సింధు కోచ్‌గా సోనూ | Sonu Sood to make a biopic on PV Sindhu | Sakshi
Sakshi News home page

సింధు కోచ్‌గా సోనూ

Published Tue, Dec 11 2018 3:52 AM | Last Updated on Tue, Dec 11 2018 3:52 AM

Sonu Sood to make a biopic on PV Sindhu - Sakshi

సోనూ సూద్‌

‘‘బ్యాడ్మింటన్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించి భారతీయులకు గర్వకారణంగా నిలిచారు పీవీ సింధు. ఆమె జీవితం ఆధారంగా బయోపిక్‌ రూపొందిస్తున్నాను. దానికి సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు కూడా మొదలయ్యాయి’’ అని ఆ మధ్య పేర్కొన్నారు నటుడు సోనూ సూద్‌. తాజాగా ఈ బయోపిక్‌లో తాను కోచ్‌గా కనిపిస్తానని ప్రకటించారాయన. మరి ఈ చిత్రంలో సింధు పాత్రను ఎవరు చేస్తారనేది చెప్పలేదు. బహుశా ఆ పాత్రకు తగ్గ నటిని అన్వేషించే పనిలో ఉన్నట్లున్నారు. ఓ చిన్నారి తాను కన్న కలని ఏ విధంగా కష్టపడి సాధించుకుంది అని సింధు బ్యాలం నుంచి కథను చెప్పబోతున్నారట. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లనుందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement