నాకూ అలా అనిపిస్తోంది  – విశ్వక్‌ సేన్‌   | Vidhi movie teaser launched by Mass Ka Das Vishwak Sen | Sakshi
Sakshi News home page

నాకూ అలా అనిపిస్తోంది  – విశ్వక్‌ సేన్‌  

Published Tue, Oct 10 2023 12:59 AM | Last Updated on Tue, Oct 10 2023 12:59 AM

Vidhi movie teaser launched by Mass Ka Das Vishwak Sen - Sakshi

విశ్వక్‌ సేన్, ఆనంది, రోహిత్‌

‘‘విధి’ నిర్మాత రంజిత్‌ నాకు మంచి స్నేహితుడు.ప్రోడక్షన్ లో సాయం చేసేందుకు, సపోర్ట్‌గా నిలిచేందుకు నాకూ ఓ బ్రదర్‌ ఉంటే బాగుండని ఈ దర్శకుల్ని(శ్రీకాంత్, శ్రీనాథ్‌) చూస్తుంటే అనిపిస్తోంది. ‘విధి’ టీజర్‌ బాగుంది.. సినిమా పెద్ద హిట్‌ కావాలి.. నిర్మాతకు మంచి లాభాలు రావాలి’’ అని హీరో విశ్వక్‌ సేన్‌ అన్నారు.

రోహిత్‌ నందా, ఆనంది జంటగా శ్రీకాంత్‌ రంగనాథన్, శ్రీనాథ్‌ రంగనాథన్‌ దర్శకద్వయం తెరకెక్కించిన చిత్రం ‘విధి’. రంజిత్‌ ఎస్‌ నిర్మించిన ఈ సినిమా నవంబర్‌ 3న విడుదలకానుంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం టీజర్‌ను ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వక్‌ సేన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా రంజిత్‌ ఎస్‌ మాట్లాడుతూ–‘‘మా  సినిమా కథ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది.

కథ, కథనాలను ప్రేక్షకులు ముందుగా ఊహించలేరు’’ అన్నారు. ‘‘మనం మాట్లాడటం కంటే.. మనం తీసే సినిమానే మాట్లాడాలనుకుంటున్నాం’’ అన్నారు శ్రీకాంత్‌ రంగనాథన్, శ్రీనాథ్‌ రంగనాథన్‌. ‘‘మా సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి’’ అన్నారు రోహిత్‌ నందా, ఆనంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement