మా ప్రాంక్‌ వల్ల ఏకంగా విడాకులు తీసుకున్నారు: హీరో | Ajay Devgn, Rohit Shetty Says Their Pranks Cause Divorce | Sakshi
Sakshi News home page

ప్రాంక్‌ చేసేందుకు భయపడేవాళ్లం కాదు.. మేము చేసిన పనుల వల్ల..

Nov 11 2024 4:17 PM | Updated on Nov 11 2024 4:28 PM

Ajay Devgn, Rohit Shetty Says Their Pranks Cause Divorce

యూట్యూబ్‌లో ప్రాంకులు బోలెడు కనిపిస్తాయి. సినిమావాళ్లు కూడా తమ ప్రాజెక్టు ప్రమోషన్స్‌ కోసం ఈ ప్రాంకుల్ని వాడుకున్నారు. అయితే సెట్‌లోనూ మేము ఫన్‌ కోసం ప్రాంక్‌ చేసేవాళ్లమంటున్నారు హీరో అజయ్‌ దేవ్‌గణ్‌, దర్శకుడు రోహిత్‌ శెట్టి. సింగం అగైన్‌ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన వీరిద్దరూ తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 

ప్రాంతో సరదా
ఈ సందర్భంగా వీళ్లిద్దరూ సెట్‌లోని ఓ వ్యక్తి షర్ట్‌పై ఇంక్‌ పోసిన ప్రాంక్‌ వీడియోను ప్లే చేశారు. అది చూసిన రోహిత్‌ శెట్టి.. ఇది మేము చేసినవాటిలో చాలా చిన్న ప్రాంక్‌. ఒకసారైతే మా ప్రొడక్షన్‌ టీమ్‌ మెంబర్‌ ఇంటికి ఓ మహిళను, బాబును పంపించాం. అతడి మొదటి భార్యను నేనే అంటూ ఆమెతో నాటకం ఆడించాము. ఆ రేంజ్‌ వరకు వెళ్లాము అని చెప్పుకొచ్చాడు.

మావల్ల విడాకులు కూడా..
ఇంతలో అజయ్‌ దేవ్‌గణ్‌ మాట్లాడుతూ.. ఈ మధ్య ప్రాంక్‌స్టర్స్‌ ఏదైనా చేయడానికి కూడా భయపడుతున్నారు. ఎవరైనా ఏమైనా అంటారేమో అని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. మేమైతే పెద్దగా ఆలోచించకుండానే ప్రాంక్‌ చేసేవాళ్లం. మావల్ల ఒకటీరెండు విడాకులు కూడా జరిగాయి అని తెలిపాడు. 

సినిమా
ఇకపోతే అజయ్‌, రోహిత్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సింగం అగైన్‌ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంలో దీపిక పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌, అర్జున్‌ కపూర్‌, అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌, కరీనా కపూర్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ నవంబర్‌ 1న విడుదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement