మహిళలకు సందేశమిచ్చిన ‘శివంగి ’ | Sivangi Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

మహిళలకు సందేశమిచ్చిన ‘శివంగి ’

Published Fri, Mar 7 2025 4:44 PM | Last Updated on Fri, Mar 7 2025 5:17 PM

Sivangi Movie Review And Rating In Telugu

ఆనంది ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయిగా... చాలా పద్ధతిగా కనిపించే సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అలాంటి అమ్మాయి ఒక్కసారిగా  ‘శివంగి’ సినిమాలో బోల్డ్‌ డైలాగ్‌తో రెచ్చిపోయింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ‘వంగే వాళ్లు ఉంటే... మింగే వాళ్లు ఉంటారు... నేను వంగే రకం కాదు... మింగే రకం...’ అనే డైలాగ్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయింది. ఈ చిత్రానికి దర్శకత్వం దేవరాజ్ భరణి ధరన్ వహించారు. ఫస్ట్ కాపీ మూవీస్ పతాకంపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మించారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించారు. నేడు(మార్చి 7) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
సత్యభామ(ఆనంది)ఓ సాధారణ గృహిణి.ఓ వైపు భర్త అనారోగ్య పరిస్థితులు... మరో వైపు ఆర్థిక సమస్యలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దానికి తోడు తన అత్త నుంచి ఎదురయ్యే వేధింపులు తనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తాయి. మరోవైపు తల్లిదండ్రులు అనుకోకుండా వరదల్లో చిక్కుకు పోవడంతో మరింత సతమతమవుతుంది. చివరకు పోలీసులను ఆశ్రయిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది?  ఎవరైనా హత్యకు గానీ, ఆత్మహత్యకు గానీ గురయ్యారా? సత్యభామ తనకు ఎదురైన హార్డిల్స్ ను ఎలా అధిగమించిందనేది తెలియాలంటే మూవీని ఓసారి చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
ఓ సాధారణ మహిళ తనకున్న సమస్యలను ఛేదించే క్రమంలో ఎదురైన ఆటంకాలను ఎలా ఎదుర్కొంది అనేదే ఈ సినిమా కథ.  దేవరాజ్ భరణి ధరన్ రచన ఇంకా దర్శకత్వంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నాడు అనేది మీ చిత్రం చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. స్క్రీన్ మీద ఎక్కువగా ఒకటే వ్యక్తి కనిపిస్తున్నప్పుడు ఆడియన్స్ సాధారణంగా బోర్ ఫీల్ అవుతారు. కానీ ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఎక్కడా కూడా బోర్ ఫీల్ అయ్యే అవసరం రాదు. ఎంతో ఇంటెన్సిఫైడ్ గా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. అసలు జరిగేది నిజమా కాదా అనే ఒక డౌట్ తో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తిగా చూసే విధంగా స్క్రీన్ ప్లే వచ్చేలా రాసుకున్నాడు దర్శకుడు.

సింగిల్ లోకేషన్ లో... క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. సినిమా మొత్తం సింగిల్ లొకేషన్ లో చిత్రీకరణ చేసినప్పుడు ఆర్ట్ వర్క్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే బ్యాగ్రౌండ్ యాంబియన్స్ ను సెట్ చేసుకున్నాడు కళాదర్శకుడు రఘు కులకర్ణి. అలాగే ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే  బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు సంగీత దర్శకుడు.  చిత్రంలో ఎక్కడ కూడా వల్గారిటీ లేదా డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా, చాలా డీసెంట్ గా కుటుంబ సమేతంగా వెళ్లి చూసే విధంగా సినిమాను తెరకెక్కించారు. ఒక మహిళకు అనేక సమస్యలు ఒకే సమయంలో వచ్చినప్పటికీ ఆమె ఆ సమస్యలను మొక్కవోని ధైర్యంతో... ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఎలా నిలబడ్డారు అనేది నేటి మహిళలకు మెసేజ్ ఇచ్చేలా సినిమా వుంది. ప్రపంచ మహిళాదినోత్సవం సందర్భంగా మహిళా ప్రేక్షకులకు మంచి ఇన్స్ పిరేషన్ ఇచ్చే సినిమా ‘శివంగి’. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కోనే అనేక సమస్యలును ఇందులో చూపించి... వాటికి పరిష్కార మార్గాలు చూపించారు.

ఎవరెలా చేశారంటే..
సత్యభామగా చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆనంది నటన మనం గతంలోనే ఎన్నో చిత్రాలలో చూశాం. అదేవిధంగా ఈ చిత్రంలో కూడా తనదైన మార్క్ సృష్టిస్తూ ఆనంది తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. చిత్రం అంతా తానే కనిపిస్తూ ప్రేక్షకులు ఎక్కడా బోర్ కొట్టకుండా తనదైన శైలిలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఎక్కడా గ్లామర్ షో లేకుండా... కేవలం రెండు చీరలలో మాత్రమే సినిమా అంతా కనిపిస్తూ... తన పవర్ ఫుల్  డైలాగ్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పోలీస్ రోల్ లో గతంలో ఎన్నో చిత్రాలలో నటించినప్పటికీ, ఈ చిత్రంలో తెలంగాణ యాసతో వరలక్ష్మి శరత్ కుమార్ తనలో మరో యాంగిల్ యాక్టింగ్ స్టైల్ ఉందని నిరూపించుకున్నారు. అదేవిధంగా చిత్రంలో నటించిన జాన్ విజయ్, కోయా కిషోర్ స్క్రీన్ టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ తమ మార్క్ కనిపించేలా నటించి మెప్పించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement