
న్యూఢిల్లీ: చిత్రంలో కనిపిస్తున్నది ఢిల్లీ ఆలిపూర్ సమీపంలోని ఖాంపూర్ గ్రామం వద్ద ఉన్న 120 ఏళ్ల మర్రి చెట్టు. దీన్ని ఈ ప్రాంత వాసులు పవిత్రంగా భావిస్తారు. ఇటీవలే కొందరు దుండగులు దీని కొమ్మలు నరికివేశారు. దీంతో ఇకపై ఈ వృక్షరాజానికి 24 గంటల పాటు వంతులవారీగా కాపలాకాయాలని ఖాంపూర్ గ్రామస్తులు నిర్ణయించారు. స్థానిక రియల్ ఎస్టేట్ మాఫియా ఈ దురాగతాలకు పాల్పడుతోందని ఆరోపించారు. దీనికి రక్షణ కల్పించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరతామన్నారు. ఘటనపై తమకు వివరాలందలేదని అటవీ శాఖ అధికారులు చెప్పారు.
(చదవండి: రోడ్లపై నెమళ్ల షికారు: మిస్మరైజింగ్ వైరల్ వీడియో!!)
Comments
Please login to add a commentAdd a comment