అలా 65 కోట్లకు పైగా నిధులు బోగస్ కంపెనీలకు దారి మళ్లినట్టుగా అనుమానిస్తున్నారు. ఇక సోదాల సమయంలో సోనూసూద్ వద్ద నుంచి రూ.1.8 కోట్లు స్వా«దీనం చేసుకున్నట్టుగా ఆదాయపన్ను శాఖ తెలిపింది. -
సోనూసూద్‌పై ఐటీ దాడులు మరింత ఉధృతం
ముంబై: పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌పై ఆదాయ పన్ను శాఖ దాడుల్ని మరింత ఉధృతం చేసింది. ముంబైలోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఏకకాంలో శుక్రవారం దాడులు చేసినట్టుగా ఐటీ వర్గాలు వెల్లడించాయి. సోనూ సూద్‌కు చెందిన మరిన్ని నివాసాలపై వరసగా మూడో రోజు దాడులు కొనసాగిస్తున్నట్టుగా తెలిపాయి. రియల్ ఎస్టేట్‌కు చెందిన ఒక ఒప్పందం, మరికొన్ని ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టినట్టు వివరించాయి. కరోనా సంక్షోభ సమయంలో వలసదారుల్ని తమ స్వగ్రామాలకు సురక్షితంగా చేర్చడంలో ఎంతో సాయం చేసిన సోనూ సూద్ లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రివాల్ సోనూని ఆప్ పార్టీ తరపున దేశ్ కా మెంటర్‌గా నియమించారు. ఇప్పుడు ఆయనపై ఐటీ శాఖ చేస్తున్న దాడులకి రాజకీయ పరమైన కారణాలున్నాయనే విమర్శలు వస్తున్నాయి. -
సోనూ సూద్‌పై ఐటీ శాఖ దృష్టి!
ముంబై/న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్(48)కు సంబంధించి ముంబై, లక్నోలో ఆరు చోట్ల ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ బుధవారం సోదాలు నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సోనూకు చెందిన కంపెనీకి, లక్నోలోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు వచ్చాయని, అందుకే సోదాలు జరిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సోనూ భేటీ అయిన కొన్ని రోజులకే ఐటీ సోదాలు జరగడం గమనార్హం. ఢిల్లీలో పాఠశాల విద్యార్థుల కోసం కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రారంభించిన మార్గదర్శక (మెంటార్షిప్) కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు సోనూ అంగీకరించారు. ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. తనకు కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరే ఆలోచన లేదని సోనూ సూద్ స్పష్టతనిచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆయనను లక్ష్యంగా చేసుకుందని, అందుకే ఐటీ సోదాలు జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సత్య మార్గంలో నడుస్తున్నప్పుడు లెక్కలేనన్ని అవరోధాలు ఎదురవుతాయని, ఎప్పటికైనా సత్యమే జయిస్తుందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాల ఆశీస్సులు సోనూ సూద్‌కు ఉన్నాయని తెలిపారు. కరోనా విపత్కర సమయంలో ఆయన దేశవ్యాప్తంగా ఎంతో మందిని ఆదుకున్నారని గుర్తుచేశారు. వారంతా ఆయన కోసం ప్రార్థిస్తున్నారని చెప్పారు. సోనూ సూద్‌కు సంబంధించి ఐటీ సోదాలు జరపడాన్ని శివసేన తప్పుపట్టింది. -
Sonu Sood: ప్రాణం పోసిన సోనూసూద్ ట్రస్ట్
యలహంక: ఆక్సిజన్ నిల్వలు ఖాళీ కావడంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కరోనా రోగులకు సోనూసూద్ చారిటబుల్ ట్రస్టు సకాలంలో ప్రాణవాయివు అందించి ప్రాణాలు నిలిపింది. బెంగళూరులోని యలహంక వద్ద ఆర్క ప్రైవేటు ఆస్పత్రిని కోవిడ్ ఆస్పత్రిగా మార్పు చేశారు. ఇక్కడ 15 మందికి పైగా కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటలకు ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయి. ఓ మహిళా బాధితురాలి సోదరుడు అనిల్ గుర్తించి ఆస్పత్రి సిబ్బందిని అలర్ట్ చేశాడు. దీంతో యాజమాన్యం యలహంక న్యూటౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ సత్య నారాయణ అక్కడికి సమీపంలోని సోనూసూద్ చారిటబుల్ ట్రస్ట్‌కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించగా 11 ఆక్సిజన్ సిలిండర్లను బైక్‌లు, కార్లలో ఆస్పత్రికి పంపగా ఆక్సిజన్ వ్యవస్థను పునరుద్ధరించారు. అయితే, అప్పటికే ఇద్దరు మహిళలు మృతి చెందగా 13 మంది ప్రాణాపా యస్థితి నుంచి బయట పడ్డారు. సకాలంలో ఆక్సిజన్ అందించిన ట్రస్టు సభ్యులు అశ్మత్, రాధిక, రాఘవ్‌లకు ఆస్పత్రి యాజమాన్యం కృతజ్ఞతలు తెలియజేసింది. -
హైదరాబాద్: నటుడు సోనూసూద్ పేరుతో మోసాలు
-
ప్రముఖ నటుడు సోనూసూద్ పేరుతో భారీ మోసం..
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటుడు సోనూసూద్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన యువకుడిని సైబర్‌క్రైమ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సోనూసూద్ కార్పొరేట్ కార్యాలయం పేరుతో పెద్ద మొత్తంలో చీటింగ్ జరిగింది. సోనూసూద్ కార్పొరేట్ సంస్థ పేరుతో ఆశిష్‌కుమార్ అనే యువకుడు ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయగా, ఆ అకౌంట్‌కు బాధితులు పెద్దఎత్తున నిధులు పంపించారు. సోనూసూద్ పేరు చెప్పి ఆశిష్ డబ్బులు వసూలు చేశాడు. మోసపోయినట్లు గుర్తించిన బాధితులు సైబర్‌క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. ఆశిష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: భక్తుల అనుమతిపై టీటీడీ కీలక నిర్ణయం.. తెలంగాణలో ఐసెట్ నోటిఫికేషన్ విడుదల -
అదిరిపోయే సోనూసూద్ మరో టాలెంట్
ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే సోనూ సూద్ మళ్లీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. కాకపోతే ఈ సారి తనకున్న మరో స్కిల్ చూపిస్తున్న వీడియోతో మనముందుకు వచ్చాడండోయ్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రజలకు సహాయం చేయడంతో సోనూ సూద్ ప్రజల దృష్టిలో హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి తన చేతనైన సాయాన్ని ప్రజలకు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. టాలీవుడ్‌కి విలన్‌గా పరిచయమైనప్పటికీ రియల్ లైఫ్‌లో మాత్రం హీరో అనిపించుకున్నాడు. ‘వదల బొమ్మాలి’ అంటూ అరుంధతిలో తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక సోనూ సూద్ తన ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో ఎంతో హుషారుగా చాకులకు పదును పెడుతూ తన మరో టాలెంట్‌ను చూపిస్తున్నాడు. నా కొత్త దుకాణానికి స్వాగతం అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ( చదవండి: ‘వైల్డ్ డాగ్’కి ఊహించని ఎదురుదెబ్బ.. షాక్‌లో చిత్ర యూనిట్! ) -
సోనూ సూద్ ఎంట్రీ
‘రాక్షసుడు’ సినిమాతో మంచి విజయాన్ని సాధించి ఫుల్ జోష్‌లో ఉన్నారు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ప్రస్తుతం ఆయన ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమాలో నటిస్తున్నారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్, నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్న నటుడు సోనూ సూద్ సోమవారం షూటింగ్లో ఎంటర్ అయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ– ‘‘ఇంతకుముందు విడుదలైన ‘అల్లుడు అదుర్స్’ టైటిల్‌కు, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు చక్కని రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్, ప్రకాశ్ రాజ్, సోనూ సూద్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవీశ్రీ ప్రసాద్, కెమెరా: చోటా.కె. నాయుడు. -
అలాంటి విమర్శలే నాకు స్ఫూర్తి
కరోనా లాక్డౌన్ వల్ల ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వలస కూలీలది దయనీయ స్థితి అనే చెప్పాలి. ఉన్న చోట ఉపాధి లేకపోవడంతో స్వగ్రామాలకు వెళదామనుకున్నా వాహనాల రాకపోకలు లేవు. అయినా వందల కిలోమీటర్లు నడుస్తూ సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. వలస కూలీలను స్వగ్రామాలకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు వాహనాలను సమకూర్చాయి. బాలీవుడ్ నటుడు సోనూసూద్ కూడా బస్సులు, రైళ్లు, విమానాల్లో వలస కూలీలను తన సొంత ఖర్చుతో స్వగ్రామాలకు పంపే ఏర్పాట్లు చేయడంతో ఆయనపై ప్రశంసల జల్లులు కురిశాయి. అయితే ‘రాజకీయ లబ్ధి కోసమే సోనూ సూద్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు’ అంటూ కొందరు రాజకీయ నాయకులు విమర్శించారు కూడా. దీనిపై సోనూ సూద్ స్పందిస్తూ – ‘‘ఏదైనా మంచి పని చేయాలనుకునేవారిపై ఇలాంటి ఆరోపణలు, విమర్శలు రావడం సహజం. నాపై వచ్చిన విమర్శలు, ఆరోపణల్ని నేనిప్పటివరకూ పట్టించుకోలేదు.. నా గురించి ఏం రాస్తున్నారో అని చూసే తీరిక కూడా లేదు. అయినా మరెన్నో మంచి పనులు, సేవా కార్యక్రమాలు చేయడానికి ఇలాంటి విమర్శలు, ఆరోపణలు నాకు బలాన్ని, స్ఫూర్తిని ఇస్తాయి’’ అన్నారు. -
ఆమె గుర్తొచ్చిన ప్రతిసారీ నోట్‌బుక్స్ తీస్తాను..
చిన్నప్పుడు అమ్మానాన్నలు చేయి పట్టి నడక నేర్పిస్తే.. కాస్త పెద్దయ్యాక అక్షరాలు దిద్దించి.. జ్ఞానమార్గం చూపించి జీవన ప్రదాతలుగా.. మన ఉన్నతికి మార్గదర్శకులుగా నిలిచేవారు గురువులు. ప్రతి మనిషి జీవితంలో వీరి స్థానం అనన్యం.. అసామాన్యం.తప్పటడుగుల్లో.. తప్పుటడుగుల్లోపయనించవద్దని.. నింగికి నిచ్చెలేసి..ఆకాశమే హద్దుగా.. ఆశలు.. ఆశయాలేసరిహద్దుగా మనల్ని తీర్చిదిద్దేది గురువులే. విద్యాబుద్ధులతో పాటు సరైన మార్గాన్నినిర్దేశించేదీ వారే. అలాంటి ఆచార్యులను మనసారా తల్చుకుంటున్నారు కొందరు ప్రముఖులు. నేడు గురువులను స్మరించుకునే రోజు.. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తమ మనోగతాలను ఇలా వెలిబుచ్చారు. అమ్మ గుర్తుకు వస్తే కన్నీరే.. మా అమ్మే నా గురువు. ఆమె ఇంగ్లిష్ ప్రొఫెసర్. నేను చదివిన స్కూల్, కాలేజ్ రెండూ ఒకే బిల్డింగ్‌లో ఉండేవి. ఒకరోజు నేను ఐదు నిమిషాల ఆలస్యంగా క్లాస్‌కి వెళ్లాను. అప్పుడు మా అమ్మ నన్ను గమనించింది. ఇంటికి వెళ్లాకా మమ్మీ.. సారీ ఫైవ్ మినిట్స్ లేట్‌గా క్లాస్‌కి వెళ్లాను అని చెప్పాను. నన్ను ఒడిలో కూర్చోబెట్టుకుని ‘చూడు నాన్నా.. చిన్నప్పటి నుంచి సమయం విలువ తెలియాలి. జీవితంలో మనకు సమయం ఎన్నో గుణపాఠాలను నేర్పిస్తుంది. ఇకపై స్కూల్‌కి లేటుగా వెళ్లొద్దు. టైమ్ కమిట్మెంట్ని ఇప్పటి నుంచే ఫాలో అవ్వాలి అంటూ తన నిమురుతూ చెప్పింది. నా లైఫ్‌లో నా గురువు, నా ఫ్రెండ్, మార్గదర్శకురాలు అమ్మనే. 2017లో ఆమె చనిపోయారు. ఆమె గుర్తొచ్చిన ప్రతిసారీ చిన్నప్పటి నోట్‌బుక్స్ బయటకు తీస్తాను. ఆ నోట్‌బుక్స్‌లో సమయం (టైమ్) గురించి ఆమె రాసిన కొటేషన్స్‌ని చదువుకుంటూ స్మరించుకుంటా. – సోనూసూద్, బాలీవుడ్ నటుడు సామాజిక దృక్పథాన్ని నేర్పారు చిన్నప్పటి నుంచి నా ఉత్తమ గురువు అమ్మ శైలజ. ట్యూషన్ లేకుండా ఆమెనే తన ఒడిలో కూర్చోబెట్టుకుని పాఠాలు నేర్పించారు. ఆదిలాబాద్‌లోని సెయింట్ పాల్స్ స్కూల్లో చదివేప్పుడు సిస్టర్ (టీచర్) రేణు ఉండేవారు. ఆమె నాతో ఫ్రెండ్లీగా ఉండేవారు. అన్నీ షేర్ చేసుకునేవారు. అంతేకాకుండా చాలా స్ట్రిక్ట్ కూడా. కాలేజీలో లైఫ్‌లో సెంట్ఆన్స్లో చదివేటప్పుడు లెక్చరర్ డాక్టర్ మాలిని నాకు సామాజిక దృక్పథాన్ని నేర్పించారు. నాతో సోషల్ వర్క్స్ ఎన్నో చేయించారు. తద్వారా ప్రజలకు ఏదైనా సేవ చేయాలనే ఆశ కలిగింది. ఐఏఎస్ అవ్వడానికి కూడా కొంతవరకు మోటివేట్ కాగలిగాను ఆ సోషల్ యాక్టివిటీస్ ద్వారా. వీటితో పాటు గురువులు నేర్పిన సామాజిక దృక్పథం వల్ల బుక్స్, ఆర్టికల్స్ రాశాను. – హరిచందన దాసరి, జోనల్ కమిషనర్ ఓపిక నేర్చుకున్నా.. టీచర్స్‌కి చాలా ఓపిక ఉంటుంది. స్కూల్లో ఎంత అల్లరి చేసినా కొట్టకుండా, తిట్టకుండా అల్లరి చేయొద్దంటూ ఓపికతో నచ్చచెబుతారు. నేను స్కూల్ ఏజ్ నుంచి ఏంబీఏ వరకు నా గురువుల నుంచి నేర్చుకున్నది అదే. ఎంబీఏలో ఉన్నప్పుడు మోడలింగ్ కెరీర్‌ని స్టార్ట్ చేశా. అప్పట్లో కాలేజీకి డుమ్మా కొట్టాల్సిన పరిస్థితి వచ్చేది. అప్పట్లో ఎంబీఏ లెక్చరర్ సుప్రియ మేడం, ప్రిన్సిపాల్ సర్.. నాకు బాగా సపోర్ట్‌గా నిలిచారు. మోడలింగ్‌కు వెళ్లే ప్రతిసారీ నాకు పర్మిషన్ ఇచ్చేవాళ్లు. వాళ్లు ఆరోజుల్లో నన్ను ఇలా ప్రోత్సహించబట్టే నేను ఈరోజు హీరోయిన్ని కాగలిగాను. – ఈషారెబ్బా, హీరోయిన్ అమ్మే నా బెస్ట్ టీచర్ అమ్మ సంగీత వర్మ స్కూల్ ప్రిన్సిపాల్. అదే స్కూల్లో నేను చదువుకున్నాను. టెన్త్ వరకు అమ్మ సమక్షంలోనే నా చదువు అంతా. ఆమె నుంచి లైఫ్ ఎలా బ్యాలెన్స్‌గా ఉండాలి. ఎదుటి వారిని ఎలా గౌరవించాలి. మనం మాట్లాడే తీరు, పద్ధతి అంతా నేర్పించారు. అమ్మ ఓ పక్క పర్సనల్ లైఫ్ మరో పక్క ప్రొఫెషనల్ లైఫ్‌ని చాలా బ్యాలెన్స్డ్గా చేయడం చూసి పెద్ద ఫ్యాన్‌ని కూడా అయ్యాను. నన్ను మా అక్కని ఏ రోజు చదువు విషయం, ఇతర విషయాల్లో బలవంతం పెట్టలేదు. నా ఎడ్వయిజర్. నా మోటివేటర్. నా ఇన్స్పిరేషన్ అమ్మ సంగీత వర్మనే. – రీతూవర్మ, హీరోయిన్ లీడర్ అవుతావన్నారు ఫస్ట్ డే స్కూల్‌కి వెళ్తున్నాను. వర్షం భారీగా వస్తోంది. ఆ టైంలో కురుస్తున్న భారీ వర్షానికి చాలా భయం వేసింది. కింద పడటంతో దుస్తులన్నీ మురికి అయ్యాయి. అప్పటికే 20 నిమిషాల ఆలస్యమైంది. లోపల తెలియని భయం. స్కూల్లోకి వెళ్లగానే కొండారెడ్డి (హెడ్మాస్టర్) సార్ నన్ను ఎత్తుకుని క్లాస్‌రూమ్‌కి తీసుకెళ్లారు. ఈ అమ్మాయికి చాలా గట్స్ ఉన్నాయి. పెద్దయ్యాక లీడర్ అవుతుందన్నారు. గురువుల నుంచి ఎంతోనేర్చుకున్నాను. – సుమతి ఐపీఎస్ దారి చూపే దీపం చిన్నప్పుడు దిద్దిన అక్షరం.. దిద్దించిన చేయి చిరకాలం మన ప్రవర్తనను దిద్దుతుంటుంది. గురువంటే గతం మాత్రమే కాదు మన వర్తమానం, భవిష్యత్తు కూడా. గురువును గౌరవించడం అంటే మన భూత భవిష్యత్ వర్తమానాలను గౌరవించడం. మన జీవితాన్ని గౌరవించడం. దీనిని గుర్తిస్తున్న నగరవాసులు తమ చిన్నప్పటి రోజులకు ప్రయాణం చేస్తున్నారు. టీచర్లను గుర్తు చేసుకుంటున్నారు. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. పదిహేనేళ్ల తర్వాత.. టీచర్లను కలిశాం... చదువులు పూర్తయిపోయి, ఎక్కడెక్కడికో భవిష్యత్తు వెతుక్కుంటూ వెళ్లిపోయాం. జీవితాల్లో స్థిరపడిన మా స్నేహితులం అందరం కలిసి ఇటీవలే మేం చదువుకున్న సూర్యాపేట జిల్లా త్రిపురవరం ఉన్నత పాఠశాలకు వెళ్లాం. అక్కడ ఒక రోజంతా గడిపాం. గత కాలపు స్మృతులను నెమరేసుకుంటూ మేం విద్యార్ధుల్లా మారిపోయి, టీచర్ల చేతిలో మొట్టికాయలు తిన్నాం. తిరిగి వచ్చే ముందు మనసారా టీచర్లను సన్మానించాం. ఆ సమయంలో వారిలో కనిపించిన తృప్తి, ఆనందం మాకు గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోయింది. మమ్మల్ని అందరినీ పేరు పేరునా పిలిచి, మేం ఏం చేస్తున్నామో అడిగి తెలుసుకుని వారు పొందిన సంతోషంమాటల్లో చెప్పలేం. – వి.