sivangi
-
దర్శకుడిగా మారిన ప్రముఖ ఫోటోగ్రాఫర్
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ భరణి కే ధరన్ దర్శకుడిగా మారాడు. 40పైగా సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన ఆయన ‘సివంగి’కోసం మెగా ఫోన్ పట్టాడు. ఈ చిత్రంలో ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్, జాన్ విజయ్ కీలక పాత్రలు పోషించారు. ఫిమేల్ సెంట్రిక్ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ హంగులతో పాటు కుటుంబం విలువలకు ప్రాధాన్యతనిచ్చే అంశాలు ఉంటాయని మేకర్స్ తెలిపారు. ఓ మహిళా తన జీవితం లో ఎదురైన అనూహ్యమైన పరిస్థితులకు ఎలా ఎదురు నిలిచింది అన్నది కథాంశం. డొమెస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు భరణి తెలియజేశారు. -
తెలుగు ప్రేక్షకులు నిజాయతీగా ఉంటారు
ధ్రువ కరుణాకర్, శివంగి, సోనియా ముఖ్యతారలుగా తెరకెక్కిన చిత్రం ‘అశ్వమేథం’. నితిన్ .జి దర్శకత్వంలో ఐశ్వర్యా యాదవ్, ప్రియా నాయర్ నిర్మించారు. చరణ్ అర్జున్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ‘గజానన’ అనే పాటను నిర్మాత ఐశ్వర్య యాదవ్ రిలీజ్ చేశారు. నితిన్ మాట్లాడుతూ– ‘‘గజానన’ పాటను తెరపై చూస్తున్నప్పుడు మేజికల్ మూమెంట్‌లాగా అనిపించింది. తెలుగు ప్రజలు టెక్నికల్‌గా ముందంజలో ఉన్నారు. నిజాయతీగా ఉంటారు. సినిమా బావుంటే ఆదరిస్తారు. మా సినిమాని కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాం’’ అన్నారు. చరణ్ అర్జున్ మాట్లాడుతూ– ‘‘చిన్ని చరణ్ పేరుతో చాలా సినిమాలకు సంగీతం అందించా. ఇప్పుడు చరణ్ అర్జున్ అని పేరు మార్చుకున్నా. ఈ చిత్రంలోని ‘గజానన’ పాటతో రీ లాంచ్ కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘తెలుగులో హీరోగా లాంచ్ కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు ధ్రువ కరుణాకర్. ఐశ్వర్య యాదవ్, ప్రియా నాయర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: నగేష్ పూజారి, లైన్ ప్రొడ్యూసర్: సైపు మురళి. -
సివంగి వేటకు బలైంది!
మాటు వేసిన మృత్యువు.. తమ మానాన తాము చెట్ల ఆకులను తింటున్న పిల్ల జిరాఫీలు.. వాటికి రక్షణగా తల్లి జిరాఫీ.. మృత్యువు తమ ముంగిట్లోనే ఉందన్న విషయాన్ని అవి గమనించలేదు.. అంతే.. మాటు వేసిన మృత్యువు ఒక్కసారిగా విరుచుకుపడింది. పిల్ల జిరాఫీని బలిగొంది. ఓ సివంగి జిరాఫీని వేటాడిన ఈ దృశ్యాన్ని దక్షిణాఫ్రికాకు చెందిన ఫొటోగ్రాఫర్ అంజా క్రూగర్ క్లిక్‌మనిపించారు. అనుకోకుండా తన కెమెరాకు ఈ చిత్రం చిక్కిందని.. చాలా అరుదుగా ఇలాంటి ఫొటోలు తీయగలుగుతామని అంజా తెలిపారు. ‘అప్పటివరకూ ఎలాంటి అలజడి లేదు. జంతువులంతా ప్రశాంతంగా ఉన్నాయి. అక్కడ ఓ సివంగి పొదల చాటున మాటువేసి ఉందన్న విషయాన్ని మేము కూడా గమనించలేదు. ఆ జిరాఫీలు ఆహారం కోసం అక్కడికి వెళ్లాయి. సివంగికి ఆహారమైపోయాయి. అరుదైన చిత్రమైనా.. చాలా బాధాకరమైనది’ అని అంజా అన్నారు. దక్షిణాఫ్రికాలోని క్రూగర్ జాతీయ పార్కులో ఈ సన్నివేశం చోటుచేసుకుంది.