ప్రేమ కథా చిత్రంగా కడవుల్ ఇరక్కాన్ కుమారు
టాస్మాక్ సన్నివేశాలు లేని చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం కడవుల్ ఇరుక్కాన్ కుమారు. టాస్మాక్‌ను ప్రత్యేకంగా పేర్కొనడానికి కారణం లేకపోలేదు. ఇప్పుడు వస్తున్న చాలా చిత్రాలు మద్యం సన్నివేశాలు లేకుండా ఉండడం లేదు. ఇక అసలు విషయం దర్శకుడు రాజేశ్ చిత్రాల్లో ఇలాంటి సన్నివేశాలు లేని చిత్రమే లేదు.
అలాంటిది ఆయన తాజా చిత్రమే కడవుల్ ఇరుక్కాన్ కుమారు. అమ్మా క్రియేషన్స్ టి.శివ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా నిక్కీగల్రాణి, ఆనంది నటిస్తున్నారు. జీవీకి స్నేహితుడిగా ఆర్‌జే.బాలాజీ, ముఖ్యపాత్రలో ప్రకాశ్‌రాజ్ నటిస్తున్న ఈచిత్రం గురించి దర్శకుడు రాజేశ్ తెలుపుతూ సరోజ చిత్రం తరువాత రోడ్డు ప్రయాణంలో సాగే మించి రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం కడవుల్ ఇరుక్కాన్ కుమారు చిత్రం అని తెలిపారు. ఇందులో ప్రేమ, కామెడీ, సెంటి మెంట్ అంటూ ఆబాలగోపాలం చూసి ఆనందించే జనరంజక అంశాలు ఉంటాయన్నారు.
ఇది రోడ్డు జర్నీ నేపథ్యంలో సాగే చిత్రం కావడంతో అధిక భాగం షూటింగ్‌ను ప్రధాన రోడ్లపైనే నిర్వహించామని తెలిపారు.అందుకు చెన్నై, పాండిచ్చేరి, గోవా ప్రాంతాల్లో జనసంచారం లేని రోడ్లలో షూటింగ్ జరిపినట్లు చెప్పారు. తన గత చిత్రాల్లో టాస్మాక్ సన్నివేశాలు అధికంగా ఉంటాయనే అపవాదు ఉందన్నారు. అయితే ఈ చిత్రంలో అలాంటి సన్నివేశం ఒక్కటి కూడా ఉండదని ఇది క్లీన్ యూ సర్టిఫికెట్ చిత్రంగా ఉంటుందని అన్నారు. చిత్ర ఫస్ట్‌లుక్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు రాజేశ్ చెప్పారు.