జయరామ్ శ్రీరామ్ వెంకటేష్‌కు ఉత్తమ అవార్డు ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరీక్షల విభాగం నియంత్రణ అధికారి (కంట్రోలర్) శ్రీరామ్ వెంకటేష్ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికయ్యారు. క్యాంపస్‌లోని ఇంజినీరింగ్ కాలేజీ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో 22 సంవత్సరాలుగా పని చేస్తున్న ఆయన బోధన, పరిశోధనలతో పాటు పలు పాలన పదవుల్లో చేయి తిరిగినవారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామానికి చెందిన ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ 1997లో ఓయూ అధ్యాపకులుగా ఉద్యోగంలో చేరారు. -
సింధు కోచ్‌గా సోనూ
‘‘బ్యాడ్మింటన్‌లో సిల్వర్ మెడల్ సాధించి భారతీయులకు గర్వకారణంగా నిలిచారు పీవీ సింధు. ఆమె జీవితం ఆధారంగా బయోపిక్ రూపొందిస్తున్నాను. దానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా మొదలయ్యాయి’’ అని ఆ మధ్య పేర్కొన్నారు నటుడు సోనూ సూద్. తాజాగా ఈ బయోపిక్‌లో తాను కోచ్‌గా కనిపిస్తానని ప్రకటించారాయన. మరి ఈ చిత్రంలో సింధు పాత్రను ఎవరు చేస్తారనేది చెప్పలేదు. బహుశా ఆ పాత్రకు తగ్గ నటిని అన్వేషించే పనిలో ఉన్నట్లున్నారు. ఓ చిన్నారి తాను కన్న కలని ఏ విధంగా కష్టపడి సాధించుకుంది అని సింధు బ్యాలం నుంచి కథను చెప్పబోతున్నారట. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. -
మరో మంచి టీమ్‌తో...!
రెండేళ్ల క్రితం తమిళంలో రిలీజైన ‘దేవి’ చిత్రానికి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. ఇందులో ప్రభుదేవా, సోనూ సూద్, తమన్నా కీలక పాత్రలు చేశారు. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వం వహించారు. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా ‘దేవి 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలోనే తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభుదేవా లీడ్ రోల్ చేస్తున్నారు. ఓ లీడ్ రోల్‌ను తమన్నా చేస్తున్నారు. ముగ్గురు హీరోయిన్స్‌కు స్కోప్ ఉన్న ఈ సినిమాలో మరో ఇద్దరు నాయికలుగా నిత్యా మీనన్, నందితా శ్వేతా పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో అమీ జాక్సన్ ఓ గెస్ట్ రోల్ చేస్తారట. ప్రస్తుతం ప్రభుదేవా, తమన్నా, కోవై సరళ పాల్గొనగా సీన్స్ తీస్తున్నారు. మరో బెస్ట్ టీమ్‌తో వర్క్ చేస్తున్నానని అంటున్నారు తమన్నా. -
‘మణికర్ణిక’కు మరో షాక్..!
క్రిష్ దర్శకత్వంలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం మణికర్ణిక. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే చిత్రీకరణ చివరి దశకు చేరుకోగా వివాదాలు మాత్రం ఎక్కువవుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ పనులతో బిజీగా ఉండటంతో దర్శకుడు క్రిష్ మణికర్ణిక దర్శకత్వ బాధ్యతలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆ బాధ్యతను హీరోయిన్ కంగనా రనౌత్ తీసుకున్నారు. అప్పటి నుంచే అసలు వివాదం మొదలైంది. సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సోనూసూద్ డేట్స్ అడ్జస్ట్ చేయలేక సినిమా నుంచి తప్పుకున్నారు. అయితే కంగనా రనౌత్ దర్శకత్వంలో నటించటం ఇష్టం లేకే సోనూసూద్ తప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన సంజయ్ కుట్టి కూడా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ అనుకున్న దానికంటే భారీగా పెరిగిపోవటంతో సంజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారట. -
కేరాఫ్ కాంట్రవర్సీ
కె ఫర్ కంగనా. కె ఫర్ కాంట్రవర్సీ. కాంట్రవర్సీల్లోకి కంగనా వెళ్తారో లేక కాంట్రవర్సీలు ఆమె చుట్టూ చేరతాయో అర్థం కాదు. ఆఫ్ స్క్రీన్.. ఆన్ స్క్రీన్.. ఏదైనా ఎప్పుడూ ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూనో లేదా వాటిని క్లియర్ చేస్తూనో వార్తల్లో ఉంటారామె. తాజాగా ‘మణికర్ణిక’ సినిమా. ఝాన్సీగా స్క్రీన్‌పై కంగనా చేసిన పోరాటాలకంటే బయటే ఎక్కువ పోరాటాలు చేస్తున్నట్టున్నారు. దర్శకుడు క్రిష్ ‘యన్టీఆర్’ బయోపిక్‌లో బిజీగా ఉండటంతో ప్యాచ్వర్క్కి ఆల్రెడీ తనే దర్శకత్వ బాధ్యతలను చేపడుతోంది. సోనూసూద్–కంగనా మధ్య డిఫరెన్సెస్ రావడంతో ‘మణికర్ణిక’ నుంచి ఆయన తప్పుకున్నారు. దాంతో ఆ పాత్రను మళ్లీ రీషూట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ మరో 15కోట్లు పెరగనుందట. లేడీ ఓరియంటెడ్ íసినిమాల్లోనే భారీ ఖర్చుతో రూపొందిన ఈ చిత్రం రీషూట్ వల్ల బడ్జెట్ ఇంకా పెరగడం సినిమా రిజల్ట్‌పై ఏమాత్రం ప్రభావం చూపుతుందో చూడాలి. ముందు అనుకున్నట్లుగా జనవరిలో ఈ సినిమా రిలీజ్ కాదని బాలీవుడ్ టాక్. -
హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసింది
తొలి సినిమాతో ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయినా, రెండో సినిమాగా ఏకంగా హాలీవుడ్ సినిమాలో నటించేస్తోంది దిశాపటాని. వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన దిశ, ఇప్పుడు జాకీచాన్ హీరోగా తెరకెక్కుతున్న కుంగ్ ఫూ యోగా సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్‌లో ప్రవేశం ఉన్న ఈ బ్యూటి, ఈ సినిమాలో జాకీకి జోడిగా నటిస్తోందట. సోనూసూద్, అమైరా దస్తర్ లాంటి భారతీయ నటులు నటిస్తున్న ఈ సినిమా కథ ఇండియా, చైనాల నేపథ్యంలో సాగుతోంది. టిబెట్‌లో ఉన్న ఒక నిధి వేటలో భాగంగా ఇండియాకు వచ్చే జాకీచాన్‌కు, ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్లో పనిచేసే దిశ సాయం చేస్తోంది. ఇద్దరు కలిసి ఆ నిధిని ఎలా సాధించారు అన్నదే సినిమా కథ. కథా పరంగా దిశాపటానీ లీడ్ హీరోయిన్ అనిపిస్తోంది. మరి ఈ ఛాన్స్‌తో దిశ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటుందేమో చూడాలి.