scared
-
తాలిబన్ల ఆయుధాలపై పాక్ వణుకు!
పాకిస్తాన్లో ఆశ్రయం పొందిన తాలిబన్లు ఇప్పుడు తమ ఆయుధాలతో తమకు నీడ కల్పించిన దేశాన్నే వణికిస్తున్నారు. తాలిబన్ల దగ్గరున్న ప్రాణాంతక, ప్రమాదరక ఆయుధాలను చూసి బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకోవాలంటూ ఐక్యరాజ్య సమితి(యూఎన్ఓ)ని వేడుకుంటోంది.పాకిస్తాన్ తమకు రెండో ఇల్లు అని చెప్పుకునే తాలిబన్లు పాక్‌లో వ్యాపార, వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకున్నారు. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ పరస్పరం సరిహద్దులు పంచుకుంటున్న దేశాలని, మతపరంగా కూడా తాము ఒకే గూటి పక్షులమని తాలిబన్ నేతలు గతంలో ప్రకటించారు. అయితే అదే తాలిబన్ ఇప్పుడు పాకిస్తాన్‌పై వేలాడుతున్న కత్తిలా ప్రమాదకరంగా తయారయ్యింది.తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) వంటి తీవ్రవాద గ్రూపులను నిరాయుధులను చేసేందుకు ‘కాంక్రీట్ క్యాంపెయిన్’ ప్రారంభించాలని పాక్ తాజగా యూఎన్ఓను కోరింది. ఐక్యరాజ్య సమితి సమీక్షా సమావేశంలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ మాట్లాడుతూ ఉగ్రవాద గ్రూపులు ఆధునిక ఆయుధాలను సేకరించడం, వినియోగించడంపై పాకిస్తాన్ తీవ్రంగా ఆందోళన చెందుతున్నదని తెలిపారు. ఆ గ్రూపుల దగ్గరున్న అన్ని ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సంఘటిత ప్రచారం అవసరమని పేర్కొన్నారు. అలాగే ఈ ఉగ్రవాద గ్రూపులు అధునాతన ఆయుధాలను ఎలా సేకరించాయనే దానిపై విచారణ చేపట్టాలని కూడా కోరారు.నిషేధిత ఉగ్రవాద సంస్థ టీటీపీ పాకిస్తాన్ అంతటా షరియా పాలనను నెలకొల్పాలని భావిస్తోంది. ‘డాన్’ వార్తా కథనం ప్రకారం ఉగ్రవాద గ్రూపులు సాగిస్తున్న ఆయుధాల స్మగ్లింగ్, వినియోగంపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఐక్యరాజ్యసమితితో పాటు గ్లోబల్ ఆర్గనైజేషన్‌లోని సభ్య దేశాలపై ఉందని పాక్ రాయబారి వ్యాఖ్యానించారు. ఈ ఆయుధాలను ఉగ్రవాదులు, నేరస్తులు స్వయంగా తయారు చేయరని, వాటిని చట్టవిరుద్ధమైన ఆయుధ మార్కెట్ల నుండి లేదా ఏదైనా దేశాన్ని అస్థిరపరచాలనుకునే సంస్థల నుండి సేకరిస్తారని పాక్ రాయబారి ఐక్యరాజ్య సమితికి వివరించారు. -
'ఓటింగ్‌కు భయపడ్డారు.. సభ మధ్యలోనే వెళ్లిపోయారు..'
కోల్‌కతా: అవిశ్వాస తీర్మాణంపై ఓటింగ్ వేయడానికి ప్రతిపక్షాలు భయపడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మణిపూర్ అంశంపై చర్చించే ఆసక్తే ప్రతిపక్షాలకు లేదని విమర్శించారు. ఈ రోజు బెంగాల్లో నిర్వహించిన పశ్చిమ బెంగాల్ క్షేత్రీయ పంచాయతీ రాజ్ సమ్మేళన్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ మేరకు ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. #WATCH | PM Modi addressing BJP's Kshetriya Panchayati Raj Parishad in West Bengal, via video conferencing "We defeated the opposition's no-confidence motion in Parliament and gave a befitting reply to those spreading negativity in the entire nation. The members of the… pic.twitter.com/tZSgBjehkH — ANI (@ANI) August 12, 2023 అవిశ్వాస తీర్మాణంతో దేశంలో బీజేపీపై దుష్ప్రాచారం లేయాలనుకున్న ప్రతిపక్షాల కుట్రలను ధీటుగా ఎదుర్కొన్నామని ప్రధాని మోదీ అన్నారు. విపక్ష సభ్యులు సభ మధ్యలోనే వెళ్లిపోయారని దుయ్యబట్టారు. ఓటింగ్ వేయడానికి భయపడ్డారని ఆరోపించారు. అవిశ్వాసంలో ప్రతిపక్షాలను ఓడించామని ప్రధాని మోదీ అన్నారు. బెంగాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే దిశగా రెండు రోజుల పాటు పర్యటన చేయనున్నారు. ఈ మేరకు నిన్న రాత్రి కోల్‌కతా ఎయిర్‌పోర్టులో దిగారు. రాష్ట్రంలో నిర్వహించ తలపెట్టనున్న పంచాయత్ కాన్ఫరెన్స్‌లో నడ్డా పాల్గొంటారు. బెంగాల్ బీజేపీ కోర్ కమిటీ, ఎంపీల మీటింగ్, బీజేపీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. Hon. BJP National President Shri @JPNadda Ji was warmly greeted by @BJP4Bengal State President @DrSukantaBJP Ji alongwith other party leaders and karyakartas upon his arrival in Kolkata, West Bengal. pic.twitter.com/uuu8G8ojWK — Office of JP Nadda (@OfficeofJPNadda) August 11, 2023 బెంగాల్లో ఆగష్టు 12న తూర్పు పంచాయతీ రాజ్ పరిషత్ వర్క్‌షాప్‌ను నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అండమాన్ నికోబార్, ఒడిశా, జార్ఖండ్లతో సహా తూర్పు ప్రాంతానికి చెందిన దాదాపు 134 వర్కర్లు, జిల్లా కౌన్సిల్ మెంబర్లతో సమావేశం కానున్నారు. జేపీ నడ్డాతో పాటు బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్‌తో సహా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా వర్చుల్‌గా పాల్గొననున్నారు. Hon. BJP National President Shri @JPNadda Ji's Public Programs in West Bengal on 12th August 2023. Watch Live- . https://t.co/YU8s4nWcrF . https://t.co/qpljG4G7Jz . https://t.co/NPs3aOvCXh pic.twitter.com/uxx2XD3byf — Office of JP Nadda (@OfficeofJPNadda) August 11, 2023 ఇదీ చదవండి: తప్పుడు వాగ్దానంతో పెళ్లి చేసుకుంటే.. ఇకపై పదేళ్ల జైలు.. -
కుక్కపిల్లలను భయపెట్టాలనుకున్నారు.. కానీ.. తల్లి కుక్క ఎంట్రీతో సీన్ రివర్స్..
కొత్త వ్యక్తులు కనిపిస్తే కుక్కలు మొరగడం ప్రారంభిస్తాయి. ఇంకా కోపం ఎక్కువ ఉన్న కుక్కలైతే అస్సలు ఊరుకోవు. వెంబడించి మరీ దాడి చేసే ప్రయత్నం చేస్తాయి. అలాంటి సమయాల్లో బెదిరిస్తే కొన్నికుక్కలు భయంతో పారిపోతాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఎదురైంది ఇద్దరు యువకులకు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. వీడియోలో చూపిన విధంగా.. ఇద్దరు యువకులు దారి వెంట మాట్లాడుకుంటూ వెళుతున్నారు. వారిని చూసిన రెండు కుక్క పిల్లలు దాడి చేసే ప్రయత్నం చేశాయి. కుక్క పిల్లలే కదా..! అన్నట్లు ఒక్కసారిగా ముందుకు వచ్చి వాటిని బెదిరించే ప్రయత్నం చేశారు యువకులు. అంతే.. భయంతో వెనక్కి పరుగులు పెట్టాయి. కానీ అసలు ట్విస్టు ఇక్కడే ఎదురైంది ఆ యువకులకు. వెనక్కి వెళ్లిన కుక్క పిల్లలు తన తల్లిని తీసుకువచ్చాయి. తల్లి కుక్క భారీ ఆకారంలో ఉండటంతో యువకులు.. చచ్చాం.. రా.. బాబోయ్.. అన్నట్లు భయంతో వెనక్కి పరుగులు పెట్టారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. Don't underestimate anything, there is always something stronger than you! Made me laugh a lot! 🤣🤣pic.twitter.com/r8WWEP5NSA — Figen (@TheFigen_) July 8, 2023 వీడియోపై నెటిజన్లు భారీగా స్పందించారు. కుక్క పిల్లలే కదా..! అని తక్కువ అంచనా వేయకూడదని కామెంట్ చేశారు. దేన్ని అండర్ ఎస్టిమేట్ వేయకూడదని.. దాని వెనకాల ఎంత పెద్ద బలం ఉంటుందో తెలియదని చెప్పుకొచ్చారు. ఈ వీడియోను చూసి మరికొంతమంది నవ్వులు కురిపించారు. కానీ కుక్కలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు మరికొందరు. ఇదీ చదవండి: ఇద్దరు యువతులు పెళ్లి.. లింగమార్పిడి చేసుకుని.. -
'భయపడేవాడు కాదు మోదీ..' ప్రతిపక్షాలపై ప్రధాని ఘాటు వ్యాఖ్యలు..
రాయ్‌పుర్: ఈ ఏడాది చివర్లో ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. అవినీతిలో కూరుకుపోయినవారు ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఒకరికొకరు తిట్టుకున్నవారు నేడు కలుసుకోవడానికి సాకులు వెతుకుతున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు రాయ్‌పుర్‌లో ఏర్పాటు చేసిన విజయ్ సంకల్ప్ ర్యాలీలో ఆయన మాట్లాడారు. 'మోదీ భయపడడు..' అవినీతి కోసం హామీలను కాంగ్రెస్ ఇస్తే.. అవినీతిని అంతం చేసే హామీని మోదీ ఇస్తున్నాడని చెప్పారు. అవినీతి లేకుండా కాంగ్రెస్ శ్వాసించలేదంటూ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ భావాజాలంలోనే అవినీతి ఉందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ అడ్డుగోడగా నిలబడిందని అన్నారు. అవినీతిపరులు ప్రతిపక్ష కూటమి పేరుతో తనపై కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిరంతరం తననే అనుసరిస్తున్నారని దుయ్యబట్టారు. తనను ఓడించడం కోసమే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కానీ భయపడేవారు ఎప్పటికీ మోడీ కాలేడంటూ ప్రతిపక్షాలపై ప్రధాని విరుచుకుపడ్డారు. కాగా.. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్, మిజోరాం, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లలో ఎన్నికలు జరుగనున్నాయి. రూ.7 వేల కోట్ల వ్యయంతో.. రాయ్‌పుర్‌లో ప్రధాని సభకు హాజరయ్యేందుకు వస్తుండగా ప్రమాదంలో ముగ్గురు మరణించారు. వారికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. గాయపడ్డవారికి సరైన చికిత్స అందించాలని కోరారు. మృతుల కుటుంబాలకు సహాయం చేస్తామని చెప్పారు. ఈ సభ ముందురోజు ఛత్తీస్‌గఢ్‌లో రూ.7 వేల కోట్ల వ్యయంతో ఎనిమిది ప్రాజెక్టులకు ప్రధాని భూమిపూజ కార్యక్రమం చేశారు. ఇందులో 6,400 కోట్లతో ఐదు జాతీయ రహదారులు నిర్మించనున్నారు. ఇదీ చదవండి: తీవ్ర పదజాలంతో ప్రధానిని తిట్టడం దేశద్రోహమేం కాదు! కానీ.. -
సిద్ధరామయ్య ప్రభుత్వంలో ముసలం.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు..
బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొన్నిప్రాజెక్టుల విషయంలో సీఎం సిద్ధరామయ్య వెనకంజ వేశారు.. కానీ తానైతే ముందుకు వెళ్లేవాడినని వ్యాఖ్యానించారు. దీంతో కర్ణాటకాలో ప్రభుత్వం ఏర్పడి ప్రశాంతంగా సాగుతుందని భావిస్తున్న తరుణంలో డీకే శివకుమార్ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. కెంపెగడౌ జన్మదినం సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన డీకే.. రాష్ట్రంలో ఫ్లై ఓవర్లు, టన్నెల్స్‌ను నిర్మించాలని చాలా వినతులు వస్తున్నట్లు చెప్పారు. 2017లో కర్ణాటకాలో సీఎం సిద్ధరామయ్య కాలంలో బెంగళూరులో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మించడంపై నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గింది. ఈ అంశంపై డీకే శివకుమార్ మాట్లాడుతూ.. 'సీఎం భయపడ్డారు కానీ నీనైతే ప్రాజెక్టుని పూర్తి చేసేవాడిని' అని అన్నారు. అయితే.. డీకే మాట్లాడే సందర్భంలో సీఎం సిద్ధరామయ్య లేకపోవడం గమనార్హం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కర్ణాటకాలో కాంగ్రెస్‌కు అపూర్వ విజయం వరించింది. ఆ తర్వాత సీఎం పీఠం విషయంలో డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య పెద్ద కథే నడిచింది. చివరికి కేంద్రం బుజ్జగింపుతో డీకే వెనక్కి తగ్గగా సిద్ధరామయ్య సీఎం పదవిని స్వీకరించారు. డీకే శివకుమార్ ఉపముఖ్యమంత్రి పదవిని చేప్టటారు. అయితే.. తాజాగా డీకే వ్యాఖ్యలతో కర్ణాటక రాజకీయంలో మరోసారి ఇరువురి నాయకుల మధ్య అంతర్గతంగా పోటీ కొనసాగుతోందా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇదీ చదవండి: అక్కడ కాంగ్రెస్ దూకుడు.. బీజేపీ వెనుకంజ! -
ఇదేం పగరా నాయనా.. 1,100 కోళ్లను భయపెట్టి చంపడమేంది?
బీజింగ్: పక్కింటి వ్యక్తిపై ప్రతీకారంతో ఓ వ్యక్తి విచిత్ర చర్యకు పాల్పడ్డాడు. అతనికి చెందిన 1,100 కోళ్లను భయభ్రాంతులకు గురి చేసి వాటి మరణానికి కారణమయ్యాడు. వినడానికి కాస్త వింతగా ఉన్న ఈ ఘటన చైనాలో గతవారం జరిగింది. ఏం జరిగిందంటే..? గూ, జోంగ్ అనే ఇద్దరు పక్కపక్క ఇళ్లలో నివసిస్తారు. గతేడాది ఏప్రిల్‌లో జోంగ్.. గూ అనుమతి లేకుండా అతని చెట్లను నరికివేశాడు. దీంతో అప్పటి నుంచి గూ పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో తరచూ జోంగ్కు చెందిన కోళ్ల ఫాంకు రాత్రివేళల్లో పలుమార్లు వెళ్లాడు. కొద్ది రోజుల క్రితం ఓ రాత్రి జోంగ్ కోళ్ల ఫాం వద్దకు వెళ్లిన గూ.. సడన్‌గా ఫ్లాష్‌లైట్ ఆన్ చేశాడు. దీంతో అవి భయభ్రాంతులకు గురై అన్నీ ఓ మూలకు వెళ్లాయి. ఈ క్రమంలో ఒకదానిపై మరొకటి పడి 500 కోళ్లు చనిపోయాయి. జోంగ్ ఫిర్యాదు మేరకు గూను పోలీసులు అరెస్టు చేశారు. 500 కోళ్ల మరణానికి కారణమైనందుకు అతనికి రూ.35,713 జరిమానా కూడా విధించారు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన గూకు పక్కింటి వ్యక్తిపై పగ మాత్రం చల్లారలేదు. దీంతో మరోసారి రాత్రివేళ కోళ్లఫాంకు వెళ్లి మళ్లీ ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. ఈ సారి దాదాపు 640 కోళ్లు మరణించాయి. పోలీసులు మళ్లీ అతడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. గూ కావాలనే జోంగ్ కోళ్లను చంపి నష్టం కలిగేలా చేశాడని కోర్టు నిర్ధరించింది. అతడ్ని దోషిగా తేల్చి ఆరు నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. చనిపోయిన 1,100 కోళ్ల విలువ రూ.1,60,000కు పైనే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. చదవండి: నిరుపేదలుగా మారిన బిల్ గేట్స్, ట్రంప్, మస్క్, ‘ఇంత ఘోరంగా ఉన్నారేంటి!’ -
అదానీ వెనుక శక్తుల గురించి ప్రజలకు తెలియాలి: రాహుల్
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌పై పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రూ.లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ వ్యవహారంలో నిజానిజాలు దేశ ప్రజలకు తెలియాలని అన్నారు. అదానీపై చర్చించేందుకు కేంద్రం నిరాకరిస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లుగా తాను ఈ విషయం గురించి గళమెత్తుతూనే ఉన్నానని రాహుల్ అన్నారు. దేశంలో రూ.లక్షల కోట్ల అవినీతి జరిగిందని, దేశ మౌలిక సదుపాయాలను ఒక వ్యక్తి హైజాక్ చేశారని పరోక్షంగా అదానీని ఉద్దేశించి అన్నారు. 'అదానీ గ్రూప్ వెనకాల ఉన్న శక్తుల గురించి ప్రజలకు కచ్చితంగా తెలియాలి. కేంద్రం భయపడుతోంది. అందుకే చర్చకు అంగీకరించడం లేదు. అదానీపై చర్చ జరగకుండా ప్రధాని మోదీ అన్ని ప్రయత్నాలు చేస్తారు.' అని రాహుల్ విమర్శించారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన మరునాటి నుంచి రాజ్యసభ, లోక్‌సభలో కార్యకలాపాలు సజావుగా సాగడం లేదు. అదానీ గ్రూప్ వ్యవహారంపై విపక్షాలు చర్చకు పట్టుబడుతుండగా.. కేంద్రం మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. దీంతో సోమవారం కూడా ఉభయసభలు ఎలాంటి చర్చా లేకుండానే మంగళవారానికి వాయిదాపడ్డాయి. చదవండి: మద్రాస్ హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరి నియామకంపై వివాదం.. -
పక్క సీట్లో సీరియల్ కిల్లర్.. భయంతో వణికిపోయిన మహిళ.. ఫొటో వైరల్..
విమానంలో తన పక్కన కూర్చున్న పెద్దాయన్ను ఓ మహిళా ప్రయాణికురాలు కాస్త అనుమానంగా, భయంగా చూస్తున్న ఈ ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆమె పరిస్థితిని వర్ణిస్తూ బోలెడు కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇంతకీ అందుకు కారణం ఏమిటంటారా? ఆ వ్యక్తి మరెవరో కాదు.. 1970లు, 1980లలో భారత్ సహా వివిధ దేశాల్లో సుమారు 30 హత్యలకు పాల్పడిన సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ (78). డబ్బు కోసం విదేశీ పర్యాటకులను ప్రత్యేకించి యువతులనే టార్గెట్ చేసి హతమార్చిన కిరాతకుడు. ఓ హత్య కేసులో సుమారు 20 ఏళ్లు నేపాల్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించిన అతన్ని.. వృద్ధాప్య సంబంధ అనారోగ్య కారణాల దృష్ట్యా ఆ దేశ సుప్రీంకోర్టు తాజాగా విడుదల చేసింది. దీంతో స్వదేశమైన ఫ్రాన్స్‌కు దోహా మీదుగా వెళ్లేందుకు ఇలా ఖతార్ ఎయిర్వేస్ విమానం ఎక్కినప్పుడు ఓ ప్రయాణికుడు ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీనిపై నెటిజన్లు స్పందించారు. ‘మీరు ఆ మహిళ స్థానంలో కూర్చొనే సాహసం చేయగలరా?’ అని ఒకరు సవాల్ చేయగా ‘నేను కూడా ఆ మహిళలాగే భయంభయంగా చూస్తుంటా’ అని మరొకరు పేర్కొన్నారు. పండుగ సీజన్లో విమాన టికెట్ బుక్ అయిందన్న ఆనందం చివరకు ఇలా నీరుగారిపోయిందని మరొకరు వ్యాఖ్యానించగా ఇది ఆ మహిళ జీవితంలో అత్యంత భయానకమైన సందర్భమని ఇంకొకరు పోస్టు చేశారు. భారత జాతీయుడైన తండ్రికి, వియత్నాం జాతీయురాలైన తల్లికి శోభరాజ్ 1944లో జన్మించాడు. వియత్నాంలో అతను పుట్టిన ప్రాంతం అప్పట్లో ఫ్రాన్స్ వలసరాజ్యం కావడంతో అతనికి పుట్టుకతోనే ఫ్రెంచ్ పౌరసత్వం లభించింది. చదవండి: Japan Snow Storm: జపాన్‌లో మంచు తుఫాన్ విధ్వంసం..17 మంది మృతి -
Viral Video: జస్ట్ మిస్! లేదంటే.. తల పుచ్చకాయలా పగిలిపోయేది
ఒక్కోసారి మనం అనుకున్నట్లుగా జరగదు. ఎంత ప్రీ ప్లాన్‌గా ఉన్న ఊహించిన విధంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. అచ్చం అలానే ఒక జంట ఫ్రాంక్ వీడియో కోసం చేస్తుండగా ఊహించని విధంగా ప్రమాదం ఎదురైంది. ఐతే కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ...భార్యలకు తెలియకుండా ఫ్రాంక్ చేసేందుకు యత్నిస్తాడు. అందులో భాగంగానే విచిత్రమైన వేషధారణలో ఒక గదిలో ఉంటాడు. ఇంతలో అనుకోకుండా అతడి భార్య ఆ గదిలోకి వస్తుంది. అక్కడ ఉన్న తన భర్తను ఎవరో అపరిచిత వ్యక్తి అనుకుని సుత్తితో దాడి చేస్తుంది. ఐతే అతను జస్ట్ తప్పుకుంటాడు కాబట్టి సరిపోతుంది లేదంటే అతడి తల కచ్చితంగా పగిలిపోయేది. అతడి భార్య చేసిన దాడికి అక్కడే ఉన్న అద్దం పగిలిపోతుంది. పాపం అతడి భార్య ఐమ్ సారీ అంటూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. View this post on Instagram A post shared by NowThis (@nowthisnews) (చదవండి: విలన్ రేంజ్లో రెచ్చిపోయిన వ్యాపారి..మహిళను కాలితో తన్ని...) -
ప్రాణ భయంతో వణికిపోతున్న పుతిన్!.. ఏం చేశాడో తెలుసా?
ఉక్రెయిన్‌పై దాడి చేసి యావత్ ప్రపంచాన్ని వణికించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా భయపడుతున్నారు! తనకు ఎవరైనా విషం పెట్టి హత్య చేసే కుట్రలు పన్నతున్నారేమోనని పుతిన్ ఆందోళన పడుతున్నాడట. అందుకే దాదాపు వెయ్యి మంది వ్యక్తిగత సిబ్బందిని తొలగించారని సమాచారం. తొలగించబడిన ఉద్యోగులలో అంగరక్షకులు, వంటవాళ్లు, లాండ్రీలు, వ్యక్తిగత కార్యదర్శులు ఉన్నారు. అయితే ఈ ఉద్యోగులందుర్నీ ఇటీవలే తొలగించారు. వీరి స్థానంలో క్షుణ్ణంగా విచారణ చేసి కొత్తవారిని నియమించారు. పుతిన్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 24న రష్యా సైన్య ఉక్రెయిన్‌పై రోజుల తరబడి యుద్ధం కొనసాగిస్తోంది. దక్షిణ కరోలినాకు చెందిన యుఎస్ చట్టసభ సభ్యుడు లిండ్సే గ్రాహం కూడా రష్యా అధ్యక్షుడి హత్యకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పైగా గ్రాహం.. పుతిన్‌ను నియంత అయిన అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చిన సంగతి తెలిసిందే. యుద్ధం ముగియాలంటే ఒకరిని చంపడమే మార్గమని అన్నారు. పుతిన్‌పై విష ప్రయోగం చేసే సాహసం ఏ విదేశీ ప్రభుత్వమూ చేయదని అది కేవలం రష్యా అధ్యక్ష కార్యాలయం లోపల నుంచే జరుగుతుందంటూ కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. దీంతో పుతిన్ తనను ఎవరైనా హత్య చేస్తారన్న భయంతోనే వ్యక్తిగత సిబ్బందిని తొలగిస్తున్నాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదీ గాక రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్నప్పటి నుంచి పుతిన్‌కి శత్రువులు ఎక్కువయ్యారు. పైగా అమెరికాతోపాటు పలు పాశ్చాత్య దేశాలు కఠినమైన ఆంక్షలు విధించాయి. మరోవైపు స్వదేశంలోనూ పుతిన్‌పై వ్యతిరేకత ఎక్కువైంది. పైగా ఈ యుద్ధం కారణంగా పుతిన్‌కి వ్యతిరేకంగా చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా రష్యన్లు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: పుతిన్‌తో చర్చలు విఫలమైతే.. మూడో ప్రపంచ యుద్ధమే!: జెలెన్స్కీ) -
ఆ వృక్షానికి 24 గంటలు ఎందుకు కాపలా కాస్తున్నారో తెలుసా!!
న్యూఢిల్లీ: చిత్రంలో కనిపిస్తున్నది ఢిల్లీ ఆలిపూర్ సమీపంలోని ఖాంపూర్ గ్రామం వద్ద ఉన్న 120 ఏళ్ల మర్రి చెట్టు. దీన్ని ఈ ప్రాంత వాసులు పవిత్రంగా భావిస్తారు. ఇటీవలే కొందరు దుండగులు దీని కొమ్మలు నరికివేశారు. దీంతో ఇకపై ఈ వృక్షరాజానికి 24 గంటల పాటు వంతులవారీగా కాపలాకాయాలని ఖాంపూర్ గ్రామస్తులు నిర్ణయించారు. స్థానిక రియల్ ఎస్టేట్ మాఫియా ఈ దురాగతాలకు పాల్పడుతోందని ఆరోపించారు. దీనికి రక్షణ కల్పించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరతామన్నారు. ఘటనపై తమకు వివరాలందలేదని అటవీ శాఖ అధికారులు చెప్పారు. (చదవండి: రోడ్లపై నెమళ్ల షికారు: మిస్మరైజింగ్ వైరల్ వీడియో!!) -
బాబోయ్ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషనా!
పోలీసు అధికారులందరూ జంగారెడ్డిగూడెం స్టేషన్ పేరు చెబితేనే భయపడిపోతున్నారు. ఇక్కడికి వస్తే కొద్దికాలానికే టాటా చెప్పేయాల్సి వస్తుందని బెంబేలెత్తుతున్నారు. ఇక్కడ పనిచేసిన సిబ్బందికి వేటు పడటం, స్వల్పకాలంలోనే బదిలీ అవుతుండటం దీనికి ఊతమిస్తోంది. జంగారెడ్డిగూడెం: అయ్యబాబోయ్ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషనా..! ఇదీ కొత్తగా ఇక్కడకు రావాలంటే అధికారుల పరిస్థితి. ఈ ఠాణాకు వచ్చిన ఏ అధికారి కూడా పట్టుమని ఏడా ది కూడా పనిచేయట్లేదు. అసలు ఈ పోలీస్‌స్టేషన్‌కు ఏమైంది?. ఇది ప్రస్తుతం జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌పై చర్చ. ఇక్కడకు వచ్చిన అధికారి పూర్తి కాలం కూడా పనిచేయడం లేదు. మధ్యలో ఒకరిద్దరు పనిచేసినా మిగిలిన వారంతా వివిధ కారణాలతో బదిలీ అయ్యారు. దీంతో జంగారెడ్డిగూడెంలో పనిచేయాలంటేనే అధికారులు భయపడుతున్నారు. (చదవండి: ఊరు ఒకటే.. పంచాయతీలు రెండు) ఈనేపథ్యంలో జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌పైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. అసలు జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌కు ఏమైంది! పోలీస్‌స్టేషన్‌కు వాస్తు లోపం ఉందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. పోలీస్‌స్టేషన్ నిర్మించిన నాటి నుంచి ఇదే పరిస్థితి ఉందని ప్రజలు, సిబ్బంది చర్చించుకుంటున్నా రు. 2007 నుంచి 13 ఏళ్లలో 14 బదిలీలు జరిగాయి. ఇందులో కొన్ని చాలా చిన్న కారణాలతో జరగడం గమనార్హం. పోలీస్‌స్టేషన్‌కు వాస్తుదోషం ఉందని ఈ ప్రాంతవాసులు అనుమానిస్తున్నారు. వాస్తదోషమో లేక గ్రహస్థితో తెలియదుగానీ ఇక్కడకు వచ్చిన తక్కువ కాలంలో పలువురు సస్పెండ్ కావడం లేదా బదిలీ అవడం జరిగిపోతోంది. ఇక్కడ పనిచేసే అధికారులు అనతికాలంలోనే బదిలీపై వెళ్లడంతో, కొత్త గా ఈ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసేందుకు చాలా మంది వెనుకంజ వేస్తున్నట్టు తెలిసింది. కొంతమంది బదిలీపైనా వెళితే.. మరికొందరు సస్పెన్షన్ గురికావడం, ఇంకొందరు చిన్న కారణాలకే వీఆర్‌కు వెళ్లడం చర్చనీయాంశమవుతోంది. ఇవిగో నిదర్శనాలు ♦2007లో సీఐ ఎం.వెంకటేశ్వరరావు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. ఒక మహిళ కేసు విషయంలో వచ్చిన ఆరోపణలే ఇందుకు కారణం. ♦2008 జనవరిలో సీఐ చింతా రాంబాబు, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. పోలీసుల అదుపులో ఉన్న ఓ వ్యక్తి మరణించడంతో వీరిపై వేటు పడింది. ♦తెలంగాణ నుంచి ఎంవీఎస్ మల్లేశ్వరరావు ఎస్సైగా బదిలీపై వచ్చారు. ఐదునెలల తర్వాత ఓ కేసు నమోదు విషయంలో జాప్యం చేశారని ఆయనను సస్పెండ్ చేశారు. ♦ఆ తరువాత ఎస్సైగా వచ్చిన ఏఎన్ఎన్ మూర్తిని 2009 మేలో వీఆర్‌కు, తరువాత సస్పెన్షన్‌కు గురయ్యారు. ♦2014 జనవరిలో వచ్చిన ఎస్సై సీహెచ్ రామచంద్రరా వు, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కారణం. ♦2016లో ఎస్సై ఆనందరెడ్డి ఏడాదిన్నర పనిచేసి వీఆర్‌కు వెళ్లారు. ♦2016 అక్టోబర్‌లో వచ్చిన ఎస్సై ఎం.కేశవరావు 10 నెలలకే వీఆర్‌కు, అక్కడి నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. ♦2017 సెప్టెంబర్‌లో ఎస్సైగా వచ్చిన జీజే విష్ణువర్దన్ 9 నెలలు పనిచేసి వీఆర్‌కు వెళ్లారు. ♦2018 జూలైలో వచ్చిన ఎస్సై అల్లు దుర్గారావు కూడా వీఆర్‌కు వెళ్లారు. ♦ఈ ఏడాది మార్చిలో ఎస్సై ఎస్ఎస్ఆర్ గంగాధర్ స్వల్పకాలంలోనే ఆరోపణలతో తాజాగా వీఆర్‌కు వెళ్లారు. ఈయనతో పాటు సీఐ బీఎన్ నాయక్‌ను కూడా ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపారు. -
టీడీపీ నేతలకు చెమటలు పట్టిస్తున్న జన్మభూమి
-
చంద్రబాబుకు ఇంటిలెజెన్స్ సర్వే టెన్షన్
-
'కడియం, తలసాని భయపడుతున్నారు'
హైదరాబాద్ : తొమ్మిది నెలల సమయంలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, దీంతో ఉప ఎన్నికలకు వెళ్లాలంటే టీఆర్ఎస్ భయపడుతోందని టీడీపీ శాసనసభా పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆయన సోమవారమికక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుత సమయంలో తెలంగాణలో ఉప ఎన్నికలకు వెళితే ఓడిపోతామనే వరంగల్ ఎంపీ పదవికి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే పదవికి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేసేందుకు భయపడుతున్నారన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ పార్టీ గల్లంతు కావడం ఖాయమని ఎర్రబెల్లి జోస్యం చెప్పారు. -
భయం గుప్పిట్లో కలెక్టరేట్ ఉద్యోగులు
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లా పాలనకు కేంద్రబిందువైన కలెక్టరేట్ శిథిలావస్థకు చేరుకోవడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులు భయం గుప్పెట్లో కాలం వెళ్లదీస్తున్నారు. నాలుగేళ్లుగా కలెక్టరేట్ పరిస్థితి అధ్వానంగా మారిం ది. వర్షం పడితే నీరు పలు కార్యాలయాల్లోకి చేరడంతో పాటు శ్లాబు పెచ్చులూడి కిందపడుతున్నాయి. దీనికి తోడు ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కలెక్టరేట్ లోని అన్ని కార్యాలయాలూ నీరు చిమ్ముతున్నాయి. వర్షపు నీరు కార్యాలయాల్లోకి చేరడం తో ఉద్యోగులు తీవ్రఅవస్థలు పడుతున్నారు. సీట్లు తడిసిపోవడంతో కూర్చోవడానికే వారికి కుదరడం లేదు. మరికొన్ని కార్యాలయాల్లో పెచ్చులూడి పడుతుండడంతో శ్లాబ్ ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితి నెలకొంది. కలెక్టరేట్లో వివిధ శాఖలకు చెందిన 35 ప్రభు త్వ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. వందలాది మంది విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రస్తుతం కలెక్టరేట్ పరిస్థితి చూసిన వారంతా అవాక్కవుతున్నా రు. పోర్టికో నుంచి కలెక్టర్ చాంబర్‌తో పాటు అన్ని కార్యాలయాలు నీరు చిమ్మడంతో నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందరి కీ మార్గదర్శకంగా ఉండాల్సిన కలెక్టరేట్ నిర్వహణే అధ్వానంగా ఉంటే మిగిలిన కార్యాల యాల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో బీసీ సంక్షేమశాఖ కార్యాలయం వద్ద, జేసీ చాంబర్ పిట్టగోడలు కూలిపోవడంతో అప్పటి కలెక్టర్ జి.రామనారాయణరెడ్డి హయాంలో కలెక్టరేట్ నిర్మాణానికి రూ.1.80 కోట్లు కావాలని చేసిన ప్రతిపాదనలకు ఇంతవరకు దిక్కులేని పరిస్థితి. నెల్కొంది. ఆ తరువాత కలెక్టర్ వీరబ్రహ్మయ్య హయాంలో ఏయూ ఇంజినీరింగ్ బృందతో సర్వే చేయించగా భవనాన్ని కూల దోయాల్సిన అవసరం లేదు. మరమ్మతులు చేపడితే చాలని ఆ బృందం నివేదిక ఇచ్చింది. అయితే ఆ మరమ్మతులు కూడా సక్రమంగా చేయకపోవడంతో మళ్లీ లీకులమయమవుతోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి కలెక్టరేట్‌కు మరమ్మతు లు చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు.