బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొన్నిప్రాజెక్టుల విషయంలో సీఎం సిద్ధరామయ్య వెనకంజ వేశారు.. కానీ తానైతే ముందుకు వెళ్లేవాడినని వ్యాఖ్యానించారు. దీంతో కర్ణాటకాలో ప్రభుత్వం ఏర్పడి ప్రశాంతంగా సాగుతుందని భావిస్తున్న తరుణంలో డీకే శివకుమార్ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. కెంపెగడౌ జన్మదినం సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన డీకే.. రాష్ట్రంలో ఫ్లై ఓవర్లు, టన్నెల్స్‌ను నిర్మించాలని చాలా వినతులు వస్తున్నట్లు చెప్పారు.
2017లో కర్ణాటకాలో సీఎం సిద్ధరామయ్య కాలంలో బెంగళూరులో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మించడంపై నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గింది. ఈ అంశంపై డీకే శివకుమార్ మాట్లాడుతూ.. 'సీఎం భయపడ్డారు కానీ నీనైతే ప్రాజెక్టుని పూర్తి చేసేవాడిని' అని అన్నారు. అయితే.. డీకే మాట్లాడే సందర్భంలో సీఎం సిద్ధరామయ్య లేకపోవడం గమనార్హం.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కర్ణాటకాలో కాంగ్రెస్‌కు అపూర్వ విజయం వరించింది. ఆ తర్వాత సీఎం పీఠం విషయంలో డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య పెద్ద కథే నడిచింది. చివరికి కేంద్రం బుజ్జగింపుతో డీకే వెనక్కి తగ్గగా సిద్ధరామయ్య సీఎం పదవిని స్వీకరించారు. డీకే శివకుమార్ ఉపముఖ్యమంత్రి పదవిని చేప్టటారు. అయితే.. తాజాగా డీకే వ్యాఖ్యలతో కర్ణాటక రాజకీయంలో మరోసారి ఇరువురి నాయకుల మధ్య అంతర్గతంగా పోటీ కొనసాగుతోందా? అనే సందేహాలు మొదలయ్యాయి.
ఇదీ చదవండి: అక్కడ కాంగ్రెస్ దూకుడు.. బీజేపీ వెనుకంజ!
Comments
Please login to add a commentAdd a comment