Pranks
-
మా ప్రాంక్ వల్ల ఏకంగా విడాకులు తీసుకున్నారు: హీరో
యూట్యూబ్‌లో ప్రాంకులు బోలెడు కనిపిస్తాయి. సినిమావాళ్లు కూడా తమ ప్రాజెక్టు ప్రమోషన్స్ కోసం ఈ ప్రాంకుల్ని వాడుకున్నారు. అయితే సెట్లోనూ మేము ఫన్ కోసం ప్రాంక్ చేసేవాళ్లమంటున్నారు హీరో అజయ్ దేవ్‌గణ్, దర్శకుడు రోహిత్ శెట్టి. సింగం అగైన్ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన వీరిద్దరూ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రాంతో సరదాఈ సందర్భంగా వీళ్లిద్దరూ సెట్లోని ఓ వ్యక్తి షర్ట్‌పై ఇంక్ పోసిన ప్రాంక్ వీడియోను ప్లే చేశారు. అది చూసిన రోహిత్ శెట్టి.. ఇది మేము చేసినవాటిలో చాలా చిన్న ప్రాంక్. ఒకసారైతే మా ప్రొడక్షన్ టీమ్ మెంబర్ ఇంటికి ఓ మహిళను, బాబును పంపించాం. అతడి మొదటి భార్యను నేనే అంటూ ఆమెతో నాటకం ఆడించాము. ఆ రేంజ్ వరకు వెళ్లాము అని చెప్పుకొచ్చాడు.మావల్ల విడాకులు కూడా..ఇంతలో అజయ్ దేవ్‌గణ్ మాట్లాడుతూ.. ఈ మధ్య ప్రాంక్‌స్టర్స్ ఏదైనా చేయడానికి కూడా భయపడుతున్నారు. ఎవరైనా ఏమైనా అంటారేమో అని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. మేమైతే పెద్దగా ఆలోచించకుండానే ప్రాంక్ చేసేవాళ్లం. మావల్ల ఒకటీరెండు విడాకులు కూడా జరిగాయి అని తెలిపాడు. సినిమాఇకపోతే అజయ్, రోహిత్ కాంబినేషన్లో తెరకెక్కిన సింగం అగైన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంలో దీపిక పదుకొణె, రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ నవంబర్ 1న విడుదలైంది.చదవండి: ఆలియా భట్‌తో నాగ్ అశ్విన్ సినిమా.. ఆయన ఏమన్నారంటే? -
ఏం పిల్లలండీ బాబు..! స్కూల్ జైల్ అట! ఏకంగా అమ్మేసేందుకు ప్లాన్
స్కూల్‌కు వెళ్లడం ఇష్టం లేకపోతే.. ఏదో ఓ కారణం చెప్పి పిల్లలు బడి ఎగ్గొట్టేస్తారు. పోనీ టీచర్ చదువులు చెప్పకపోతే కంప్లైంట్ చేస్తారు. అదీ కాకపోతే మౌళిక సదుపాయాలు సరిగా లేకపోతే అమ్మనాన్నలకు చెబుతారు. కానీ అమెరికాలో ఓ స్కూల్ పిల్లలు చేసిన పనికి అందరూ ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఈ పిల్లలు చేసిన పనేంటంటే..! అమెరికాలోని మేరీలాండ్‌లో మీడే సీనియర్ హై స్కూల్ అనే పేరు గల పాఠశాల ఉంది. ఇందులో పిల్లలకు ఏం అనిపించిందో తెలియదు కానీ స్కూల్‌నే అమ్మకానికి పెట్టారు. స్థానిక రియల్ ఎస్టేట్ వెబ్సైట్ 'జిల్లో'లో రూ.34.7లక్షలకు బేరం పెట్టారు. 12,458 గజాల స్కూల్ బిల్డింగ్ 'సగం పని చేసే జైల్' గా పేర్కొని లిస్టింగ్ చేశారు. ఈ జైళ్లో 15 బాత్రూమ్లు, ప్రత్యేకమైన కిచెన్, ప్రైవేట్ బాస్కెట్ బాల్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంతేకాదు అక్కడక్కడ సగం నిర్మాణంలో ఉన్న గోడలు ప్రాణాలను తీస్తాయని తెలిపారు. ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాతపూర్వకంగా వెబ్సైట్లో తెలిపారు. ఈ వినూత్నమైన లిస్టింగ్‌ను చూసి తాము ఆశ్చర్యపోయినట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెలిపారు. ఇంత మంచి ఆస్తిని ఇంత తక్కువకు అమ్ముతున్నారేంటని ఆశ్చర్యపోయినట్లు వెల్లడించారు. కొనుగోలుదారులు ఇలాంటి అవకాశాలను వదలుకోబోరని తెలిపారు. పిల్లలు చేసిన కొంటె పనితో స్కూల్ యాజమాన్యానికి చెమటలు పట్టినంత పనైంది. లిస్టింగ్ చేసిన కొద్ది గంటల్లోనే వెబ్సైట్ నుంచి ఆ లిస్టింగ్‌ను తొలగించినట్లు తెలిపింది. తమ పిల్లలు క్రియేటివిటీకి ఆశ్చర్యపోయినప్పటికీ.. మరీ ఇంత తక్కువ డబ్బులకు లిస్టింగ్ చేయడం వింత కలిగించిందని ఓ ఉపాధ్యాయుడు చిరునవ్వుతో తెలిపారు. ఇదీ చదవండి:ఓడిపోయాడని ముందు మందు బాటిళ్లు.. ప్రాణాలు తీసిన ఆన్లైన్ గేమ్.. ఎంత తాగాడో తెలుసా? -
Viral Video: జస్ట్ మిస్! లేదంటే.. తల పుచ్చకాయలా పగిలిపోయేది
ఒక్కోసారి మనం అనుకున్నట్లుగా జరగదు. ఎంత ప్రీ ప్లాన్‌గా ఉన్న ఊహించిన విధంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. అచ్చం అలానే ఒక జంట ఫ్రాంక్ వీడియో కోసం చేస్తుండగా ఊహించని విధంగా ప్రమాదం ఎదురైంది. ఐతే కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ...భార్యలకు తెలియకుండా ఫ్రాంక్ చేసేందుకు యత్నిస్తాడు. అందులో భాగంగానే విచిత్రమైన వేషధారణలో ఒక గదిలో ఉంటాడు. ఇంతలో అనుకోకుండా అతడి భార్య ఆ గదిలోకి వస్తుంది. అక్కడ ఉన్న తన భర్తను ఎవరో అపరిచిత వ్యక్తి అనుకుని సుత్తితో దాడి చేస్తుంది. ఐతే అతను జస్ట్ తప్పుకుంటాడు కాబట్టి సరిపోతుంది లేదంటే అతడి తల కచ్చితంగా పగిలిపోయేది. అతడి భార్య చేసిన దాడికి అక్కడే ఉన్న అద్దం పగిలిపోతుంది. పాపం అతడి భార్య ఐమ్ సారీ అంటూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. View this post on Instagram A post shared by NowThis (@nowthisnews) (చదవండి: విలన్ రేంజ్లో రెచ్చిపోయిన వ్యాపారి..మహిళను కాలితో తన్ని...) -
‘మీ ఇద్దరిని ఉద్యోగం నుంచి తొలగించి నేను పెద్ద తప్పే చేశా : మస్క్’
ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ తొలగించిన ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఫైర్ చేసిన ఇద్దరు ఉద్యోగుల్ని సంస్థలోకి ఆహ్వానిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఫైర్ చేసిన ఇద్దరు పాపులర్ ఫ్రాంక్ స్టార్లు రాహుల్ లింగ్మా, డానియల్ జాన్సన్‌లను రీహైర్ చేసుకుంటున్నట్లు ఎలాన్ మస్క్ తన ట్వీట్లో పేర్కొన్నారు. మీ ఇద్దరిని ఫైర్ చేసి పెద్ద తప్పే చేశాను. వెల్ కమ్ బ్యాక్ లింగ్మా & జాన్సన్. అంతేకాదు వారిద్దరితో కలిసి దిగిన ఫోటోల్ని మస్క్ నెటిజన్లతో పంచుకున్నారు. Welcoming back Ligma & Johnson! pic.twitter.com/LEhXV95Njj — Elon Musk (@elonmusk) November 15, 2022 అంతా ఉత్తుత్తే! రాహుల్ లింగ్మా, డానియల్ జాన్సన్ విధుల్లోకి తీసుకుంటున్నట్లు మస్క్ చెప్పారు.కానీ వాళ్లిద్దరూ అస్సలు ట్విటర్ ఉద్యోగులే కాదు. మరి వాళ్లిద్దరు ఎవరంటే? ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఖర్చు తగ్గించుకునేందుకు మస్క్ ఆ సంస్థకు చెందిన ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో మస్క్ నిర్ణయాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న రాహుల్ లింగ్మా, డానియల్ జాన్సన్‌లు ఫ్రాంక్ చేశారు. శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విటర్ ప్రధాన కార్యాలయం నుంచి అట్టపెట్టెలు తీసుకొని వస్తూ మీడియా ప్రతినిధుల కంట పడ్డారు. దీంతో అక్కడే ఉన్న మీడియా సిబ్బంది వారిని ప్రశ్నించగా..మస్క్ తమను ఉద్యోగం నుంచి తీసేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్లీ ఒబామా ఉంటే ఈ పరిస్థితి రానిచ్చేవారు కాదంటూ బోరుమన్నారు. అంతే వారిద్దరు చెప్పింది నిజమేనని నమ్మిన దిగ్గజ మీడియా సంస్థలు సైతం పతాక శీర్షికలతో కథనాల్ని ప్రచురించాయి. నెటిజన్లు సైతం మస్క్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ ఫ్రాంక్ స్టార్లని రీహైర్ చేసుకుంటున్నట్లు మస్క్ ఫ్రాంక్ చేయడం కొసమెరుపు. చదవండి👉 ‘బకరాల్ని చేశాడు.. మస్క్ ట్వీట్‌తో మబ్బులు వీడాయ్’ -
‘బకరాల్ని చేశాడు.. మస్క్ ట్వీట్‌తో మబ్బులు వీడాయ్’
ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన అనంతరం.. ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్, పాలసీ చీఫ్ విజయ గద్దె, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగాల్, జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్జెట్‌లను తొలగించారు. అయితే ఉద్యోగుల తొలగింపు అంశం మరో సారి చర్చాంశనీయంగా మారింది. మస్క్ - ట్విటర్ కొనుగోలు కొలిక్కి రావడం. టాప్ ఎగ్జిక్యూటీవ్‌లను మస్క్ తొలగించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. తాజాగా, శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విటర్ ప్రధాన కార్యాలయం నుంచి భారతీయుడు రాహుల్ లిగ్మా, డానియల్ జాన్సన్‌లు అమాయక చక్రవర్తుల్లాంటి మొహాలతో అట్టపెట్టెలు తీసుకొని బయటకు వచ్చారు. దీంతో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు ఏమైందని వారిని ప్రశ్నించగా..మస్క్ తమను ఉద్యోగం నుంచి తీసేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్లీ ఒబామా ఉంటే ఈ పరిస్థితి రానిచ్చేవారు కాదంటూ బోరుమన్నారు. చదవండి👉 భారత్‌పై ఎలాన్ మస్క్ స్వీట్ రివెంజ్! Ligma Johnson had it coming 🍆 💦 pic.twitter.com/CgjrOV5eM2 — Elon Musk (@elonmusk) October 28, 2022 దీంతో వాళ్లు చెప్పింది నిజమని నమ్మిన దిగ్గజ మీడియా సంస్థలు సైతం వీడియోల్ని ప్రసారం చేశాయి. ప్రింట్ మీడియా సైతం పతాక శీర్షికలతో కథనాల్ని వడ్డి వార్చాయి. ఉద్యోగుల తొలగింపుపై నెటిజన్లు మస్క్‌కు శాపనార్ధాలు పెట్టారు. Quite ironic that a major news outlet failed to do basic diligence and fell for a crisis actor prank, resulting in the spread of misinfo, on the first day of new ownership. All you had to do was ask to see a badge or look for bird-themed stuff in the boxes. Also we don’t use Zoom https://t.co/QtIrBjOH3H — Paul Lee (@BeeBimBop) October 28, 2022 ఈ తరుణంలో మీడియా కథనాల్ని మస్క్ ట్వీట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వాళ్లు నిజమైన ట్విటర్ ఉద్యోగులు కాదని, ఫ్రాంక్ స్టార్లని తేలింది. మస్క్ సైతం ఆ కథనాల్ని ట్వీట్ చేస్తూ ఫ్రాంక్ స్టార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్తలపై ట్విటర్ ప్రొడక్ట్ మేనేజర్ పాల్ లీ స్పందించారు. మస్క్ ఉద్యోగుల్ని తొలగించారని వస్తున్న వార్తల్ని ఖండించారు. వాస్తవాల్ని తెలుసుకొని ప్రసారం చేయాలని కోరారు. Software engineer and his buddy got fired from @Twitter #ELONMUSK #Twitter #twitterhq #fired #TwitterTakeover #elonmusktwitter #twitter pic.twitter.com/RkDGXm3nAH — Rezowan Siddique Reza (@Rezowan_) October 28, 2022 చదవండి👉 ఈ కంపెనీ ఉద్యోగులకు బంపరాఫర్, ‘వారానికి 4 రోజులే పని’ -
ఫస్ట్‌టైమ్ డేట్‌కి వెళ్తే.. ఫ్రెండ్స్ ఏం చేశారంటే..
-
ఫస్ట్‌టైమ్ డేట్‌కి వెళ్తే.. ఫ్రెండ్స్ ఏం చేశారంటే..
తొలిసారి డేట్‌కి వెళ్లిన ఓ జంటకి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు స్నేహితులు. ఎంగేజ్మెంట్ లెవల్లో వారి ‘ఫస్ట్‌డేట్’ను సెలబ్రేట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు ఏం జరిగిందంటే..నార్తర్న్ ఐర్లాండ్‌లోని డెర్రీకి చెందిన నీల్ హర్కిన్ (31), జీన్ మెక్ఆలే (31) చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇటీవల తొలిసారి డేట్‌కి వెళ్లాలని నిర్ణయించుకొని లండన్డెరీలోని ఓల్డ్ డాక్స్ బార్కి వెళ్లారు. విషయం తెలుసుకున్న ఆ హోటల్ యజమాని, హర్కిన్ ప్రాణస్నేహితుడు లియామ్ షీల్స్ వారి ఫస్ట్‌డేట్‌ను గుర్తిండిపోయేలా సెలబ్రేట్ చేయాలనుకున్నారు. (చదవండి : పాముల సయ్యాట: ఒళ్లు గగుర్పొడిచే వీడియో!) అనుకున్నట్లే వారికి తెలియకుండా హోటల్లోని సెంట్రల్లో ఓ టేబుల్ వేయించాడు. మిగిలిన డేబుళ్లపై వారి స్నేహితులను కూర్చోబెట్టారు. లోపలికి వచ్చిన హర్కిన్ జంట.. అన్ని టేబుల్లో నిండిపోవడంతో సెంట్రల్లో ఏర్పాటు చేసిన టేబుల్ వద్దకు వచ్చి కూర్చున్నారు. డిన్నర్ కూడా చేశారు. తిరిగి వెళ్లే క్రమంలో ఓ వేటర్ భారీ స్పార్క్లర్తో పాటు ప్రాసికో బాటిల్ తెచ్చి వారి టేబుల్‌పై పెట్టాడు. వెంటనే రెస్టారెంట్‌లోని ఇతర డైనర్లు చప్పట్లు కొడుతూ వారిని విష్ చేస్తున్నారు. ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న ఆ జంట.. సిగ్గుపడుతూ తలలు కిందకు దించుకున్నారు. తామేదో డిన్నర్ చేసి వెళ్దామని వస్తే.. ఈ వేడుకలు ఏంటో వారికి అర్థం కాలేదు. ఆశ్చర్యంగా చుట్టూ చూస్తుండగా, అందరూ చప్పట్లు కొడుతు వారిని అభినందిస్తున్నారు. తర్వాత తెలిసింది ఇది తన స్నేహితుల నిర్వాహకం అని. తమ ఫస్ట్‌డేట్‌ను గుర్తిండిపోయేలా సెలబ్రేట్ చేసినందుకు తమ స్నేహితులకు ఆ జంట కృతజ్ఙతలు తెలిపింది. (చదవండి : వైరల్: ఇందులో నాలుగు ఏనుగులు.. కాదు!) -
అల్లరి మూకల కోసం గాలింపు..!
సాక్షి, గుంటూరు: అల్లరి మూకల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. గుంటూరు నగరంలోని పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరి«ధిలో ఎనిమిదేళ్ల బాలికపై 19 ఏళ్ల యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరి ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. ఓ దశలో పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడడం, పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనను సీరియస్‌గా తీసుకుని పోలీసు ఉన్నతాధికారులు అల్లర్లకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ ఘటనపై ఆరు కేసులు నమోదు చేసిన పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ఫుటేజీలతోపాటు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకారులు వదిలి వెళ్లిన ద్విచక్ర వాహనాల ఆధారంగా ఇప్పటికే 70 మందిని గుర్తించినట్లు తెలిసింది. గురువారం రాత్రి ఎనిమిది మంది ప్రధాన నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. మంగళవారం అర్ధరాత్రి వరకు కొనసాగిన అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు, అక్కడి నుంచి అల్లరిమూకల కోసం వేట కొనసాగించే పనిలో పడ్డారు. బుధవారం నుంచి నగరంలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా ప్రశాంతంగా ఉన్నప్పటికీ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉండటంతో పాతగుంటూరు పరిధిలో పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు. పోలీసులు ఫిర్యాదు సేకరిస్తుండగా.. బాలికపై అత్యాచారయత్నం జరిగిందనే సమాచారం తెలియగానే పోలీసులు అప్రమత్తమై నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకుని పాతగుంటూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాలికతో పాటు, తల్లి దండ్రులు, బంధువులను స్టేషన్‌కు పిలిచి ఫిర్యాదు సేకరించే పనిలో ఉన్న సమయంలో హఠాత్తుగా పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున గుమికూడిన ఆం దోళన కారులు నిందితుడిని తమకు అప్పగించా లంటూ నినాదాలు చేస్తూ స్టేషన్‌ను ముట్టడించారు -
యూ ట్యూబ్ వెర్రి చేష్టలు...
పక్క దోవ ఈ మధ్య వచ్చిన ‘పెళ్లిచూపులు’ సినిమా గుర్తు ఉందా? అందులో యూట్యూబ్ హిట్స్ కోసం హీరో ఒంటి మీద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు నటిస్తూ తండ్రి కంట్లో పడి తిట్లు తింటాడు. ఇప్పుడు చాలామంది కుర్రాళ్ల వెర్రి ఈ స్థాయిలోనే ఉంది.గతంలో కుర్రాళ్లు పరీక్షల్లో మంచి ర్యాంకులు తెచ్ చుకుని నలుగురి దృష్టిలో పడేవాళ్లు. లేదంటే సమాజానికి పనికొచ్చే పనులు చేసి ఆకర్షించేవారు. గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించినా కూడా మెచ్చుకోలు దక్కేది. కాని ఇవన్నీ కష్టమైన పనులు కావడాన అందరి దృష్టిలో పడటానికి ఇవాళ కొందరు కుర్రకారు చేస్తున్న పని వెర్రి వేషాల వీడియోలు తీసి యూ ట్యూబ్‌లో పెట్టడం. వీధి కుక్కను మేడ మీద నుంచి కింద పడేయడం, పులి బోనులో అడుగుపెట్టడం, దెయ్యం వేషాలు వేసుకొని భయపెట్టడం లాంటి చేష్టలు చేసి ఆ వీడియోలు యూట్యూబ్‌లో పెట్టబోయి అభాసు పాలైన వారు ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీకి చెందిన మరో కుర్రాడు కూడా ఊచలు లెక్కబెట్టబోతున్నాడు. ఢిల్లీకి చెందిన సుమిత్‌కు యూ ట్యూబ్‌లో ‘ది క్రేజీ సుమిత్’ అనే చానెల్ ఉంది. దారిన పోయే జనం పై ప్రాంక్స్ (ఆట పట్టించడం) చేసి ఆ వీడియోలను యూ ట్యూబ్‌లో పెడుతుంటాడు. మొన్న జనవరి ఒకటిన ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో ఒక ప్రాంక్ చేశాడు. ఏమిటంటే దారిన పోతున్న ఆడపిల్లలను సడన్‌గా ముద్దు పెట్టి పరిగెత్తడం. ఈ ప్రాంక్‌ను ముగ్గురు నలుగురు ఆడపిల్లలపై చేసి దానిని యూట్యూబ్‌లో పెట్టాడు. రెండు వేల మంది దానిని చూసి ‘లైక్’ కొట్టారు కూడా. కాని ఆ వెంటనే స్త్రీల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఇది ఆట పట్టించడం కాదని లైంగిక దాడి చేయడం అని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఢిల్లీ మహిళా కమిషన్ అధికారి స్వాతి మలివాల్ ఈ వీడియోను ఖండించడంతో వేడి పుంజుకుంది. దాంతో పోలీసులు రంగంలో దిగి ఆ వీడియో ఎక్కడ ఎవరు అప్లోడ్ చేశారన్న దానిపై విచారణ మొదలెట్టారు. ఇది లైంగికదాడిగా భావిస్తే సుమిత్‌పై ఐ.పి.సి. సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి జైలుకు పంపే అవకాశం ఉంది. కాని ఇంతలోనే సుమిత్ ఆ వీడియోని తొలగించి క్షమాపణ పోస్ట్ పెట్టి, చెంపలు వేసుకున్నాడు. ఇలా మహిళలు వ్యతిరేకిస్తారని ఊహించలేకపోయానని ఏదో అందరూ ఎంజాయ్ చేస్తారని భావించానని కనుక క్షమించమని వేడుకున్నాడు. కాని వ్యవహారం అంత సులభంగా అతణ్ణి వదిలిపెట్టేలా లేదు.కెరీర్‌పై దృష్టి పెట్టాల్సిన వయసులో కుర్రాళ్లు ఇలాంటి వైపరీత్యాలకు పోయి జీవితాలు పాడు చేసుకోవడం ఈ కాలపు విషాదం. -
కలల వేదిక.. కాకూడదు కల్లోలాలకు వేదిక!