Kadavul Irukan Kumaru
-
ఒక రోజు ముందే కడవుల్ ఇరుక్కాన్ కుమారూ
కడువుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రం అనుకున్న తేదీ కంటే ఒక రోజు ముందే తెరపైకి రానుంది. నిజానికి ఈ చిత్రం అనుకున్న సమయంలో విడుదలవుతుందా?అన్న సందేహం నెలకొంది.అందుకు కారణం చిత్రం కోర్టులో పిటిషన్ దాఖలు కావడమే. వివరాల్లోకెళ్లితే జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా నటించిన చిత్రం కడవుల్ ఇరుక్కాన్ కుమారూ. ఆనంది, నిక్కీగల్రాణి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఎం.రాజేశ్ దర్శకత్వంలో అమ్మా క్రియేషన్స టి.శివ నిర్మించారు. చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 11న విడుదలకు సిద్ధమైంది. సాధారణంగా చిత్రాలను శుక్రవారం రోజు విడుదల చేస్తుండడం ఆనవాయితీ. అయితే కొన్ని చిత్రాలను అదనంగా కలెక్షన్లను వసూలు చేసుకోవడానికి ఒక రోజు ముందే విడుదల చేస్తుంటారు.అలా కడవుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రాన్ని ఒక రోజు ముందే అంటే 10వ తేదీనే విడుదల చేయనున్నారు. ఈ చిత్ర విడుదలపై నిషేధం విధించాలంటూ ఒక డిస్ట్రిబ్యూటర్ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై ఈ నెల10 తేదీన విచారించనున్నట్లు నాయస్థానం వెల్లడించింది.దీంతో ఈ చిత్రానికి సంబంధించిన కేసును ఈ రోజే అంటే సోమవారం విచారించాలని పిటిషన్‌దారుడు మరో పిటిషన్ దాఖలు చేశారు.అయితే పిటిషన్‌దారుడి కోరికను తిరస్కరించిన కోర్టు 10వ తేదీనే విచారించనున్నట్లు ప్రకటించారు.దీంతో కడవుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రం ఆ నెల 10వ తేదీనే తెరపైకి రానుందని చిత్ర వర్గాలు వెల్లడించారు. -
ఆయన చేతిలో దెబ్బలు తిన్నాం
నటుడు ప్రకాశ్‌రాజ్ చేత బాగా దెబ్బలు తిన్నాం అని సంగీత దర్శకుడు, నటుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ అన్నారు. ఈయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కడవుల్ ఇరుక్కాన్ కుమారూ. నిక్కీగల్రాణి, ఆనంది నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఆర్జే.బాలాజి జీవీకి స్నేహితుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అమ్మా క్రియేషన్స్ పతాకంపై టీ.శివ నిర్మిస్తున్నారు. ఇది ఈయన నిర్మిస్తున్న 25వ చిత్రం అన్నది గమనార్హం. దీనికి రాజేశ్.ఎం దర్శకుడు. జీవీనే సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం టీజర్ బుధవారం సాయంత్రం స్థానిక ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. చిత్ర టీజర్‌ను తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు, సంగీతదర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ మాట్లాడుతూ తనకు సంగీత దర్శకుడిగా దశాబ్దం పూర్తి అయ్యిందన్నారు. అదే విధంగా ఈ చిత్ర నిర్మాత టీ.శివ 25 ఏళ్లుగా చిత్ర నిర్మాణ రంగంలో రాణిస్తున్నారన్నారు. దర్శకుడు రాజేష్ వద్ద 20 మందికి పైగా సహాయ దర్శకులు ఉన్నారని తెలిపారు. తన శిష్యులకు అవకాశాలను కల్పించే దర్శకుడు ఈయనని వ్యాఖ్యానించారు. రాజేష్ శిష్యులు పది మందికి పైగా తనకు కథలు చెప్పారని, వారందరికీ చిత్రం చేస్తానని మాట ఇచ్చానని అన్నారు. నటి నిక్కీగల్రాణి, ఆనందిలిద్దరూ చాలా చ క్కగా నటించారని, ఆర్జే.బాలాజీ లెవలే వేరని అన్నారు. ఇందులో తాను ప్రకాశ్‌రాజ్‌తో తొలిసారిగా నటించానని తెలిపారు. ఆయనతో నటించడానికి చాలా భయపడేవాడినన్నారు. అందులోనూ ఆయన్ని తిట్టే సన్నివేశాలు చిత్రంలో చాలా ఉన్నాయని తెలిపారు. ఆయన తనను, ఆర్జే.బాలాజీని కొట్టే సన్నివేశాలు చోటు చేసుకున్నాయన్నారు. ఆ సన్నివేశాల్లో ప్రకాశ్‌రాజ్ నిజంగానే తమను కొట్టేశారని తెలిపారు. అలా ఆర్జే.బాలాజీ బాగా దెబ్బలు తిన్నారని జీవీ చెప్పారు. కడవుల్ ఇరుక్కాన్ కుమారూ చిత్రం మంచి విజయం సాధించి ఇందులో పనిచేసిన వారందరికీ మంచి పేరు తె చ్చి పెడుతుందనే నమ్మకాన్ని జీవీ.ప్రకాశ్‌కుమార్ వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నిర్మాత పీఎల్.తేనప్పన్, నాజర్, మనోబాలా, సంతానం, నిక్కీగల్రాణి, ఆనంది, తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదికపై నిర్మాత టీ.శివ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. -
ప్రేమ కథా చిత్రంగా కడవుల్ ఇరక్కాన్ కుమారు
టాస్మాక్ సన్నివేశాలు లేని చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం కడవుల్ ఇరుక్కాన్ కుమారు. టాస్మాక్‌ను ప్రత్యేకంగా పేర్కొనడానికి కారణం లేకపోలేదు. ఇప్పుడు వస్తున్న చాలా చిత్రాలు మద్యం సన్నివేశాలు లేకుండా ఉండడం లేదు. ఇక అసలు విషయం దర్శకుడు రాజేశ్ చిత్రాల్లో ఇలాంటి సన్నివేశాలు లేని చిత్రమే లేదు. అలాంటిది ఆయన తాజా చిత్రమే కడవుల్ ఇరుక్కాన్ కుమారు. అమ్మా క్రియేషన్స్ టి.శివ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా నిక్కీగల్రాణి, ఆనంది నటిస్తున్నారు. జీవీకి స్నేహితుడిగా ఆర్జే.బాలాజీ, ముఖ్యపాత్రలో ప్రకాశ్‌రాజ్ నటిస్తున్న ఈచిత్రం గురించి దర్శకుడు రాజేశ్ తెలుపుతూ సరోజ చిత్రం తరువాత రోడ్డు ప్రయాణంలో సాగే మించి రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం కడవుల్ ఇరుక్కాన్ కుమారు చిత్రం అని తెలిపారు. ఇందులో ప్రేమ, కామెడీ, సెంటి మెంట్ అంటూ ఆబాలగోపాలం చూసి ఆనందించే జనరంజక అంశాలు ఉంటాయన్నారు. ఇది రోడ్డు జర్నీ నేపథ్యంలో సాగే చిత్రం కావడంతో అధిక భాగం షూటింగ్‌ను ప్రధాన రోడ్లపైనే నిర్వహించామని తెలిపారు.అందుకు చెన్నై, పాండిచ్చేరి, గోవా ప్రాంతాల్లో జనసంచారం లేని రోడ్లలో షూటింగ్ జరిపినట్లు చెప్పారు. తన గత చిత్రాల్లో టాస్మాక్ సన్నివేశాలు అధికంగా ఉంటాయనే అపవాదు ఉందన్నారు. అయితే ఈ చిత్రంలో అలాంటి సన్నివేశం ఒక్కటి కూడా ఉండదని ఇది క్లీన్ యూ సర్టిఫికెట్ చిత్రంగా ఉంటుందని అన్నారు. చిత్ర ఫస్ట్‌లుక్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు రాజేశ్ చెప్పారు.