ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ హంగామా నడుస్తోంది. ప్రతిష్ఠాత్మక వన్టే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి క్రికెట్‌పైనే ఉంది. బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు రాజకీయ నాయకులు సైతం మ్యాచ్ చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు సోనూ సూద్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. తన చిన్న కుమారుడు అయాన్ బ్యాటింగ్ మెలకువలు నేర్చుకుంటున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వరల్డ్ కప్‌లో వికెట్లతో అదరగొడుతున్న షమీ నుంచి సలహాలు తీసుకుంటున్న వీడియో తెగ వైరవులవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ భవిష్యత్ టీమిండియా క్రికెటర్‌కు చిట్కాలు నేర్పిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ వీడియో గతంలో షమీ.. అయాన్‌కు మూడేళ్ల క్రితం ఇలా ట్రైనింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో షమీ తన బౌలింగ్‌తో అదరగొడుతున్నారు. అందుకే అత్యుత్తమైన క్రికెటర్‌తో నా కుమారుడు అయాన్‌కి శిక్షణ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ అతని కోచ్‌ను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆదివారం జరిగే భారత్-ఆస్ట్రేలియా ప్రపంచకప్ ఫైనల్ కోసం సోనూసూద్ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. కాగా..సోనూ కన్నడ చిత్రం 'శ్రీమంత'లో చివరిసారిగా కనిపించారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో 'ఫతే' షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ శక్తి సాగర్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించారు. జీ స్టూడియోస్‌తో కలిసి రూపొందించిన 'ఫతే' మూవీ 2024లో విడుదల కానుంది. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment