Viral Video: Man Scared His Wife Nearly Crushed Head With A Hammer As Scary Prank Go Wrong - Sakshi
Sakshi News home page

Viral Video: జస్ట్‌ మిస్‌! లేదంటే.. తల పుచ్చకాయలా పగిలిపోయేది

Published Tue, Dec 13 2022 4:09 PM | Last Updated on Tue, Dec 13 2022 7:27 PM

Man Scared His Wife Nearly Crushed Head As Scary Prank Go Wrong - Sakshi

ఒక్కోసారి మనం అనుకున్నట్లుగా జరగదు. ఎంత ప్రీ ప్లాన్‌గా ఉ‍న్న ఊహించిన విధంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. అచ్చం అలానే ఒక జంట ఫ్రాంక్‌ వీడియో కోసం చేస్తుండగా ఊహించని విధంగా ప్రమాదం ఎదురైంది. ఐతే కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో ...భార్యలకు తెలియకుండా ఫ్రాంక్‌ చేసేందుకు యత్నిస్తాడు.

అందులో భాగంగానే విచిత్రమైన వేషధారణలో ఒక గదిలో ఉంటాడు. ఇంతలో అనుకోకుండా అతడి భార్య ఆ గదిలోకి వస్తుంది. అక్కడ ఉన్న తన భర్తను ఎవరో అపరిచిత వ్యక్తి అనుకుని సుత్తితో దాడి చేస్తుంది. ఐతే అతను జస్ట్‌ తప్పుకుంటాడు కాబట్టి సరిపోతుంది లేదంటే అతడి తల కచ్చితంగా పగిలిపోయేది. అతడి భార్య చేసిన దాడికి అక్కడే ఉన్న అద్దం పగిలిపోతుంది. పాపం అతడి భార్య ఐమ్‌ సారీ అంటూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది.  

(చదవండి: విలన్‌ రేంజ్‌లో రెచ్చిపోయిన వ్యాపారి..మహిళను కాలితో తన్ని...)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement