
హీరో ఆది భార్య, హీరోయిన్ నిక్కీ గల్రానీ పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. తమ పెంపుడు శునకం చనిపోయిందని బోరున విలపిస్తోంది. నిక్కీ గల్రానీ ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న ఛాంపియన్ అనే శునకం ఆదివారం మరణించింది. ఈ విషయాన్ని హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

మళ్లీ కలుసుకుందాం
నీ కాలి ముద్రలు మా మనసుపై స్థిరంగా ఉన్నాయి. అవి ఎప్పటికీ చెరిగిపోవు. మై బేబీ, నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నువ్వు ఎప్పటికీ మంచి అబ్బాయివే! మరోసారి కలుసుకుందాం ఛాంప్ అని రాసుకొచ్చింది. ఛాంపియన్‌తో కలిసి దిగిన ఫోటోలను పోస్టుకు జత చేసింది.
ఎంతో అమాయకుడు
తన పెంపుడు శునకం గురించి మరింత మాట్లాడుతూ.. వాడిని మేము తొమ్మిదేళ్లుగా పెంచుకుంటున్నాం. ఎంతో అమాయకుడు. ఎప్పుడూ ఎవరినీ గాయపర్చలేదు. కుక్కలంటే భయపడేవాళ్లు కూడా వీడిని చూసి ప్రేమలో పడ్డారు. ఆ భయాన్ని వదిలేశారు. అందరితోనూ అంత ఫ్రెండ్లీగా, ప్రేమగా ఉండేవాడు. వాడు మాకు దూరమైనందుకు చాలా బాధగా ఉంది. ఏదో ఒకరోజు ఏదో ఒకరూపంలో మళ్లీ మా దగ్గరకు తిరిగొచ్చేస్తావని ఆశిస్తున్నా అంటూ నిక్కీ గల్రానీ ఎమోషనలైంది.
Comments
Please login to add a commentAdd a comment